ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ అకౌంటులను లింక్ & అన్‌లింక్ చేయడం ఎలా?

|

ప్రపంచం మొత్తం మీద ప్రజలు ఎక్కువగా ఉపయోగించే సోషల్ మీడియా యాప్ లలో మొదటి వరుసలో ఉండే ఫేస్‌బుక్‌ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లు తన వినియోగదారులకు అనేక కొత్త ఫీచర్లను అందిస్తున్నాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను కలిగి ఉంటే కనుక మీరు మీ యొక్క ఫోటోలను లేదా వీడియోలను నేరుగా ఒకేసారి ఫేస్‌బుక్‌లో కూడా చేయవచ్చు. ఈ రెండు అకౌంటులను ఒకదానితో మరొకటి లింక్ చేయడానికి కంపెనీ అనుమతిస్తుంది. కావున మీ సమయాన్ని వృధా చేయకుండా మీరు ఫోటోగ్రఫీని రెండుసార్లు షేర్ చేయవలసిన అవసరం లేకుండా ఒకే సారి షేర్ చేయడానికి అనుమతిస్తుంది. మీరు ఈ రెండు సోషల్ మీడియా అకౌంటులను లింక్ చేస్తే కనుక మీరు పాస్‌వర్డ్ ఎంటర్ చేయకుండా సులభంగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి లాగిన్ అవ్వవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్‌ & ఫేస్‌బుక్‌ అకౌంటులను లింక్ చేయడం
 

ఇన్‌స్టాగ్రామ్‌ & ఫేస్‌బుక్‌ అకౌంటులను లింక్ చేయడం

మీరు ఎక్కువ ఫోన్లు మరియు స్మార్ట్ డివైస్లు ఉంటే కనుక ప్రతిదానిలో ఈ రెండు సోషల్ మీడియా అకౌంట్ పాస్‌వర్డ్‌ను మళ్లీ మళ్లీ నమోదు చేయకూడదనుకుంటే కనుక ఇది ఉపయోగపడుతుంది. ఈ రెండు అకౌంటులను లింక్ చేయడం వల్ల మీ ఫేస్‌బుక్ స్నేహితులకు మీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను సులభంగా గుర్తించడం సులభం అవుతుంది. ఈ విధంగా మీ స్నేహితులను ఫాలో అవ్వడానికి సులభంగా రిక్వెస్ట్ పంపగలరు. అదేవిధంగా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మీరు సులభంగా ఫాలో అవ్వవచ్చు. మీ సోషల్ మీడియా అనుభవాన్ని సరదాగా మరియు ఆకర్షణీయంగా చేయడానికి ఫేస్‌బుక్ వీటిని అందిస్తుంది. మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంటును ఫేస్‌బుక్‌తో ఎలా లింక్ చేయవచ్చు లేదా అన్‌లింక్ చేయవచ్చు అని తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Also Read:కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో వాడుతున్న అద్భుతమైన టెక్నాలిజీలు ఇవే!!!

ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ అకౌంటును లింక్ చేసే పద్ధతులు

ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ అకౌంటును లింక్ చేసే పద్ధతులు

స్టెప్1: మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను ఓపెన్ చేయండి. అందులో మీ యొక్క ప్రొఫైల్‌కు వెళ్లి మూడు-చుక్కల మెనుని నొక్కండి. తరువాత సెట్టింగుల ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 2: అకౌంట్ > లింక్డ్ అకౌంట్ ఎంపికను నొక్కండి.

స్టెప్ 3: లింక్డ్ అకౌంట్ ఎంపికలో ఫేస్‌బుక్‌ను ఎంచుకోండి. తరువాత మీ ఫేస్‌బుక్ యొక్క లాగిన్ సమాచారాన్ని నమోదు చేయండి. మీకు ఫేస్‌బుక్ కాకుండా ట్విట్టర్ వంటి ఇతర ఎంపికలను కూడా లింక్ చేసుకోవచ్చు. మీరు అకౌంటులను లింక్ చేసిన తర్వాత మీరు ఏదైనా ఒక పోస్ట్ ను షేర్ చేసేటప్పుడు స్క్రీన్ లో ఫేస్‌బుక్‌లో కూడా అదే పోస్ట్‌ను షేర్ చేసే అవకాశం కూడా మీకు లభిస్తుంది.

ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ అకౌంటును అన్‌లింక్ చేసే పద్ధతులు

ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ అకౌంటును అన్‌లింక్ చేసే పద్ధతులు

స్టెప్1: మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను ఓపెన్ చేయండి. అందులో మీ యొక్క ప్రొఫైల్‌కు వెళ్లి అందులో కుడివైపు ఎగువ మూలలో గల మూడు-చుక్కల మెనుని నొక్కండి. తరువాత సెట్టింగుల ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 2: సెట్టింగ్స్ > అకౌంట్ > లింక్డ్ అకౌంట్ ఎంపికను నొక్కండి.

స్టెప్ 3: ఇందులో ఫేస్‌బుక్‌ ఎంపికను ఎంచుకోండి. తరువాత "అన్‌లింక్ అకౌంట్" ఎంపికను ఎంచుకోండి. తరువాత దీనిని నిర్ధారించడానికి "Yes అన్‌లింక్" ఎంపికను నొక్కాలి.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
How to Link or Unlink Both Instagram and Facebook Accounts??

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X