మీ ఆధార్ బయోమెట్రిక్ సురక్షితమేనా? లాక్ చేయటం ఎలా?

ఆధార్ కార్డ్ తీసుకునే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా తమ మీ వేలిముద్ర అలానే రెటీనల్ స్కాన్ డేటాను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ విధమైన డేటాను టెక్నికల్ పరిభాషలో బయోమెట్రిక్ డేటా అని పిలుస్తారు.

మీ ఆధార్ బయోమెట్రిక్ సురక్షితమేనా? లాక్ చేయటం ఎలా?

Read More : నోకియా నుంచి 7 స్మార్ట్‌ఫోన్‌లు దూసుకొస్తున్నాయి!

సేకరించిన మీ బయోమెట్రిక్ డేటాను ఆధార్ వెరిఫికేషన్ నిమిత్తం ఉపయోగించటం జరుగుతుంది. అది ఎలాఅంటే, ఉదాహరణకు మీరు కొత్త సిమ్‌కార్డ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ క్రింద ఆధార్ కార్డ్‌ను ఇచ్చారు. ఆ క్రమంలో మీ KYC వెరిఫికేషన్ నిమిత్తం సంబంధిత టెలికం కంపెనీ, మీ వేలి ముద్ర ఆధారంగా బయోమెట్రిక్ వివరాలను పరిశీలించటం జరుగుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అంత సెక్యూర్ కాదని తెలుస్తోంది!

Ransomware అంటే ఏంటి..?

ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని సంఘటనలతో ఎంతో సురక్షితమని భావిస్తోన్న ఆధార్ బయోమెట్రిక్ ప్రమాణీకరణ (Aadhaar biometric authentication)కూడా అంత సెక్యూర్ కాదని తెలుస్తోంది.

దుర్వినియోగపరిచారంటూ కొందరు..

ప్రముఖ మోటరోలా స్మార్ట్‌ఫోన్ పై రూ.5,000 తగ్గింపు

తమ ఆధార్ బయోమెట్రిక్ వివరాలను తమ అనుమతి లేకుండా తీసుకుని దుర్వినియోగపరిచారంటూ కొందరు ఆరోపించటంతో ఆధార్ బయోమెట్రిక్ అంత సురక్షితం కాదన్న వాదన వినిపిస్తోంది. బయోమెట్రిక్ ప్రమణికరణ ద్వారా తమ ఆధార్ కార్డును వాడుకున్నట్లు UIDAI నుంచి మెయిల్స్ వచ్చాయని, వాస్తవానికి తాము biometric authenticationను వాడుకోలేదని చెబుతున్నారు.

బయోమెట్రిక్ సమాచారాన్ని లాక్ చేసుకోవటం చాలా ఉత్తమం

ఒకే ఆండ్రాయిడ్ ఫోన్‌లో రెండు ఫేస్‌బుక్ అకౌంట్‌లను వాడుకోవటం ఎలా?

ఇటువంటి పరిస్తితి భవిష్యత్‌లో మీకు కూడా తలెత్తకుండా ఉండాలంటే UIDAI సర్వర్లలో లాక్ అయి ఉన్న మీ బయోమెట్రిక్ సమాచారాన్ని లాక్ చేసుకోవటం చాలా ఉత్తమం. ఇలా చేయటం ద్వారా మీ బయోమెట్రిక్ డేటాను వేరొకరు యాక్సిస్ చేసుకునే అవకాశం ఉండదు. మీకు అవసరమైనపుడు మాత్రమే అన్‌లాక్ చేసుకుని, అవసరం లేనపుడు లాక్ చేసుకోవచ్చు.

లాక్ చేసే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం...

మీకు సంబంధించిన Aadhaar biometric authenticationను లాక్ అలానే అన్‌లాక్ చేసే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం...

ఇవి ఫాలో అవ్వండి...

ముందుగా మీ కంప్యూటర్ నుంచి UIDAI వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి
మీ 12 అంకెల ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయండి.
ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన కాలమ్ క్రింద మరో సెక్యూరీటీ కోడ్ కాలమ్ మీకు కనిపిస్తుంది. అక్కడ పైన ఉంచిన సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయండి.
పేజీలో క్రింద కనిపించే Generate OTP పై క్లిక్ చేయండి.
ఇప్పుడు ఆధార్‌తో రిజిస్టర్ అయిన మీ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ రూపంలో one-time password అందుతుంది. ఆ ఓటీపీని సంబంధిత కాలమ్‌లో ఎంటర్ చేసి Verify ఆప్షన్ క్లిక్ చేయండి.
ఇప్పుడు Enable biometric lockingను చెక్ చేసుకోండి.
ఎనేబుల్ బయోమెట్రిక్ లాకింగ్‌ను చెక్ చేసిన తరువాత Enable ఆప్సన్ పై క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ బయోమెట్రిక్ వివరాలు లాక్ కాబడతాయి.
ఒకవేళ లాక్ ను disable చేయాలనుకుంటే Enable biometric lockingను అన్ చెక్ చేసి disable పై క్లిక్ చేయండి.

పై సూచనలను పాటించటం ద్వారా మీ Aadhaar biometric సమాచారాన్ని లాక్ లేదా అన్ లాక్ చేసుకోవచ్చు.

రూ.3000 రేంజ్‌లో లేటెస్ట్ 4G VoLTE ఫోన్‌లు ఇవే

ముఖ్య గమనిక :

యూజర్ తన Aadhaar biometric డేటాను లాక్ చేయటం ద్వారా ఆధార్ సంబంధిత లావాదేవీలు అలానే రిక్వస్ట్ లను one-time password ఆధారంగానే మేనేజ్ చేయగలుగుతారు. వీళ్లకు సంబంధించిన వేలి ముద్ర అలానే ఐరిస్ స్కాన్ లాక్ చేయబడుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to Lock Aadhaar Biometric Data Online. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot