Home
How to

Facebook Profile Lock ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ను ఎలా లాక్‌ చేయాలి.. ఏంటి ఉపయోగం?

ఫేస్‌బుక్‌ (Facebook) పేరు తెలియని వారు లేరేమో అన్నట్లు ఈ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం గుర్తింపు పొందింది. ఇప్పుడంటే ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ వంటి ప్లాట్‌ఫాంలు అందుబాటులోకి వచ్చాయి. ఓ పది సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఫేస్‌బుక్‌లో గంటల తరబడి గడిపేవారు. అయితే గతంలో పోలిస్తే ఫేస్‌బుక్‌లో అనేక ఫీచర్‌లు, భారీ స్థాయిలో కంటెంట్‌ అందుబాటులోకి వచ్చింది. అయితే పెరుగుతున్న టెక్నాలజీతోపాటు, సైబర్‌ నేరాలు కూడా అంతే స్థాయిలో పెరిగింది.

ప్రైవేట్‌గా సోషల్‌మీడియా ఖాతాలు :
సైబర్‌ దాడుల నుంచి రక్షణ, వ్యక్తిగత డేటా సురక్షితంగా ఉంచుకొనేందుకు అనేక మంది సోషల్‌ మీడియా ప్రొఫైల్స్‌ను ప్రైవేట్‌గా మార్చుకుంటున్నారు. ఫేస్‌బుక్‌ కూడా అనేక ప్రైవసీ ఫీచర్‌లను తీసుకొచ్చింది. వీటి ద్వారా ఫోటోలు సహా ఇతర వివరాలు ఫ్రెండ్స్‌కు మినహా ఇతర వ్యక్తులకు కనిపించకుండా జాగ్రతలు తీసుకోవచ్చు.

How to lock facebook Profile

ఉపయోగం ఏంటీ :
ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ లాక్‌ ఫీచర్‌ (Facebook Profile Lock) ద్వారా ఇతరులు మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోని డేటాను చూసేందుకు అవకాశం ఉండదు. ఫేస్‌బుక్‌ అకౌంట్‌లోని వ్యక్తిగత డేటా, ఫోటోలు, వీడియోలను యాక్సెస్‌ చేయలేరు. దీంతోపాటు ప్రొఫైల్‌ ఫొటో వారికి కనిపించినా ఫుల్‌ సైజ్‌లో చూసేందుకు మరియు సేవ్‌ చేసుకొనేందుకు అవకాశం ఉండదు.

రెండింటిలోనూ అవకాశం :
ఫేస్‌బుక్‌ యాప్‌, డెస్క్‌టాప్‌ వెర్షన్‌లోనూ ప్రస్తుతం ఈ ప్రైవసీ ఫీచర్‌ అందుబాటులో ఉంది. యాప్‌, డెస్క్‌టాప్‌లోనూ యాక్టివేట్‌ చేసుకోవచ్చు. డెస్క్‌టాప్‌లో ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ లాక్‌ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసుకొనేందుకు.. వెబ్‌ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేయాలి. అనంతరం ఫేస్‌బుక్‌ అకౌంట్‌లోకి లాగిన్‌ కావాలి.

- ఫేస్‌బుక్‌ అకౌంట్‌లోకి లాగిన్‌ చేశాక.. ప్రొఫైల్‌ ఫొటోపైన క్లిక్ చేయాలి.
- అనంతరం అక్కడ కనిపించిన త్రీ డాట్‌ మెనూ పైన క్లిక్‌ చేయాలి.
- తర్వాత అక్కడ కనిపించిన Lock Profile పైన క్లిక్‌ చేయాలి.
- మీరు ధ్రువీకరించిన తర్వాత ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ లాక్‌ కానుంది.

ఫేస్‌బుక్ యాప్‌ ద్వారా కూడా ఈ ప్రైవసీ ఫీచర్‌ను యాక్టివ్‌ చేసుకోవచ్చు.
- ఆండ్రాయిడ్‌, iOS స్మా్ర్ట్‌ఫోన్‌లో ఫేస్‌బుక్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి.
- అనంతరం ప్రొఫైల్ ఫొటోపైన క్లిక్‌ చేయాలి.
- ఫ్రొఫైల్‌ ఫోటో కింది భాగంలో త్రీ డాట్‌ మెనూ ఆప్షన్‌ కనిపిస్తుంది.
- త్రీ డాట్‌ మెనూ ఆప్షన్ ను ట్యాప్‌ చేయగానే మీకు చాలా ఆప్షన్‌లో కనిపిస్తాయి.
- అక్కడ Lock Profile ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- ధ్రువీకరించాక మీ ప్రొఫైల్‌ లాక్‌ కానుంది.

ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను మీకు కావాల్సినప్పుడు Unlock చేసుకొనేందుకు అవకాశం ఉంది. యాప్‌, డెస్క్‌టాప్‌ ద్వారా అన్‌లాక్ చేసుకోవచ్చు. మీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో మీ వ్యక్తిగత సమాచారం సహా కుటుంబ సభ్యుల ఫొటోలు, వీడియోలు తరచూ అప్‌లోడ్‌ చేస్తూ ఉంటే.. ప్రొఫైల్‌ లాక్‌ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలి.

ఈ ఫీచర్‌ ద్వారా మీ ఫ్రొపైల్‌ మరింత సురక్షితంగా ఉంటుంది. మరియు మీ అకౌంట్‌లోని డేటా దుర్వినియోగం జరగకుండా ఉంటుంది. అయితే ఫ్రొఫైల్‌ లాక్‌ చేసినా.. సెర్చ్‌ రిజల్ట్స్‌లో మీ ఫోటో చిన్న సైజులో కనిపిస్తుంది. అయితే సేవ్‌ చేసేందుకు అవకాశం ఉండదు.

More from GizBot

Best Mobiles in India

English summary
How to lock facebook Profile from app and desktop, check what is the use
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X