ఓటరు ఐడీతో ఆధార్ లింక్ చేయడం ఎలా..?

దేశంలో ఒకే వ్యక్తి పేరు మీద రెండు ఓటు గుర్తింపు కార్డులు లేకుండా చర్యలు తీసుకునేందుకు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అర్హులైన ప్రతి ఒక్కరు తమ ఓటు గుర్తింపు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలిన కేంద్ర ఎన్నికల నిరుడే సూచించింది.

ఓటరు ఐడీతో ఆధార్ లింక్ చేయడం ఎలా..?

ఓటర్ ఐడీ కార్డులను బయో మెట్రిక్ సమాచారం ఉన్న ఆధార్ కార్డుకు లింక్ చేయడం ద్వారా ఒకే పేరు పై వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న ఓటర్ ఐడీ కార్డులను గుర్తించి వాటిని ఏరివేయవచ్చన్నది ప్రభుత్వ సంకల్పం. మీరు ఇప్పటి వరకు మీ ఓటర్ ఐడీని ఆధార్‌తో అనుసంధానం చేసుకోని పక్షంలో, ఈ క్రింది సూచనలను అనుసరించి వెంటనే మీ ఓటు గుర్తింపు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోండి.

Read More : ఫోన్ మాట్లాడుతూనే నెంబర్ సేవ్ చేయటం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

3 మార్గాలు...

మీ ఓటర్ ఐడీ కార్డును ఆధార్‌కు అనుసంధానించుకునేందుకు 3 మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు..

- ఆన్‌లైన్ ద్వారా
- ఎస్ఎంఎస్ ద్వారా
- కాల్ సెంటర్ ద్వారా

తన ఓటర్ ఐడీని, తన ఆధార్‌ కార్డుతో లింక్ చేసే క్రమంలో యూజర్ వద్ద తన ఆధార్ అలానే ఐడీ కార్డులు తప్సనిసరిగా ఉండాలి.

 

ఆన్‌లైన్ ద్వారా...

ముందుగా నేషనల్ ఒటర్స్ సర్వీస్ పోర్టల్ (http://nvsp.in/) వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. సైట్ ప్రదాన వెబ్ పేజీలో కనిపించే కనిపించే Feed Your Aadhar Number ఆప్షన్ పై క్లిక్ చేయండి. వెంటనే ఓ మెనూ బాక్స్ ఓపెన్ అవుతుంది.

ఆన్‌లైన్ ద్వారా...

అందులో మీ పేరుతో (ఆధార్‌లో ఉన్న విధంగా) పాటు మీ ఓటర్ ఐడీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడీలను ఎంటర్ చేసి submit బటన్ పై క్లిక్ చేయండి.

ఆన్‌లైన్ ద్వారా...

సబ్మిషన్ విజయవంతంగా పూర్తియినట్లయితే కన్ఫర్మేషన్ ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్‌ మీకు అందుతుంది. ఆన్‌లైన్ ద్వారా ఓటర్ ఐడీ కార్డును ఆధార్‌కు లింక్ చేసే ప్రక్రియను మీరు విజయవంతంగా పూర్తి చేసినట్లే.

ఎస్ఎంఎస్ ద్వారా ..

ముందుగా మీ మొబైల్ ఫోన్‌లోని ఎస్ఎంఎస్ ఆప్షన్‌లోకి వెళ్లండి.

ఎస్ఎంఎస్ ద్వారా ..

అక్కడ ECILINK స్పేస్ Voter ID స్పేస్ Aadhar Number టైప్ చేసి 51969కు ఎస్ఎంఎస్ చేయండి.

ఎస్ఎంఎస్ ద్వారా ..

సబ్మిషన్ విజయవంతంగా పూర్తియినట్లయితే కన్ఫర్మేషన్ ఎస్ఎంఎస్ తిరిగి మీ పోన్‌కు అందుతుంది.

కాల్ సెంటర్ ద్వారా..

కాల్ సెంటర్‌కు కాల్ చేసే ముందు, మీ వద్ద ఆధార్ అలానే ఐడీ కార్డులు తప్సనిసరిగా ఉండాలి.

కాల్ సెంటర్ ద్వారా..

మీ మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ నుంచి 1950 నెంబర్‌కు కాల్ చేయటం ద్వారా కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్స్ మీ ఓటర్ ఐడీ, ఆధార్ ఐడీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ వివరాలను అడిగి తెలుసుకుంటారు.

కాల్ సెంటర్ ద్వారా..

తద్వారా కాల్ సెంటర్ ద్వారా ఓటర్ ఐడీ కార్డును ఆధార్‌కు లింక్ చేసే ప్రక్రియ విజయవంతంగా పూర్తవుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to Link Aadhar with Voter Id Card. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot