ఫొటోస్ కలెక్షన్ నుండి వీడియోని తయారు చేయటం ఎలా ?

By Santhoshima Vadaparthi
|

మీరు షేర్ చేయాలనుకుంటున్న ఫొటోస్ కలెక్షన్ మీ దగ్గర ఉంటే ,వాటిని వీడియో గా మార్చటానికి ఉత్తమ మార్గం తెలుసుకోండి. వీడియోలు ఆర్డినరీ ఫోటో స్లయిడ్ షోస్ కంటే మరింత ఆసక్తికరంగా మరియు డైనమిక్ గా ఉంటాయి,మరియు మీరు వాటిని సులభంగా యూట్యూబ్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయవచ్చు. మీ ఇంట్లో వివాహ వేడుకలు లేదా పుట్టినరోజు వంటి స్పెషల్ ఈవెంట్ ల ఫొటోస్ సెట్ ఉన్నట్లయితే వీడియోస్ మంచివి . సరైన సాఫ్ట్వేర్ తో టైం లైన్ లో అన్ని పిక్చర్స్ సులభంగా యాడ్ చేయవచ్చు . టైటిల్స్ మరియు స్పెషల్ ఎఫెక్ట్స్ తో పాటుగా మొత్తం వీడియో కి మ్యూజిక్ సెట్ చేయవచ్చు . మీ పిక్చర్స్ ని వీడియో గా మార్చే బ్రిలియంట్ వీడియో ఎడిటర్స్ వున్నాయి . కానీ మేము యూస్ చేయటానికి షాట్ కట్ ని ఎంచుకున్నాము . ఎందుకంటే ఇది ఇంట్రెస్టింగ్ ఎఫెక్ట్స్ తో ప్యాక్ చేయటం సులభం . కానీ కాంప్లికేటెడ్ టూల్స్ తో మీకు అవసరం ఉండదు . ఇది విండోస్ ,మాక్ మరియు లైనక్స్ కి అందుబాటులో వుంది.

 

వాట్సప్‌లో పంపిన మెసేజ్‌‌లు డిలీట్ చేయడానికి ఎక్కువ సమయం, కొత్త అప్‌డేట్వాట్సప్‌లో పంపిన మెసేజ్‌‌లు డిలీట్ చేయడానికి ఎక్కువ సమయం, కొత్త అప్‌డేట్

మీ ఫొటోస్ ఇంపోర్ట్ చేయండి.

మీ ఫొటోస్ ఇంపోర్ట్ చేయండి.

షాట్ కట్ ని డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయండి ,మరియు ఓపెన్ చేసి పై భాగంలో వున్న 'ప్లే లిస్ట్ ' బటన్ ని క్లిక్ చేయండి. మీ వీడియో క్రియేట్ చేయటానికి ఉపయోగించిన అన్ని మీడియా ఫైల్స్ ని ప్లేలిస్ట్ కలిగి ఉంటుంది.

 

 

'ఓపెన్ ఫైల్

'ఓపెన్ ఫైల్

'ఓపెన్ ఫైల్ ' ని క్లిక్ చేసి మీరు యాడ్ చేయాలనుకున్న ఫోటో ని ఎంచుకుని దానిని ఇంపోర్ట్ చేయటానికి 'ఓపెన్ ' క్లిక్ చేసి ,మీ ప్లే లిస్ట్ కి యాడ్ చేయటానికి '+' బటన్ క్లిక్ చేయండి . ప్రతీ ఫోటో కోసం ప్రోసెస్ రిపీట్ చేయండి . మీరు ఫొటోస్ ని రిమూవ్ చేయటానికి '-' ని బటన్ ని క్లిక్ చేయాలి .ప్లే లిస్ట్ విండో లో మీ అన్ని ఇంపోర్టెడ్ ఫొటోస్ ని చూడటానికి ,తొమ్మిది చిన్న స్క్వేర్స్ ని చూపే ఐకాన్ ని క్లిక్ చేయండి.

