మీ పాస్‌పోర్ట్‌తో కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను లింక్ చేయడం ఎలా??

|

ప్రస్తుత ఫాస్ట్ ప్రపంచంలో యువత చదవడం కోసం, జాబ్ మరియు టూర్ వంటి విషయాలకు విదేశాలకు వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. అయితే దేశ సరిహద్దు వెలుపల వెళ్లడానికి చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్‌ను కలిగి ఉండటం చాలా అవసరం అని గమనించాలి. అయితే కరోనా యుగంలో ఎక్కడికైనా ప్రయాణించడానికి ప్రధాన షరతు కరోనా మార్గదర్శకాలను అనుసరించడం. వీటిలో మరి ముఖ్యమైన విషయం ఏమిటంటే టీకాలు వేసిన సర్టిఫికేట్‌ను కలిగి ఉండడం. టీకా సర్టిఫికేట్‌ లేకపోతే మన దేశంలో ప్రయాణించే విమానాలలో కూడా అనుమతి లభించదు.

How to Link Covid-19 Vaccine Certificate With Your Passport?

కోవిడ్ సమయంలో ప్రయాణించడానికి సంబంధించి అన్ని దేశాలకు వారి స్వంత నియమాలు ఉన్నాయి. కోవిడ్-19 వ్యాక్సినేషన్‌కు సంబంధించి భారత కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం విదేశాలకు చదువులు, ఉద్యోగాలు లేదా ప్రయాణాల కోసం వెళ్లే వ్యక్తులు తమ పాస్‌పోర్ట్‌తో కోవిడ్-19 టీకా ధృవీకరణ పత్రాన్ని లింక్ చేయాలి. మీరు కూడా ఏదైనా చదువు లేదా ఉద్యోగానికి సంబంధించి విదేశాలకు వెళ్లాలనుకుంటే మీకు అది ఖచ్చితంగా అవసరం అవుతుంది. అయితే సర్టిఫికేట్‌ను ఎలా లింక్ చేయాలి వంటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

పాస్‌పోర్ట్‌తో కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను లింక్ చేసే విధానం

How to Link Covid-19 Vaccine Certificate With Your Passport?

STEP1: పాస్‌పోర్ట్‌తో వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను లింక్ చేయడానికి ముందుగా cowin.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లండి.

STEP2: ఇక్కడ లాగిన్ చేసి సమస్యను లేవనెత్తడానికి ఎంపికను ఎంచుకోండి.

STEP3: దీన్ని చేసిన తర్వాత అందులో కనిపించే పాస్‌పోర్ట్ ఎంపికను ఎంచుకోండి.

STEP4: ఇక్కడ డ్రాప్-డౌన్ మెను నుండి పర్సన్ ను ఎంచుకోండి.

STEP5: ఇలా చేసిన తర్వాత పాస్‌పోర్ట్ నంబర్‌ను నమోదు చేయండి.

STEP6: తరువాత చివరగా అన్ని వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయండి.

STEP7: ఇలా చేసిన తర్వాత మీరు తక్కువ సమయంలో పాస్‌పోర్ట్ లింక్‌తో కొత్త కోవిడ్-19 టీకా సర్టిఫికేట్ పొందుతారు.

STEP8: మీరు ఈ కొత్త సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా సేవ్ చేసుకోవచ్చు.

టీకా సర్టిఫికేట్‌లో పాస్‌పోర్ట్ నంబర్‌ను లింక్ చేయడానికి అభ్యర్థి యొక్క వివరాలు ఒకే విధంగా ఉండాలి. సర్టిఫికేట్‌లో మీ పేరు తప్పు అని అనుకుంటే కనుక మీరు దాని పోర్టల్‌ని సందర్శించడం ద్వారా దాన్ని సరిచేయవచ్చు. కానీ ఇక్కడ పేరు మార్చే ఎంపిక ఒక్కసారి మాత్రమే అందుబాటులో ఉందని గుర్తుంచుకోండి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా పని చేయాలి.

టీకాలు వేసిన ప్రయాణికుల కోసం ప్రపంచవ్యాప్తంగా సెట్ ప్రమాణాలు ఏవి లేవు. చాలా దేశాలు వారి స్వంత నియమాలను కలిగి ఉన్నాయి. కానీ ఒక విషయం స్పష్టంగా ఉంది మీరు టీకాలు వేసుకోకపోతే కనుక ఇండియాలో అంతర్జాతీయ ప్రయాణానికి అనుమతి లేదు. అందువల్ల విదేశాలకు వెళ్లాలనుకునే వారు తమ పాస్‌పోర్ట్‌ను వ్యాక్సిన్ సర్టిఫికేట్‌తో లింక్ చేయడం ముఖ్యం.

Best Mobiles in India

Read more about:
English summary
How to Link Covid-19 Vaccine Certificate With Your Passport?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X