రైల్వే తత్కాల్ టికెట్లు బుకింగ్ చేయాలంటే కచ్చితంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సిందే.. వివరాలు..!
Railway Tatkal Booking : భారతీయ రైల్వే ఇటీవల కాలంలో ప్రయాణికులు సౌకర్యం కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. దీంతోపాటు మౌలిక వసతుల పరంగానూ వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. గత కొన్ని సంవత్సరాల్లో తత్కాల్ టికెట్ల బుకింగ్ పై అనేక ఫిర్యాదులు నమోదయ్యాయి. అసలైన ప్రయాణికులకు కాకుండా ఏజెంట్లు సహా ఇతర మార్గాల్లో ప్రయత్నం చేసే వారికే ఎక్కువ శాతం తత్కాల్ టికెట్లు లభిస్తున్నాయని ఎప్పటి నుంచో ఫిర్యాదులు అందుతున్నాయి.
ఈ ఫిర్యాదులపై రైల్వే శాఖ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ ఆధారిత బుకింగ్ ద్వారానే తత్కాల్ టికెట్లు బుకింగ్ చేసుకొనేందుకు అనుమతిస్తున్నట్లు చెప్పింది. అంటే ఆధార్ అథెంటికేషన్ చేసిన యూజర్లు మాత్రమే తమ యూజర్ ఐడీల ద్వారా తత్కాల్ టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. ఈ నిర్ణయం 2025 జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది.

దీంతోపాటు జులై 15 2025 నుంచి మరో కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. ఆధార్ నంబర్‌తో రిజిస్ట్రర్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ని నమోదు చేస్తేనే తత్కాల్ టికెట్లు బుకింగ్ అయ్యేలా బుకింగ్ సిస్టమ్‌లో మార్పులు చేసింది. దీంతోపాటు ఏజెంట్ల బుకింగ్ సమయాల్లోనూ మార్పులు చేసింది.
సాధారణంగా AC క్లాస్ తత్కాల్ టికెట్ల బుకింగ్ 10AM గంటలకు ప్రారంభం అవుతుంది. అదే నాన్ AC క్లాస్ తత్కాల్ టికెట్ల బుకింగ్ 11 గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే IRCTC ఏజెంట్లు.. 30 నిమిషాల తర్వాత మాత్రమే బుకింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది.

* IRCTC ఖాతాలను ఆధార్‌తో ఎలా లింక్ చేయాలి?
స్టెప్ 1 : IRCTC వెబ్‌సైట్‌లో యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
స్టెప్ 2 : అనంతరం ప్రొఫైల్ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.
స్టెప్ 3 : అక్కడ మెనూలో Link Aadhaar ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
స్టెప్ 4 : అనంతరం ఆధార్‌లో ఉన్నట్లుగా పేరు నమోదు చేయాలి.
స్టెప్ 5 : ఆ తర్వాత 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
స్టెప్ 6 : ఆధార్‌తో రిజిస్టర్ చేసి ఉన్న మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ని నమోదు చేయాలి.
స్టెప్ 7 : చివరిగా Verify పైన క్లిక్ చేసి, Update ట్యాప్ పైన క్లిక్ చేసి, ప్రక్రియను పూర్తి చేయాలి.
స్టెప్ 8 : అన్ని సక్రమంగా ఉంటే ఆధార్ వెరిఫికేషన్ పూర్తయినట్లు అక్కడే కనిపిస్తుంది.
ఇటీవలే రైల్వే కొత్త యాప్‌ను లాంచ్ చేసింది. రైల్‌వన్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, iOS యూజర్లు డౌన్‌లోడ్ చేసుకొనేందుకు అందుబాటులో ఉంది. ఈ యాప్ ద్వారా టికెట్ల బుకింగ్ మరియు ప్లాట్‌ఫాం, జనరల్ టెకెట్ల బుకింగ్ తోపాటు PNR స్టేటస్, ట్రైయిన్ ట్రాకింగ్, ఫిర్యాదులు చేసేందుకు వీలుంది.
దీంతోపాటు ఫుడ్ ఆర్డర్ కూడా ఇదే యాప్ నుంచే చేయవచ్చు. గతంలో ఈ సర్వీసుల కోసం అనేక ప్లాట్‌ఫాంలను ఉపయోగించాల్సి వచ్చేది. భారతీయ రైల్వే తొలుత స్వరైల్ పేరుతో బీటా టెస్టింగ్ నిర్వహించింది. అనంతరం రైల్‌వన్ పేరుతో పూర్తి స్థాయి వెర్షన్‌ను విడుదల చేసింది.


Click it and Unblock the Notifications








