స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌లకు కెమెరా, లొకేషన్, మైక్రోఫోన్ అనుమతులు నిలిపి వేయాలా.. ఈ టిప్స్ మీకోసమే..!!
స్మార్ట్ ఫోన్లు వినియోగం ప్రస్తుతం భారీగా పెరిగింది. హై స్పీడ్ డేటా అందుబాటులోకి వచ్చాక ఇంటర్నెట్ వినియోగం కూడా భారీగా పెరిగింది. అయితే అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ సహా ఇతర అనేక మార్గాల ద్వారా సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారం సహా బ్యాంకింగ్ వివరాలను కాజేస్తున్నారు.
వివరాలను భద్రపరుచుకోవడం ఎంతో ముఖ్యం : స్మార్ట్ ఫోన్‌లో ఉన్న యాప్‌ల అనుమతులు వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం అనేక యాప్‌లు వివిధ అవసరాల కోసం కెమెరా, మైక్రో ఫోన్, లొకేషన్ ను యాక్సెస్ చేసేందుకు ( Smartphone Permissions ) అనుమతులు అడుగుతున్నాయి.

అయితే కొన్ని యాప్‌లు అవసరం లేకున్నా పైన వివరాలను అడుగుతున్నాయి. దీని వల్ల ఏదైనా సందర్భంలో వ్యక్తిగత డేటా భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అయితే యాప్ ఇన్ స్టాల్ సమయంలో అప్రమత్తతతో వ్యవహరించడం వల్ల డేటా భద్రంగా ఉంటుంది. లొకేషన్, కెమెరా, మైక్రో ఫోన్ అనుమతి ఇస్తున్న సమయంలో ఎలా వ్యవహరించాలి.
యాప్ వినియోగం సమయంలో మాత్రమే : ఏదైనా యాప్ మైక్రో ఫోన్, కెమెరా, లోకేషన్ వివరాలను అడుగుతున్నట్లయితే ఎల్లప్పుడూ వినియోగించుకొనేందుకు అనుమతి ఇచ్చే బదులు యాప్ ఓపెన్ చేసిన సమయంలో మాత్రమే ఆయా వివరాలను వినియోగించుకొనేందుకు అనుమతి ఇవ్వాలి. ఇందుకు ( Allow Only While Using the app ) ఆప్షన్ ను ఎంచుకోవాలి.
దీంతోపాటు స్మార్ట్ ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి లోకేషన్, కెమెకా, మైక్రో ఫోన్ అనుమతి ఇచ్చేలా Ask Every Time అనే ఆప్షన్ ను వినియోగించుకోవచ్చు. ఇలా తాత్కాలికంగా అనుమతి ఇవ్వడం ద్వారా వ్యక్తి గత, బ్యాంకింగ్ వంటి సున్నితమైన సమాచారాన్ని మోసగాళ్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
అనుమతి నిరాకరణ : స్మార్ట్ ఫోన్ లో లోకేషన్, కెమెరా, మైక్రో ఫోన్ ల అనుమతిని పూర్తిగా నిరాకరించవచ్చు. ఇందుకు Don't Allow ఆప్షన్‌ను వినియోగించుకోవచ్చు. అయితే కొన్ని యాప్‌లకు ఈ అనుమతులను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. లేకుంటే వినియోగించే వీలుండదు.
అయితే ఈ అనుమతులను ఎలా మార్చుకోవాలి..?
ఆండ్రాయిడ్ ఫోన్‌లోని సెట్టింగ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అనంతరం యాప్స్ లోకి వెళ్లాలి. తర్వాత పర్మిషన్ లోకి వెళ్లాలి. అందులో కెమెరా, లోకేషన్, కాంటాక్ట్, మైక్రో ఫోన్ వంటి ఆప్షన్ లను గుర్తించవచ్చు. అనంతరం పైన తెలిపిన విధంగా ఎలాంటి అనుమతులు ఇవ్వాలో నిర్ణయం తీసుకోవచ్చు.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








