మీ ఫోన్ సైలెంట్ లో ఉన్నప్పుడు ఎక్కడ ఉందో తెలుసుకోవడం కష్టమా అయితే ఇలా ట్రై చేయండి
ఫోన్ తో పని లేనప్పుడు లేదా రాత్రుళ్ళు ఫోన్ కాల్స్ వస్తున్నప్పుడు అందరూ చేసే మొదటి పని ఫోన్ ను సైలెంట్ లో పెట్టి నిద్రపోవడం.
ఫోన్ తో పని లేనప్పుడు లేదా రాత్రుళ్ళు ఫోన్ కాల్స్ వస్తున్నప్పుడు అందరూ చేసే మొదటి పని ఫోన్ ను సైలెంట్ లో పెట్టి నిద్రపోవడం. అయితే ఒక్కోసారి మనం ఫోన్ ఎక్కడ పెట్టామో అన్నది గుర్తుండదు ఎన్ని సార్లు ఫోన్ చేసిన ఫోన్ రింగ్ అవుతుంది కాని శబ్దం వినిపించదు.ఈ నేపథ్యంలో అలా మీ ఫోన్ సైలెంట్ లో ఉన్నప్పుడు ఎలా వెతికి పట్టుకోవాలో ఈ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది
నోట్ : ఇది కేవలం ఐఫోన్ యూజర్లకు మాత్రమే

Find My iPhone
ఐఫోన్ లో ‘Find My iPhone' అని పిలిచే ఫీచర్ గురించి ఐఫోన్ యూజర్లకి అందరికి తెలిసే ఉంటుంది.ఒకవేళ ఫోన్ పోతే ఈ ఫీచర్ లొకేష ట్రాక్ చేయొచ్చు లేదా ఫోన్ లాక్ చేయొచ్చు.అయితే ఈ ఫీచర్ ద్వారా సైలెంట్ మోడ్ లేదా Do Not Disturb mode లో ఉన్న ఫోన్ ఐఫోన్ ను కూడా రింగ్ చేయగలదు

Pre-requisites:
- మీ ఐఫోన్ లో ఇంటర్నెట్ కనెక్టివిటీని కలిగి ఉన్నట్లు నిర్ధారించుకోండి
- అలాగే, వినియోగదారులు సెట్టింగ్స్ లో ‘Find My iPhone' ను యాక్టివేట్ చేసి ఉండాలి

ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి
స్టెప్ 1
Mac లేదా PCలో ‘www.icloud.com' ను ఓపెన్ చేసి సరైన క్రెడెన్షియల్స్ లో లాగ్ ఇన్ అవ్వండి

స్టెప్ 2
లాగ్ ఇన్ అయ్యాక లెఫ్ట్ లో ఆపిల్ అకౌంట్ తో కనెక్ట్ అయ్యి ఉన్న డివైజెస్ లిస్ట్ మొత్తం చూపిస్తుంది అందులో ఐఫోన్ ను క్లిక్ చేయండి

స్టెప్ 3
కుడివైపు ఉన్న మ్యాప్ ఫోన్ యొక్క స్థానం ను 3D రెప్రెసెంటేషన్ తో జూమ్ చేస్తుంది. స్క్రీన్ దిగువన ‘Play Sound' అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిని క్లిక్ చేయండి

స్టెప్ 4
ఫోన్ ఇంకా ఇంటర్నెట్ కు కనెక్ట్ అయ్యి ఉంటే ఫోన్ నుంచి పెద్ద సౌండ్ తో రింగ్ వినిపిస్తుంది. సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకొని మీ ఐఫోన్ ను తెచ్చుకోండి.


Click it and Unblock the Notifications








