SBI నెట్ బ్యాంకింగ్‌ యాక్సిస్ లాక్ -అన్‌లాక్ చేయడం ఎలాగో తెలుసుకోండి

By Gizbot Bureau
|

ఆర్థిక లావాదేవీల కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ఇప్పుడు ప్రముఖ సాధనంగా మారింది. బిల్ పేమెంట్స్, ఫిక్స్‌డ్ లేదా కరెంట్ అకౌంట్ కోసం లేదా ఇతర అవసరాల కోసం అందరూ విరివిగా నెట్ బ్యాకింగ్ వాడుతున్నారు. నెట్ బ్యాకింగ్ సేవలు 24x7 అందుబాటులో ఉంటాయి. బ్యాంకులను విజిట్ చేసే అవసరం లేకుండా అన్ని పనులు చేయవచ్చు. అయితే అదే సమయంలో నెట్ బ్యాంకింగ్ రిస్క్‌లెస్ అని చెప్పలేం. కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని, ఆన్ లైన్ మోసాలకు పాల్పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ కస్టమర్లు తమ నెట్ బ్యాంకింగ్ యాక్సెస్‌ను లాక్ చేయగల ఫీచర్‌ను పరిచయం చేసింది. అది ఎలాగో చూద్దాం.

SBI Online: How to lock, unlock netbanking access

SBI నెట్ బ్యాంకింగ్‌ను లాక్ -అన్‌లాక్ ఎలా?

స్టెప్ 1
ముందుగా https://www.onlinesbi.com/ వెబ్ సైట్‌కు వెళ్లాలి. అక్కడ PERSONAL BANKINGలోని Lock & Unlock user ను ఎంచుకోవాలి. అప్పుడు ఓ కొత్త విండో ఓపెన్ అవుతుంది. తర్వాత Select Lock or Unlock User Access ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ వివరాలు ఫిల్ చేయాలి.
స్టెప్ 2
ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్, అకౌంట్ నెంబర్, కాప్చా అడుగుతుంది. ఇవి సబ్‌మిట్ చేసిన అనంతరం కొత్త పాపప్ వస్తుంది. అక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీ ఖాతాలోకి అనధికార యాక్సెస్ లేదా ట్రాన్సాక్షన్స్ ఉన్నట్లుగా కనిపిస్తే మీరు ఇంటర్నెట్ యాక్సెస్‌ను లాక్ చేసుకోవచ్చు.
స్టెప్ 3
దీనిలో యూజర్ లేదా కస్టమర్ సెట్ చేసిన షెడ్యూల్డ్ ట్రాన్సాక్షన్స్, స్టాండింగ్ ట్రాన్సాక్షన్లు ఏమైనా ఉంటే యాక్టివ్‌గానే ఉంటాయి. యథావిథిగా కొనసాగుతాయి. ఈ ప్రాసెస్‌లో ఎలాంటి మార్పు ఉండదు. తర్వాత కస్టమర్ OK పైన క్లిక్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి, ఓకే చేస్తే ఇంటర్నెట్ యాక్సెస్ లాక్ చేయబడుతుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ లాక్ చేయబడుతుంది.

SBI Online: How to lock, unlock netbanking access

ఆన్‌లైన్ మోసాలకు SBI 'లాక్' చెక్

అదే సమయంలో నెట్ బ్యాంకింగ్ రిస్క్‌లెస్ అని చెప్పలేం. అప్రమత్తంగా ఉంటే తప్ప ఇది రిస్క్‌తో కూడుకున్నదే. సైబర్ క్రిమినల్స్ ఎప్పటికి అప్పుడు తెలివి మీరుతున్నారు. కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని, ఆన్ లైన్ మోసాలకు పాల్పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కాబట్టి సెక్యూరిటీ ఫీచర్లను వీలయినంతవరకు యాక్టివేట్ చేసుకోవడం మంచిది.

Best Mobiles in India

English summary
SBI Online: How to lock, unlock netbanking access

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X