మీ ఇంటిని స్మార్ట్‌హోమ్‌లా మార్చాలనుకుంటున్నారా..?
టెక్నాలజీ కాస్తా స్మార్ట్ టెక్నాలజీలా మారిపోతుండటంతో ప్రతిఒక్కరూ స్మార్ట్‌గా జీవించాలనుకుంటున్నారు.
టెక్నాలజీ కాస్తా స్మార్ట్ టెక్నాలజీలా మారిపోతుండటంతో ప్రతిఒక్కరూ స్మార్ట్‌గా జీవించాలనుకుంటున్నారు. అవసరాలకు అనుగుణంగా పుట్టుకొస్తోన్న కొత్తకొత్త గాడ్జెట్‌లు ఆధునిక మనిషి జీవనశైలిని మరింత సుఖవంతం చేస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు మొబైల్ ఫోన్‌లకే పరిమితైన స్మార్ట్ టెక్నాలజీ ఇప్పుడు ఇతర విభాగాల్లోనూ విస్తరిస్తోంది. వాటిలో హోమ్ ఆటోమేషన్ రంగం ఒకటి. భారత్‌లో ఇప్పుడిప్పుడే విస్తరిస్తోన్న హోమ్ ఆటోమేషన్ ట్రెండ్ భవిష్యత్‌లో ఉగ్రరూపం దాల్చబోతోంది. స్మార్ట్ హోమ్ టెక్నాలజీని అందిపుచ్చుకోవటం ద్వారా మన ఇంట్లోని ఎలక్ట్రానిక్ గృహోపకరణాల దగ్గర నుంచి టెక్ యాక్సెసరీస్ వరకు ఒకదానితో మరొకటి కనెక్ట్ అయి పనిచేయటం ప్రారంభిస్తాయి. అది ఏ విధంగానో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటర్నెట్ కీలక పాత్ర
స్మార్ట్ హోమ్‌కు ఇంటర్నెట్ అనేది బేసిక్ అవసరం. మీ సాధారణ ఇంటిని స్మార్ట్ హోమ్‌లా మార్చాలనుకుంటన్నట్లయితే ముందుగా పిటిష్టమైన ఇంటర్నెట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవల్సి ఉంటుంది. ఇందుకు మంచి నెట్‌వర్క్‌తో పాటు అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో కూడిన వై-ఫై రౌటర్ అవసరమవుతుంది. వై-ఫై కనెక్షన్‌ను తీసుకోవటం వల్ల ఇంట్లోని అన్ని గదుల్లో ఇంటర్నెట్‌ను వ్యాపింపజేసే వీలుంటుంది.

స్మార్ట్ లైట్ బల్బ్స్
మీ ఇంటిని ఫ్యూచరిస్టిక్‌గా మార్చాలనుకుంటన్నట్లయితే, ఇంట్లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేయక తప్పదు. సాధారణ కరెంటు బల్బుల స్థానంలో స్మార్ట్ లైట్ బల్బ్స్‌ను అమర్చి వాటిని స్మార్ట్‌ఫోన్‌తో కంట్రోల్ చేయటం ద్వారా స్మార్ట్ హోమ్ ట్రెండ్‌ను ఆస్వాదించవచ్చు.

స్మార్ట్ స్పీకర్ సిస్టం
గూగుల్, అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఇప్పటికే అనేక స్మార్ట్ స్పీకర్లను మార్కెట్లో ఆఫర్ చేస్తున్నాయి. ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయి స్పందించగలిగే ఈ స్పీకర్స్ మీ ఫోన్ కాల్స్ అలానే మెసేజెస్‌కు సంబంధించి భాద్యతను తీసుకోవటంతో పాటు మీ టీవీ అలానే మ్యూజిక్ సిస్టంను పూర్తిగా కంట్రోల్ చేయగలుగుతాయి.

స్మార్ట్ నిఘా కెమెరా
స్మార్ట్ కెమెరాలను మీ ఇంట్లోని అన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో ప్లేస్ చేసి వాటిని స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసినట్లయితే ఇవి మీ ఇంటికి కాపలా కాస్తూ మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటాయి. ఈ స్మార్ట్ కెమెరాలు మీరు ఇంట్లో లేని సమయంలో మీ పరిసరాలను క్షుణ్నంగా వాచ్ చేస్తూ మొత్తం డేటాను రికార్డ్ చేస్తుంటాయి.

స్మార్ట్ స్విచెస్..
ఇవి కొంచ ఖరీదైనవి అయినప్పటికి మీ ఇంట్లోని లైటింగ్ సిస్టంను సులువుగా మేనేజ్ చేయగలుగుతాయి. వీటిలో నిక్షిప్తం చేసే మోషన్ సెన్సార్స్ మీరు సెట్ చేసిన సెన్సును బట్టి రూమ్‌లోని లైట్లను ఆన్ చేయటం లేదా ఆఫ్ చేయటం చేస్తాయి.

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యాక్సెసరీస్..
మనుషుల జీవితాలను మరింత అత్యాధునికం చేసేందుకు ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్' ఐఓటీ (IOT) మరికొద్ది సంవత్సరాల్లో సాకారం కాబోతోంది. మనుషులు మనుషులు మాట్లాడుకుని ఒకరికొకరు సహాయం చేసుకున్నట్లుగానే ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లో మెషీన్లన్ని కనెక్టెడ్‌గా ఒక నెట్‌వర్క్‌లో పనిచేయటం ప్రారంభిస్తాయి. అంటే.. యంత్రాలు, పరికరాలు కూడా ఇంటర్నెట్‌కు అనుసంధానమై మనుషుల్లాగా పరస్పరం సంప్రదించుకుంటూ మనిషి జీవన విధానాన్ని మరింత సుఖమయం చేసేస్తాయనమాట. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే ప్రపంచమే ఓ స్మార్ట్ నగరంగా మారిపోతుంది.


Click it and Unblock the Notifications








