మీ ఇంటి దగ్గర నుంచే సిమ్ ఆధార్ వెరిఫికేషన్, IVR ద్వారా..

Written By:

మొబైల్ నంబర్‌‌ను మీ ఆధార్ నంబర్‌‌తో రీ-వెరిఫై చేసుకునేందుకు కేవలం రెండు నెలలే గడువు ఉందన్న విషయం తెలిసిందే. దీనికి తగ్గట్లుగానే ఆయా టెలికాం కంపెనీలు కస్టమర్లను ఆధార్‌తో మీ మొబైల్ నంబర్‌ను రీ-వెరిఫై చేసుకోవాలని కోరుతున్నాయి. దీని కోసం మీరు నెట్‌వర్క్‌కు చెందిన రిటైల్ స్టోర్లకు వెళ్లనవసరం లేకుంగా ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు ఐవీఆర్ సిస్టం తీసుకువచ్చింది. దీని ద్వారా మీరు వెరిఫై చేసుకోవచ్చు.

అనిల్ అంబానీకి ఊహించని గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన ముఖేష్ అంబాని !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్టెప్ 1

మీ వెరిఫై చేసుకోవాల్సిన మొబైల్ నంబర్ నుంచి 14546కు కాల్ చేయాలి. అప్పుడు మీరు ఇండియనా లేదా ఎన్ఆర్ఐ కస్టమరా అని అడుగుతుంది. సమాధానం ఇచ్చి ఆ తర్వాత 1ని ప్రెస్ చేసి మీ ఆధార్ నంబర్‌ను పొందుపరచాలి.

ప్టెప్ 2

ఆధార్ నంబర్‌ను ఖరారు చేసుకోవడానికి మరొకసారి 1ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీ మొబైల్‌కి ఒక వన్‌టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఇప్పుడు మీ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ప్టెప్ 3

యూఐడీఏఐ డాటా బేస్ నుంచి మీ పేరు, ఫొటో, పుట్టినతేదీని మీ ఆపరేటర్ తీసుకోవడం మీకు ఇష్టమేనా అడుగుతుంది. దానికి మీరు సమాధానం ఇవ్వాలి.

ప్టెప్ 4

ఆ తరవాత మీ మొబైల్ నంబర్ చివరి నాలుగు అంకెలను ఎంటర్ చేసి ధ్రువీకరించుకోవాలి. ఇప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా మీకు మరో ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసిన తరువాత చివరిగా ఆధార్-మొబైల్ నంబర్ రీ-వెరిఫికేషన్‌ను పూర్తిచేయడానికి 1ని ప్రెస్ చేయాలి.

ప్టెప్ 5

ఒకవేళ మీకు ఇంకో ఫోన్ నంబర్ ఉంటే 2ని ప్రెస్ చేసి మళ్లీ పైన పేర్కొన్న విధానం ద్వారానే దానికి కూడా ఆధార్‌ను లింక్ చేసుకోవాలి. ఈ సమయంలో మీ రెండో ఫోన్ నంబర్ కూడా ఆన్‌లో ఉండాలి. ఎందుకంటే దానికి కూడా ఓటీపీ వస్తుంది.

గమనిక

మీ మొబైల్ నంబర్‌‌కు వచ్చిన ఓటీపీ 30 నిమిషాల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. కాబట్టి ఈ లోపలే ఆధార్ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఇప్పటికే ఈ ప్రక్రియను ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ యాక్టివేట్ చేశాయి. బీఎస్‌ఎన్‌ఎల్, జియో సంస్థలు యాక్టివేట్ చేయాల్సి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to Link Aadhaar Number, Mobile Phone Using IVR for Re-Verification More News at Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot