Aadhaar బయోమెట్రిక్ డేటాను ఆన్‌లైన్‌ ద్వారా లాక్ చేయడం ఎలా?

|

భారతీయ పౌరులగా గుర్తింపు పొందే కార్డు ఏదైనా ఉంది అంటే ముందుగా గుర్తు వచ్చేది UIDAI (భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) రూపొందించిన AAdhaar కార్డ్. ఇది బ్యాంకులు, ఆసుపత్రుల నుండి అన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని పొందేందుకు కూడా దీని యొక్క అవసరం ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడం నుండి బ్యాంకు అకౌంటులను ఓపెన్ చేయడం మరియు అనేక ఇతర సేవల నుండి ప్రయోజనాలను పొందడం వరకు ఆధార్ కార్డు చాలా ముఖ్యమైనదిగా మారింది. చాలా చోట్ల ధృవీకరణ కోసం ఆధార్ కార్డును ప్రముఖంగా ఉపయోగిస్తున్నారు. ఆధార్ బయోమెట్రిక్ కూడా దుర్వినియోగం అవుతుందనే భయం కూడా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని UIDAI ఆధార్ కార్డ్‌లో ఉన్న బయోమెట్రిక్‌ను లాక్ లేదా అన్‌లాక్ చేసే సౌకర్యాన్ని అందించింది.

How to Lock and Unlock Aadhaar Biometric Data Through Online: Follow These Process Step by Step

ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్‌ను సక్రమంగా ఉపయోగించలేదని వ్యక్తులు ఆరోపించిన అనేక కేసులు కూడా తెరపైకి వచ్చాయి. అదనంగా చాలా మంది వ్యక్తులు చాలా రోజులుగా తమ ఆధార్ కార్డును కూడా ఉపయోగించలేదు. అయితే వారి డేటా బయోమెట్రిక్ అతేంటీకేషన్ ద్వారా యాక్సెస్ చేయబడిందని UIDAI నుండి ఇమెయిల్ వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని UIDAI ఆధార్ బయోమెట్రిక్‌లను లాక్ మరియు అన్‌లాక్ చేసే సదుపాయాన్ని కల్పించింది. UIDAI ప్రకారం బయోమెట్రిక్‌లను లాక్ చేసిన తర్వాత మీ డేటాను ఎవరూ ఉపయోగించలేరు. ఒకసారి బయోమెట్రిక్ లాక్ చేయబడితే ఇతర వ్యక్తులు దానిని ఉపయోగించరు. ఆధార్ కార్డ్ హోల్డర్ దానిని అన్‌లాక్ చేయాలనుకుంటే కనుక వారు దానిని మళ్లీ సులభంగా అన్‌లాక్ చేయవచ్చు.

ఆన్‌లైన్‌లో మీ ఆధార్ బయోమెట్రిక్ డేటాను లాక్ చేసే విధానం

How to Lock and Unlock Aadhaar Biometric Data Through Online: Follow These Process Step by Step

STEP1: ముందుగా UIDAI httpsuidai.gov.in అధికారిక వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయండి.

STEP2: ఇక్కడ హోమ్ పేజీలో మై ఆధార్ ఎంపిక మీద క్లిక్ చేయండి.

STEP3: ఇప్పుడు ఆధార్ సేవలపై లాక్/అన్‌లాక్ బయోమెట్రిక్స్‌ ఎంపిక మీద క్లిక్ చేయండి.

STEP4: ఆ తర్వాత కొత్త పేజీ తెరవబడుతుంది. ఆ బాక్స్ ను టిక్ చేయండి.

STEP5: దీని తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ మరియు క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.

STEP6: ఇప్పుడు OTP మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌కు వస్తుంది.

STEP7: ఆ OTPని నమోదు చేసి సబ్మిట్ ఎంపిక మీద నొక్కండి.

STEP8: తర్వాత ఎనేబుల్ లాకింగ్ ఫీచర్‌పై క్లిక్ చేయండి.

STEP9: మీ ఆధార్ బయోమెట్రిక్స్ డేటా లాక్ చేయబడుతుంది.

Best Mobiles in India

English summary
How to Lock and Unlock Aadhaar Biometric Data Through Online: Follow These Process Step by Step

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X