మీ జీమెయిల్ అకౌంట్ సేఫ్ జోన్‌లో ఉందా..?

|

సెక్యూరిటీ విషయంలో జీమెయిల్ యూజర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నట్లు గూగుల్ చెబుతోంది. భద్రత కోసం జీమెయిల్ యూజర్లు టూ స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవటం మంచిదని ఇప్పటికి అనేక సార్లు వెల్లడించింది. టూ స్టెప్ వెరిఫికేషన్ వెరిఫికేషన్‌లో భాగంగా మొదటి స్టెప్ పాస్‌వర్డ్ రూపంలో, రెండవ స్టెప్ పాస్‌ కోడ్ రూపంలో వినియోగించవల్సి ఉంటుంది.

Read More : మీ ఆధార్ బయోమెట్రిక్ సురక్షితమేనా? లాక్ చేయటం ఎలా?

టూ స్టెప్ వెరిఫికేషన్

టూ స్టెప్ వెరిఫికేషన్

Ransomware అంటే ఏంటి..?Ransomware అంటే ఏంటి..?

టూ స్టెప్ వెరిఫికేషన్ విధానంలో భాగంగా మీరు మీ మొబైల్ నెంబరును గూగుల్ అనుసంధానించవల్సి ఉంటుంది. గూగుల్ అకౌంట్‌ను ఓపెన్ చేసే ప్రయత్నంలో యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసిన ప్రతిసారి మీ మొబైల్ ఫోన్‌కు 6 అంకెల వెరిఫికేషన్ కోడ్ నెంబరుతో మెసేజ్ వస్తుంది. అప్పుడు ఆ కోడర్ నెంబరు ఇతరులకు తెలియదు కాబట్టి మీ జీమెయిల్ అకౌంట్ ఇతరులు ఎవరూ హ్యాకింగ్ చేయబలరు. దీనివల్ల మీ మెయిల్‌లో సురక్షితంగా లావాదేవీలు జరుపుకోవచ్చు. గూగుల్ యూజర్లు తమ ఆన్‌లైన్ డేటాను మరింత సురక్షితంగా ఉంచుకునేందుకు అందుబాటులో ఉన్న టూ స్టెప్ వెరిఫికేషన్ ప్రక్రియను ఉపయోగించుకునే తీరును ఇక్కడ సూచించటం జరుగుతోంది..

స్టెప్ 1

స్టెప్ 1

ప్రముఖ మోటరోలా స్మార్ట్‌ఫోన్ పై రూ.5,000 తగ్గింపుప్రముఖ మోటరోలా స్మార్ట్‌ఫోన్ పై రూ.5,000 తగ్గింపు

ముందుగా మీ జీమెయిల్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. కుడివైపు టాప్ మెనూ బార్‌లో కనిపించే అకౌంట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆ తరువాత కనిపించే పేజీలో పైన కనిపించే సెక్యూరిటీ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు కనిపించే పాస్‌వర్డ్ డైలాగ్ బాక్స్‌లో టూ స్టెప్ వెరిఫికేషన్ ఆప్షన్ పక్కన కనిపించే "Setup" ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆ తరువాత కనిపించే పేజీలో "Start setup" బటన్ పై క్లిక్ చేసినట్లయితే టూ స్టెప్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

స్టెప్ 2

స్టెప్ 2

ఒకే ఆండ్రాయిడ్ ఫోన్‌లో రెండు ఫేస్‌బుక్ అకౌంట్‌లను వాడుకోవటం ఎలా?ఒకే ఆండ్రాయిడ్ ఫోన్‌లో రెండు ఫేస్‌బుక్ అకౌంట్‌లను వాడుకోవటం ఎలా?

టూ స్టెప్ వెరిఫికేషన్ కోడ్‌ను యాక్టివేట్ చేసుకునే క్రమంలో ప్రతిసారి వెరిఫికేషన్ కోడ్ అందవల్సిన ఫోన్ నెంబర్‌ను మీరు ఎంటర్ చేయవవల్సి ఉంటుంది. మీరు ఎంపిక చేసుకునే ఆప్షన్‌ను బట్టి ఆరు అంకెల వెరిఫికేషన్ కోడ్ ఎస్ఎంఎస్ లేదా వాయిస్ కాల్ రూపంలో మీ ఫోన్‌కు అందుతుంది.

స్టెప్ 3

స్టెప్ 3

రూ.3000 రేంజ్‌లో లేటెస్ట్ 4G VoLTE ఫోన్‌లు ఇవేరూ.3000 రేంజ్‌లో లేటెస్ట్ 4G VoLTE ఫోన్‌లు ఇవే

తక్షణమే, మీరు ఎంటర్ చేసిన ఫోన్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ లేదా వాయిస్ కాల్ రూపంలో 6 అంకెలతో కూడిన వెరిఫికేషన్ కోడ్ అందుతుంది. ఆ కోడ్‌ను మీరు Enter verification code ఆప్షన్ ప్రక్కన కనిపించే ఖాళీ బాక్సులో ఎంటర్ చేయవల్సి ఉంటుంది.

స్టెప్ 4

స్టెప్ 4

తరువాత ప్రత్యక్షమయ్యే Trust this computer బాక్సులో "Next" ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు గూగుల్ టూ స్టెప్ వెరిఫికేషన్‌ను యాక్టివేట్ చేసేందుకు "Confirm" ఆప్షన్ పై క్లిక్ చేయవల్సి ఉంటుంది. అలా చేసినట్లయితే మీ గూగుల్ అకౌంట్‌కు గూగుల్ టూ స్టెప్ వెరిఫికేషన్ ప్రక్రియ అమలైనట్లే.

Best Mobiles in India

English summary
How to Make Your Gmail Accounts More Secure. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X