PF అకౌంట్ లేదా UAN తో ఆధార్‌ని లింక్ చేయడం ఎలా?

|

ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలలో పనిచేస్తున్న వారికి ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) PF గురించి ప్రత్యేకంగా తెలపవలసిన అవసరం లేదు. అయితే ఈ PF కంట్రిబ్యూటర్లు తమ ఆధార్ నంబర్‌ను యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) తో లింక్ చేయడం తప్పనిసరి చేసింది. సెప్టెంబర్ 1, 2021 నుండి డిఫాల్టర్లు PF సేవలను పొందలేరని EPFO పేర్కొంది. ఆగష్టు 31, 2021 లోపు ఖచ్చితంగా UAN తో ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి చేసింది.

How to Link Aadhaar Number With PF Account or UAN?

ఆధార్ మరియు UAN లను లింక్ చేయడంలో విఫలమైతే EPF అకౌంటులో యజమానుల సహకారాన్ని నిలిపివేయడానికి దారితీస్తుందని EPFO తెలియజేసింది. అంతేకాకుండా PF ఖాతాదారుడు ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ (ECR) దాఖలు చేయలేరు. అదనంగా ఆగస్టు 31 గడువుకు ముందు ఆధార్ మరియు UAN ధృవీకరణ చేయకపోతే ఉద్యోగులు EPFO అందించే ఇతర సేవలను పొందలేరు.

How to Link Aadhaar Number With PF Account or UAN?

EPFO గతంలో జూన్ 1, 2021 న ఆధార్ మరియు UAN లింకింగ్ కోసం గడువును నిర్దేశించింది. ఆధార్ ధృవీకరించబడిన UAN లతో ECR ని దాఖలు చేయడానికి అమలు తేదీ తరువాత సెప్టెంబర్ 1, 2021 వరకు పొడిగించబడింది. మీరు ఇప్పటికీ మీ ఆధార్‌ని PF అకౌంటుతో లింక్ చేయకపోతే కనుక వెంటనే చేయండి. మీ ఆధార్‌ని PF అకౌంట్‌తో లింక్ చేయడానికి మీరు epfindia.gov.in ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అకౌంటుకు వెళ్లవచ్చు.

PF అకౌంట్ లేదా UAN తో ఆధార్‌ని లింక్ చేసే విధానం

How to Link Aadhaar Number With PF Account or UAN?

స్టెప్1: EPFO సభ్యుల పోర్టల్‌కి వెళ్లి మీ యూజర్ పేరు మరియు పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.

స్టెప్ 2: తరువాత టాప్ మెనూ బార్‌లో కనిపించే 'మేనేజ్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 3: డ్రాప్-డౌన్ నుండి KYC ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 4: కొత్త డాక్యుమెంట్ రకాల జాబితాను చూపుతూ కొత్త పేజీ ఓపెన్ చేయబడుతుంది. అక్కడ నుండి "ఆధార్" ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 5: మీ యొక్క ఆధార్ నంబర్ మరియు పేరును నమోదు చేయండి. తరువాత "సేవ్" ఎంపికపై క్లిక్ చేయండి.

స్టెప్ 6: ఆధార్ వివరాలను సేవ్ చేసిన తర్వాత మీ ఆధార్ UIDAI డేటా నుండి ధృవీకరించబడుతుంది.

స్టెప్ 7: KYC డాక్యుమెంట్ ఆమోదం పొందిన తర్వాత మీ ఆధార్ PF అకౌంటుతో లింక్ చేయబడుతుంది.

Best Mobiles in India

English summary
How to Link Aadhaar Number With PF Account or UAN?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X