jio, airtel యూజర్లూ.. మీకు నచ్చిన పాటని Caller tune పెట్టేసుకోండిలా..!
ప్రస్తుతం మొబైల్ యూజర్లు చాలా మంది తమ నంబర్‌కు Caller tune పెట్టుకునేందుకు ఆసక్తి కలిగి ఉన్నారు. యూజర్ల ఆసక్తికి అనుగుణంగానే ప్రముఖ టెలికాం కంపెనీలు jio , Airtel సైతం తమ అధికారిక మ్యూజిక యాప్‌ల ద్వారా ఉచిత Caller tune సర్వీసులను అందుబాటులోకి తెచ్చాయి. దీంతో వినియోగదారులు సులువుగా తమకు నచ్చిన పాటను Caller tuneగా సెట్ చేసుకోగలుగుతున్నారు.

మీరు కూడా జియో లేదా ఎయిర్‌టెల్ వినియోగదారు అయి ఉండి.. మీ నంబర్‌కు Caller tune ఎలా సెట్ చేసుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారా. అయితే మీకోసం మేం కాలర్ ట్యూన్ సెటప్ ప్రక్రియను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలియచేస్తున్నాం. ఈ రెండు టెలికాం కంపెనీల యూజర్లు ట్యూన్ పెట్టుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటే.. ఈ కింది ప్రాసెస్ ను అనుసరించి కాలర్ ట్యూన్‌ను పొందవచ్చు. పూర్తి వివరాల కోసం ఆర్టికల్ చివరి వరకు చదవండి.

jio యూజర్లు Caller tune సెట్ చేసుకునే ప్రక్రియను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం:
* ముందుగా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి 'JioSaavn' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* ఆ తర్వాత యాప్ ఓపెన్ చేసి JioTunes అనే ట్యాబ్ ను ఎంపిక చేసుకోవాలి.
* అనంతరం మీకు నచ్చిన పాటను సెర్చ్ చేయాలి. ఆ తర్వాత దానిపై లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా మీరు 'JioTune & Ringtone' అనే ఓ ఆప్షన్‌ను వస్తుంది.. దాన్ని ఎంపిక చేసుకోవాలి.
* అనంతరం మీరు ప్లే బటన్ నొక్కి పాటను ప్రివ్యూ వినొచ్చు. ఆ తర్వాత ఆ ట్యూన్ మీకు నచ్చినట్లయితే.. అక్కడే 'Set JioTune' అనే ఆప్షన్ ఉంటుంది. దానిని ఎంపిక చేసుకుని నిర్దారించాలి.
* ఇది విజయవంతంగా పూర్తయిన తర్వాత మీకు జియో ట్యూన్ విజయవంతంగా సెట్ అయినట్లు మెసేజ్ వస్తుంది.
* ఈ ప్రక్రియను ఫాలో అవడం ద్వారా జియో కాలర్ ట్యూన్ సెటప్ విజయవంతమవుతుంది.
* మెసేజ్ వచ్చిన కాసేపటి తర్వాత మీ నంబర్‌కు ట్యూన్ సెట్ అయిందా లేదా అనేది నిర్ధారించుకోవడానికి వేరే నంబర్ నుంచి మీ నంబర్‌కు కాల్ చేసి తనిఖీ చేసుకోవచ్చు.

Airtel యూజర్లు Caller tune సెట్ చేసుకునే ప్రక్రియను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం:
* ముందుగా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి 'Wynk Music' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* ఆ తర్వాత యాప్ ఓపెన్ చేసి Home Page ట్యాబ్ ను ఎంపిక చేసుకోవాలి.
* అనంతరం సెర్చ్ బాక్స్‌లో మీకు నచ్చిన పాటను సెర్చ్ చేయాలి. మీకు నచ్చిన పాట వచ్చిన తర్వాత దానిపై హలో ట్యూన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎంపిక చేసుకోవాలి.
* అనంతరం మీరు ప్రివ్యూ వినడానికి అవకాశం లభిస్తుంది. ఆ తర్వాత ప్రివ్యూలో మీకు నచ్చిన ట్యూన్‌ను ఎంపిక చేసుకోవాలి.
* ఆ ట్యూన్ మీకు నచ్చినట్లయితే.. అక్కడే సెట్ కాలర్ ట్యూన్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిని ఎంపిక చేసుకుని నిర్దారించాలి.
* ఇది విజయవంతంగా పూర్తయిన తర్వాత మీకు ఎయిర్‌టెల్ ట్యూన్ విజయవంతంగా సెట్ అయినట్లు మెసేజ్ వస్తుంది.
* ఈ ప్రక్రియను ఫాలో అవడం ద్వారా ఎయిర్‌టెల్ కాలర్ ట్యూన్ సెటప్ విజయవంతమవుతుంది.
* మెసేజ్ వచ్చిన కాసేపటి తర్వాత మీ నంబర్‌కు ట్యూన్ సెట్ అయిందా లేదా అనేది నిర్ధారించుకోవడానికి వేరే నంబర్ నుంచి మీ నంబర్‌కు కాల్ చేసి తనిఖీ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








