IRCTC అకౌంట్‌తో ఆధార్ నంబర్‌ను ఎలా లింక్ చేయాలి.. పూర్తి వివరాలు..!
భారతీయ రైల్వే (Indian Railway) ఇటీవల కాలంలో టికెట్ బుకింగ్ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చింది. జనరల్ టికెట్ల బుకింగ్ కు మినహా అన్ని రకాల టికెట్లు రిజర్వేషన్ ఆధార్ అథెంటికేషన్ ను తప్పనిసరి చేసింది. అంటే IRCTC అకౌంట్ కు ఆధార్ నంబర్ ను లింక్ చేయాల్సి ఉంటుంది. సాధారణ ప్రయాణికులకు టికెట్లు లభించేలా ఈ చర్యలు తీసుకుంది.
ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి :
తొలుత తత్కాల్ టికెట్లకు అనంతరం అడ్వాన్సడ్ రిజర్వేషన్ పిరియడ్ లో (ARP) భాగంగా అందుబాటులోకి వచ్చిన టికెట్లను బుకింగ్ చేసుకొనేందుకు IRCTC అకౌంట్ ను ఆధార్ నంబర్ లో లింక్ చేయాల్సి ఉంటుంది. తత్కాల్ టికెట్లకు గత సంవత్సరంలోనే ఆధార్ అథెంటికేషన్ ను తప్పనిసరి చేసింది.

ARP లో భాగంగా విడుదల అయిన తొలి రోజు టికెట్లు బుకింగ్ చేసుకోవాలంటే, సదరు IRCTC యాప్, వెబ్‌సైట్ యూజర్ కచ్చితంగా ఆధార్‌తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 12 వ తేదీ నుంచి కొత్త నిర్ణయాలు అమల్లోకి వచ్చాయి. టికెట్లు అందుబాటులోకి వచ్చిన తొలిరోజు ఆధార్ వెరిఫైడ్ యూజర్లకు మాత్రమే బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.
ఏమేం వివరాలు కావాల్సి :
IRCTC అకౌంట్ ను ఆధార్‌తో ఎలా లింక్ చేసేందుకు ఆధార్ నంబర్‌తోపాటు IRCTC యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ కావాల్సి ఉంటుంది. మరియు ఈ రెండింటితో లింక్ చేసిన మొబైల్ నంబర్ కూడా అందుబాటులో ఉండాలి. ఆధార్, ఐఆర్‌సీటీసీ అకౌంట్‌లోని వ్యక్తిగత వివరాలు సరిచూసుకోవాలి.
యూజర్ పేరు, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు ఐఆర్‌సీటీసీ అకౌంట్, ఆధార్ లో ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే లింక్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆధార్ నంబర్ ను లింక్ చేసిన మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉండాలి. ఆ నంబర్‌కు వచ్చిన OTP ను నమోదు చేయాల్సి ఉంటుంది.
IRCTC అకౌంట్‌ను ఆధార్‌తో ఎలా లింక్ చేయాలి?
> తొలుత IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌లో లాగిన్ కావాలి.
> అనంతరం My Account ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
> ఆ తర్వాత Link Your Aadhaar ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
> అక్కడ 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి.
> ఆధార్‌లో ఉన్న విధంగా పేరు, పుట్టిన తేదీ సహా ఇతర వివరాలు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి.
> అనంతరం మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ను నమోదు చేయాలి.
> దీంతో IRCTC అకౌంట్‌తో ఆధార్ లింక్ ప్రక్రియ పూర్తవుతుంది.
మీ IRCTC అకౌంట్ లో మీ పేరు సమీపంలో ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియ పూర్తయినట్లు గ్రీన్ కలర్ లో టిక్ మార్క్ చూపిస్తుంది. లేదా యాప్ లేదా వెబ్‌సైట్ లో 'మై అకౌంట్' సెక్షన్ లోనూ ఈ వివరాలను తనిఖీ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయితేనే ఆన్‌లైన్ లో అధికారిక యాప్‌ల ద్వారా టికెట్ల బుకింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








