ఆధార్ నంబర్‌ని ఉపయోగించి డిజిటల్ పేమెంట్స్ చేయడం ఎలా??

|

వినియోగదారులు అన్ని రకాల చెల్లింపులు చేయడానికి డిజిటల్ మాధ్యమానికి మారిన ప్రముఖ దేశాలలో భారతదేశం ఒకటి. పేమెంట్స్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీ వద్ద మీ ATM కార్డ్ లేకపోతే మీరు UPIని ఉపయోగించవచ్చు. మీకు ఇంటర్నెట్ లేకున్న కూడా UPIని ఉపయోగించవచ్చు. అంతేకాకుండా మీకు UPI లేకుంటే వినియోగదారులు డిజిటల్‌గా డబ్బు పంపడానికి ఆధార్ కార్డ్ నంబర్‌ను ఉపయోగించే ఒక మార్గం ఉంది.

 
ఆధార్ నంబర్‌ని ఉపయోగించి డిజిటల్ పేమెంట్స్ చేయడం ఎలా??

BHIM అప్లికేషన్‌లో ఆధార్‌ను ఉపయోగించి డబ్బు పంపడానికి UIDAI ఒక ఎంపికను అందించింది. గ్రహీత వద్ద ఫోన్ లేదా UPI అడ్రస్ లేకపోయినా కూడా ఈ ఎంపిక పని చేస్తుంది. ఈ కొత్త పేమెంట్ పద్ధతిని ప్రవేశపెట్టడం ప్రధాన లక్ష్యం డిజిటల్ లావాదేవీల వ్యాప్తిని మెరుగుపరచడం.

BHIMలో ఆధార్ నంబర్‌ని ఉపయోగించి డిజిటల్ పేమెంట్స్ చేసే విధానం

** ఈ పద్ధతి కోసం మీకు కావలసిందల్లా గ్రహీత యొక్క 12-అంకెల ఆధార్ నంబర్. BHIM యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత వినియోగదారు లబ్ధిదారుల ఎంపికకు వెళ్లాలి. అక్కడ మీరు గ్రహీత యొక్క ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి.

** ఆ తర్వాత యాప్ మిమ్మల్ని ఆధార్ నంబర్‌ని వెరిఫై చేయమని అడుగుతుంది. సిస్టమ్ ఆధార్ లింకింగ్‌ని ధృవీకరిస్తుంది మరియు లబ్ధిదారుని చిరునామాను అందిస్తుంది. దీని తరువాత మీరు సులభంగా డబ్బును పంపవచ్చు.

ఆధార్ నంబర్‌ని ఉపయోగించి డిజిటల్ పేమెంట్స్ చేయడం ఎలా??

గ్రహీత అనేక బ్యాంకు అకౌంటులను ఆధార్‌తో అనుసంధానించినట్లయితే ఏమి జరుగుతుంది?

** DBT/ఆధార్ ఆధారిత క్రెడిట్‌లను స్వీకరించడానికి అతను/ఆమె ఎంచుకున్న గ్రహీత యొక్క బ్యాంక్ ఖాతా క్రెడిట్ చేయబడుతుందని UIDAI ధృవీకరించింది.

** చెల్లింపులను స్వీకరించడానికి ఆధార్ పే POSని ఉపయోగించే వ్యాపారులు డిజిటల్ పేమెంట్లను స్వీకరించడానికి మీ ఆధార్ నంబర్ మరియు వేలిముద్రను కూడా ఉపయోగించవచ్చు.

ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంటులు ఆధార్‌తో లింక్ చేయబడితే ఏమి జరుగుతుంది?

మీరు అన్ని అకౌంటులను ఉపయోగించవచ్చు. ఆధార్ ఆధారిత పేమెంట్స్ చేస్తున్నప్పుడు మీరు చెల్లించాలనుకుంటున్న బ్యాంక్ పేరును ఎంచుకోవడానికి మీకు ఒక ఎంపిక ఇవ్వబడుతుంది. మీరు ఈ పద్ధతిని ఉపయోగించి పేమెంట్స్ చేసిన ప్రతిసారీ బ్యాంక్‌ని నిర్ణయించే ఎంపికను మీరు కలిగి ఉంటారు.

Best Mobiles in India

English summary
How to Make Digital Payments Using Just an Aadhaar Number? Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X