ఐటీ రిటర్న్స్ ఆన్‌లైన్‌లో చెల్లించటం ఎలా..?
గడిచిన ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ను ఫైల్ చేసేందుకు మార్చి 31తో గడువు ముగిసింది.
గడిచిన ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ను ఫైల్ చేసేందుకు మార్చి 31తో గడువు ముగిసింది. అయితే చాలామంది కొన్ని కారణాల వల్ల ఇన్‌కమ్ ట్యాక్స్ గడువు ముగిసినప్పటికీ దాన్ని చెల్లించడంలో జాప్యం జరగుతూ ఉంటుంది. అయితే అలాంటి వారు ఆన్ లైన్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. నెట్-బ్యాకింగ్ ఫెసిలిటీతో ట్యాక్స్ చెల్లింపు ప్రొసీజర్‌ను పూర్తి చేయవచ్చు. అంతేకాకుండా ఐటీ రిటర్న్స్‌ను ఈ-ఫైల్ చేసుకునే సమయంలో Umang, Aaykar Setu వంటి ప్రభుత్వ యాప్స్ సహాయం కూడా తీసుకోవచ్చు. ఇంటర్నెట్ ద్వారా ఐటీ రిటర్న్స్‌ను ఫైల్ చేసేందుకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ పై ఓ స్మార్ట్ లుక్కేయండి.

స్టెప్ 1:
మీ ఆదాయ పన్నును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలనుకుంటున్నట్లయితే ముందుగా http://www.tin-nsdl.com అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి Services > e-payment ఆప్షన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 2 :
Services > e-payment సెక్షన్‌లోకి వెళ్లిన తరువాత సంబంధిత చలానా(ITNS 280, ITNS 281, ITNS 282, ITNS 283, ITNS 284)ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 3 :
చలానాను సెలక్ట్ చేసకున్న తరువాత మీ PAN లేదా TAN నెంబర్‌తో పాటు ఇతర ముఖ్యమైన వివరాలను ఎంటర్ చేయండి.

స్టెప్ 4 :
మీరు ఎంటర్ చేసిన వివరాలు ఖచ్చితంగా ఉన్నట్లయితే 'confirmation screen' ఒకటి డిస్‌ప్లే పై ప్రత్యక్షమవుతుంది. ఈ ప్రాసెస్ పూర్తి అయిన వెంటనే పేమెంట్ పూర్తి చేసేందుకు నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్‌లోకి ట్యాక్స్ పేయర్ డైరెక్ట్ కాబడతారు. ఇక్కడ, యూజర్ తన బ్యాంక్ అకౌంట్‌లోకి లాగిన్ అయి పేమెంట్ ప్రొసిజర్‌ను పూర్తి చేసినట్లయితే ట్యాక్స్ చెెల్లింపు పూర్తవుతుంది.


Click it and Unblock the Notifications