ప్రాజెక్ట్ ని సేవ్ చేయటానికి
 

ప్రాజెక్ట్ ని సేవ్ చేయటానికి

ఇది మీ ప్రాజెక్ట్ ని సేవ్ చేయటానికి మంచి టైం ;షాట్ కట్ క్రాష్ అవ్వటానికి అవకాశం లేదు ,కానీ ఏదయినా తప్పు జరిగితే మీ ఫొటోస్ ని రీ ఇంపోర్ట్ చేయటానికి టైం స్పెండ్ చేయవలిసిన అవసరం లేదు. ప్రాజెక్ట్ ఫైల్స్ MLT ఫార్మాట్ లో సేవ్ చేయబడతాయి,మరియు మీరు వాటిని రీ ఓపెన్ మరియు ఎప్పుడైనా ఎడిటింగ్ చేయవచ్చు .

టైం లైన్ కి ఫొటోస్ ని యాడ్ చేయండి.

టైం లైన్ కి ఫొటోస్ ని యాడ్ చేయండి.

షాట్ కట్ విండో కింద 'టైం లైన్ ' మెనూ బటన్ క్లిక్ చేసి 'యాడ్ వీడియో ట్రాక్ 'ని సెలెక్ట్ చేయండి . టైం లైన్ లో మీ ప్లే లిస్ట్ నుంచి ఫోటో డ్రాగ్ చేయండి . ఇది డిఫాల్ట్ గా సెకన్స్ లో స్క్రీన్ పై కనిపిస్తుంది . కానీ టైం లైన్ లో దాన్ని రీసైజ్ కోసం క్లిక్ చేసి , డ్రాగింగ్ చేయటం ద్వారా మార్చవచ్చు . మీ వీడియో లో చేర్చవలిసిన ప్రతీ ఫొటోస్ కోసం ప్రోసెస్ రిపీట్ చేయండి . మీరు ఏ ఆర్డర్ లోనైనా వాటిని అరేంజ్ చేయవచ్చు. మరియు మీకు నచ్చినంత కాలం ప్రతీ ఒక్కటి డిస్ప్లే చేయబడుతుంది.

 

 

 టైం లైన్ లో

టైం లైన్ లో

టైం లైన్ లో బ్రౌన్ ఏరియాస్ చే ప్రాతినిధ్యం వహించే మీ ఫొటోస్ మధ్య షాట్ కట్ ఆటోమేటిక్ గా బ్రీఫ్స్ గ్యాప్ చేస్తుంది. గ్యాప్ ని తొలగించటానికి ,రైట్ క్లిక్ చేసి 'రిమూవ్ ' సెలెక్ట్ చేయండి . మీ వీడియో ఎలా కనిపిస్తుందో చూడటానికి ,ప్రివ్యూ విండో కింద 'ప్రాజెక్ట్ 'క్లిక్ చేసి ,ప్లే బ్యాక్ కంట్రోల్స్ ఉపయోగించండి .

 

 

ఫిల్టర్స్ అప్ప్లై చేయండి మరియు టైటిల్స్ యాడ్ చేయండి .

ఫిల్టర్స్ అప్ప్లై చేయండి మరియు టైటిల్స్ యాడ్ చేయండి .

మీ ఫొటోస్ చూసి మీరు ఇప్పటికే ఆనందపడవచ్చు ,కానీ సరైన ఫిల్టర్స్ మీ వీడియో కి సరైన న్యూ లుక్ ని అందిస్తాయి . విండో టాప్ భాగం లో వున్న' ఫిల్టర్ ' బటన్ క్లిక్ చేయండి (ప్లే లిస్ట్ ని కవర్ చేస్తుంది ,కానీ కంగారు పడకండి -ఇది ఇప్పటికీ క్రింద వుంది )మరియు టైం లైన్ లో ఫొటోస్ లో ఒకదాన్ని క్లిక్ చేయండి .

 

 

