Home
How to

సేల్‌లో ఫోన్ కొనుగోలు చేశారా.. మీ ఫోన్‌ ఒరిజినల్ లేదా ఫేక్‌ అని ఎలా గుర్తించాలి?

పండుగ సీజన్ సందర్భంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్‌ సంస్థలతోపాటు ప్రముఖ సంస్థలు కూడా సేల్‌ నిర్వహిస్తున్నాయి. ఆఫ్‌ లైన్ స్టోర్‌లలోనూ సేల్ ఆఫర్లు అందుబాటులో ఉంటున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ లపై అనేక సంస్థలు భారీ డిస్కౌంట్‌ లు అందిస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో మోసాలు జరిగేందుకు (How To Find Fake Smartphone) ఎక్కువ అవకాశం ఉంటుంది.

ఆఫ్‌లైన్ స్టోర్‌ లలో కొనుగోలు చేసిన ఉత్పత్తుల్లో ఏమైనా లోపాలు తలెత్తినా, డ్యామేజీని గుర్తించినా, స్టోర్‌ కు వెళ్లి రీప్లేస్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. అదే ఆన్‌లైన్ స్టోర్‌ లలో కొన్ని సార్లు నకిలీ ఉత్పత్తులు డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల అనేక సంస్థలు ఇలాంటి సేల్స్‌ సమయంలో అధికారిక సెల్లర్స్‌ జాబితాను వెల్లడిస్తున్నాయి.

How to know your smartphone is original or Fak

అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) సేల్స్‌ సెప్టెంబర్‌ 23 నుంచి ప్రారంభం అయ్యాయి. అయితే అంత కంటే ముందుగానే శాంసంగ్‌, షియోమీ, రియల్‌మి వంటి సంస్థలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లో తమ అధికారిక సెల్లర్స్‌ జాబితాను వెల్లడించారు. అయితే మీరు కొనుగోలు చేసిన స్మార్ట్‌ ఫోన్‌ ఒరిజినల్‌ లేదా నకిలీదా అని సింపుల్‌ గా ఎలా తెలుసుకోవచ్చు.

కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన సంచార్ సాథీ (Sanchar Saathi) వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా మీరు కొనుగోలు చేసిన స్మార్ట్‌ఫోన్‌ ఒరిజినల్ లేదా నకిలీదా అని తెలుసుకోవచ్చు. ఇందుకోసం మొబైల్‌ నంబర్‌తోపాటు మీ ఫోన్ IMEI నంబర్‌ మీ దగ్గర ఉండాలి.

> సంచార్‌ సాథీ అధికారిక వెబ్‌సైట్‌ sancharsaathi.gov.in సందర్శించాలి.
> హోమ్‌ పేజీలో సిటిజన్‌ సెంట్రిక్‌ సర్వీసెస్‌ పైన క్లిక్‌ చేయాలి.
> అక్కడ మీకు అనేక ఆప్షన్‌ లు కనిపిస్తాయి.
> అందులో Know Genuineness Of Your Mobile handset పైన క్లిక్‌ చేయాలి.
> అనంతరం అక్కడున్న captcha ను నమోదు చేయాలి.
> మీ యాక్టివ్‌ ఫోన్‌ నంబర్‌ ను కూడా నమోదు చేయాలి.
> ఆ నంబర్‌ కు వచ్చిన OTP నమోదు చేసి Submit పైన క్లిక్ చేయాలి.
> అప్పుడు మీ IMEI నంబర్‌ ను నమోదు చేయాలనే ఆప్షన్ కనిపిస్తుంది.
> అక్కడ మీ ఫోన్ IMEI నంబర్‌ ను ఎంటర్‌ చేశాక, అక్కడ మీ ఫోన్‌ వివరాలు కనిపిస్తాయి.
> వివరాలు కనిపించలేదంటే మీ ఫోన్‌ నకిలీదని మీరు నిర్ణయానికి రావచ్చు.

Take a Poll

మీ స్మార్ట్‌ ఫోన్ నుంచి నేరుగా మెసేజ్‌ చేసి కూడా ఈ వివరాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం KYM అని టైప్‌ చేసి 14422 నంబర్‌ కు SMS పంపాల్సిన ఉంటుంది. ఈ విధానంలోనూ మీ ఫోన్‌ గురించి తెలుసుకోవచ్చు. మీ IMEI నంబర్‌ కోసం కింది విధంగా తెలుసుకోండి.

> IMEI నంబర్‌ను ఎలా తెలుసుకోవాలి?
కొత్తగా ఫోన్ కొనుగోలు చేస్తే.. ఆ ఫోన్ రిటైల్ బాక్స్‌ పైన IMEI నంబర్‌ ఉంటుంది. లేదా మీ ఫోన్ నుంచి *#06# ను డయల్‌ చేసి కూడా IMEI నంబర్‌ ను కనుక్కోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
How to know your smartphone is original or Fake, sancharsaathi will help you
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X