ఫిల్టర్స్ లిస్ట్ ని ఓపెన్ చేయటానికి

ఫిల్టర్స్ లిస్ట్ ని ఓపెన్ చేయటానికి

ఫిల్టర్స్ లిస్ట్ ని ఓపెన్ చేయటానికి '+' ఐకాన్ ని క్లిక్ చేసి ,ఇమేజెస్ ని వర్తింపచేసే వాటిని చూపించటానికి మానిటర్ ఐకోన్ ని ఎంచుకోండి .(ఇక్కడ మేము పాత సినిమా ని చూస్ చేసాము:ప్రొజెక్టర్ ఇమేజ్ బంప్ మరియు ఫ్లిక్కర్ ని చేస్తుంది)మరియు కస్టమైజ్ చేయటానికి ఆప్షన్స్ సెట్ తో పాటుగా లిస్ట్ లో కనిపిస్తుంది . ప్రతీ ఫిల్టర్ మీకీ వివిధ ఆప్షన్స్ ఇస్తుంది . మీరు '+'ఐకాన్ ని క్లిక్ చేయటం ద్వారా మీకు ఇష్టమైన ఫిల్టర్స్ యాడ్ చేయవచ్చు ,మరియు '-' క్లిక్ చేయటం ద్వారా వాటిని తీసేయవచ్చు . వేరే ఫోటోకు ఫిల్టర్స్ ని అప్ప్లై చేయటానికి ,టైం లైన్ లో క్లిక్ చేయండి. అందుబాటులో వున్న ఫిల్టర్స్ లిస్ట్ లో టెక్స్ట్ మరియు 3D టెక్స్ట్ యాడ్ చేయటానికి ఆప్షన్స్ ని కూడా మీరు కనుగొంటారు . ఇవన్నీ పూర్తిగా కస్టమైజ్డ్ ,మరియు టైటిల్స్ మరియు సబ్ టైటిల్స్ క్రియేట్ చేయటానికి ఐడియల్ గా ఉంటాయి.

మ్యూజిక్ యాడ్ చేయండి

మ్యూజిక్ యాడ్ చేయండి

సరైన మ్యూజిక్ నిజంగా మీ ఫోటో వీడియో కి లైఫ్ ఇస్తుంది,కానీ మీరు దీనిని షేర్ చేయటానికి ప్లాన్ చేస్తే ,మీరు అవసరమైన లైసెన్స్ లేకుండా మ్యూజిక్ యూస్ చేయటం లేదని నిర్ధారించుకోవాలి . యూట్యూబ్ యొక్క కంటెంట్ ID సిస్టం ఆటోమేటిక్ గా కాపీ రైట్ చేయబడిన మ్యూజిక్ ని డిటెక్ట్ చేయటానికి పనిచేస్తుంది మరియు మీ ప్రాజెక్ట్ తీసివేయబడిందా లేదా మీ ప్రాజెక్ట్ లో కమెర్షియల్ ట్రాక్స్ ని గుర్తిస్తే మీ అకౌంట్ బ్లాక్ చేయబడిందని మీరు కనుగొనవచ్చు . అయితే ,మీరు ఉపయోగించే మ్యూజిక్ ని కనుగొని ,మీ ఫొటోస్ కి గొప్ప సహకారం అందించే ప్లేసెస్ వున్నాయి . మా ఫేవరెట్ బెన్ సౌండ్ ఇది వివిధ స్టైల్స్ లో ట్రాక్స్ భారీ రేంజ్ ని లిస్ట్ చేస్తుంది. మీరు మీ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో తన సైట్ కి లింక్ తో క్రెడిట్ చేస్తారని బెన్ అడుగుతుంది .

మీరు క్రెడిట్ చేర్చకూడదనుకుంటే

మీరు క్రెడిట్ చేర్చకూడదనుకుంటే

మీరు క్రెడిట్ చేర్చకూడదనుకుంటే లేదా కమెర్షియల్ గా బెన్ మ్యూజిక్ ఉపయోగించాలనుకుంటే ,మీరు లైసెన్స్ కొనుగోలు చేయాలి . మీ వీడియో కు మ్యూజిక్ యాడ్ చేయటానికి 'ఓపెన్ ఫైల్ ' క్లిక్ చేసి ఆడియో ఫైల్ ని సెలెక్ట్ చేసుకుని ,ప్లే లిస్ట్ కి యాడ్ చేయటానికి '+ ఐకాన్ ని క్లిక్ చేయండి . ఇప్పుడు 'టైం లైన్' కింద మెనూ బటన్ క్లిక్ చేసి 'యాడ్ ఆడియో ట్రాక్ సెలెక్ట్ చేయండి . కొత్త ట్రాక్ పై ఆడియో ఫైల్ ని డ్రాగ్ చేయండి . (మీరు దీన్ని చూడటానికి షాట్ కట్ విండో ని రీసైజ్ చేయాలి లేదా స్క్రోల్ బార్ ఉపయోగించండి ). మ్యూజిక్ ట్రాక్ చాలా పొడవుగా ఉంటే ,మీరు మీ ఫొటోస్ చేసిన విధంగానే టైం లైన్ లో దానిని రీసైజ్ చేయవచ్చు . మ్యూజిక్ మరియు ఫొటోస్ ఎలా కలిసి పనిచేయాలో చూసేందుకు ప్రివ్యూ కింద ప్లే బ్యాక్ బటన్స్ ని ఉపయోగించండి.

మీ వీడియో ని ఎక్స్ పోర్ట్ చేయండి

మీ వీడియో ని ఎక్స్ పోర్ట్ చేయండి

ఒక్కసారి మీరు ఫొటోస్ నుంచి చేసిన వీడియో తో సంతోషంగా ఉంటే , ఇది ఎక్స్ పోర్ట్ చేయటానికి సరైన సమయం. మీరు ఏవైనా మార్పులను చేయాలని లేదా డిఫరెంట్ ఫార్మటు లో దానిని రీ సేవ్ చేయాలనుకుంటే ,మొదట ప్రాజెక్ట్ ఫైల్ ని సేవ్ చేయమని రికమండ్ చేస్తున్నాము. ఒకసారి ఇది పూర్తయిన తరువాత ,'ఎక్స్పోర్ట్ ' బటన్ ని క్లిక్ చేయండి మరియు మీరు ఆప్షన్స్ మధ్య భారీ రేంజ్ ని చూస్తారు.MP4 ఫార్మాట్ లో వీడియో ని ఎక్స్ పోర్ట్ చేయమని మేము రికమండ్ చేస్తున్నాము . ఇది ఏ సమస్యలు లేకుండా దాదాపు అన్ని డివైసెస్ లో ప్లే చేయబడుతుంది మరియు దీన్ని ఫేస్బుక్ మరియు యూట్యూబ్ కు అప్లోడ్ చేయగలుగుతారు.

MPEG-4 కనుగొనటానికి

MPEG-4 కనుగొనటానికి

MPEG-4 కనుగొనటానికి లిస్ట్ ని స్క్రోల్ డౌన్ చేయండి . అప్పుడు మీరు రిజల్యూషన్ ,యాస్పెక్ట్ రేషియో మరియు ఫ్రెమ్ రేట్ తో సహా వివిధ సెట్టింగ్స్ ని ఎడ్జెస్ట్ చేసే ఆప్షన్ ని కలిగి వుంటారు . యూట్యూబ్ యొక్క వీడియో ప్లేయర్ 16:9 యాస్పెక్ట్ రేషియో ని ఉపయోగిస్తుంది . కాబట్టి మేము ఒంటరిగా వొదిలేయమని రికమండ్ చేస్తున్నాము . 24fps యొక్క డిఫాల్ట్ ఫ్రేమ్ మోషన్ ఫిల్టర్స్ వర్తింపచేసినప్పటికీ -ఫొటోస్ నుండి చేయబడిన వీడియో కోసం బెస్ట్ గా ఉంటుంది . యూట్యూబ్ రిజల్యూషన్స్ మరియు యాస్పెక్ట్ రేషియో లకు ఇక గైడ్ ని అందిస్తుంది . 1920:1080 యొక్క షాట్ కట్ డిఫాల్ట్ ఖచ్చితంగా సరైనది.

'ఎక్స్ పోర్ట్ వీడియో

'ఎక్స్ పోర్ట్ వీడియో

మీరు రెడీ గా వున్నప్పుడు ,'ఎక్స్ పోర్ట్ వీడియో ' క్లిక్ చేసి సేవ్ చేయబడిన ఫైల్ కోసం డెస్టినేషన్ ని ఎంచుకోండి . ఫైల్ mp4 లో ఎండింగ్ పేరును ఇవ్వండి. 'సేవ్ ' క్లిక్ చేయండి మరియు షాట్ కట్ యొక్క ఇంటర్ఫేస్ కుడి వైపున రెండరింగ్ ప్రోగ్రెస్ ని చూడగలుగుతారు . ఇది పూర్తి కావటానికి చాలా సమయం పడుతుంది . ఒక్కసారి ఇది పూర్తి చేసిన తరువాత మీరు మీ వీడియో ని చూడగలుగుతారు ,దీన్ని అప్లోడ్ చేసి ,మీకు నచ్చిన దానిని ఇతరులతో షేర్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
How to make a video from a collection of photos More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X