మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో మల్టిపుల్ గూగుల్ అకౌంట్లను మేనేజ్ చేయటం ఎలా..?

మనలో చాలా మంది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో గూగుల్ అకౌంట్లను కలిగి ఉంటున్నారు.

By GizBot Bureau
|

మనలో చాలా మంది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో గూగుల్ అకౌంట్లను కలిగి ఉంటున్నారు. వీటిలో కొన్ని అకౌంట్లు వ్యక్తిగత అకౌంట్లు కాగా మరికొన్ని మాత్రం వారివారి వర్కుకు సంబంధించినవి. చాలా మంది యూజర్లకు ఈ మల్టిపుల్ అకౌంట్లను ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలో తెలియకపోవటంతో ఒక అకౌంట్ నుంచి లాగ్ అవుట్ అయి మరొక అకౌంట్‌లోకి లాగిన్ అవుతున్నారు.

క్రింది గైడ్‌ను ఫాలో అవటం ద్వారా...

క్రింది గైడ్‌ను ఫాలో అవటం ద్వారా...

ఈ ప్రాసెస్‌లో బోలెడంత సమయాన్ని వారు కోల్పోతున్నారు. ఇటువంటే వారి జాబితాలో మీరు కూడా ఉన్నట్లయితే ఈ స్టోరీ ద్వారా మీకో పరిష్కార మార్గాన్ని చూపించటం జరుగుతోంది. ఈ క్రింది గైడ్‌ను ఫాలో అవటం ద్వారా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లలోని మల్టిపుల్ గూగుల్ అకౌంట్లను ఒకేసారి మేనేజ్ చేసుకునే వీలుంటుంది...

 

 

‘Add account’ ఆప్షన్‌లోకి వెళ్లి..

‘Add account’ ఆప్షన్‌లోకి వెళ్లి..

ఈ ట్యుటోరియల్‌ను ఆండ్రాయిడ్ 8.1 (ఓరియో) ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లో టెస్ట్ చేయటం జరిగింది. మల్టిపుల్ గూగుల్ అకౌంట్లను మేనేజ్ చేసుకునేందుకు ముందుగా మీ ఆండ్రాయిడ్ డివైస్ హోమ్ స్క్రీన్ ను ఓపెన్ చేసి సెట్టింగ్స్ ఐకాన్ పై టాప్ చేయండి. సెట్టింగ్స్‌లోకి వెళ్లిన తరువాత అకౌంట్ సెక్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. అకౌంట్స్ విభాగంలో దిగువున ‘Add account' అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది.

 

 

లాగిన్ ప్రాసెస్ కంప్లీట్ చేసే క్రమంలో...
 

లాగిన్ ప్రాసెస్ కంప్లీట్ చేసే క్రమంలో...

ఈ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే కొన్ని అకౌంట్స్ మీకు కనిపిస్తాయి.వాటిలో ‘Google'ను మీరు సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. దీనిని కన్ఫర్మ్ చేసేందుకు డివైస్ పాస్‌వర్డ్ లేదా ఫింగర్‌ప్రింట్‌ను ఇవ్వవల్సి ఉంటుంది. తదుపరి స్టెప్‌లో భాగంగా మీ గూగుల్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ ప్రాసెస్ కంప్లీట్ చేసే క్రమంలో మీ ఈ-మెయిల్ అడ్రస్, పాస్‌వర్డ్‌లను ఎంటర్ చేస్తే సరిపోతుంది.

 

 

గూగుల్ అకౌంట్ ఆటోమెటిక్‌గా సెటప్ కాబడుతుంది...

గూగుల్ అకౌంట్ ఆటోమెటిక్‌గా సెటప్ కాబడుతుంది...

అకౌంట్‌కు మరింత సెక్యూరిటీని కల్పించాలనుకుంటున్నట్లయితే టు-ఫ్యాక్టర్ అథంటికేషన్‌ను సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు కొత్త అకౌంట్‌ను క్రియేట్ చేయాలనుకుంటున్నట్లయితే ఇనీషియల్ లాగిన్ స్ర్కీన్ ద్వారానే అది చేయవచ్చు. ఎటువంటి అవరోధాలు లేకుండా సైన్-ఇన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లయితే, మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో గూగుల్ అకౌంట్ ఆటోమెటిక్‌గా సెటప్ కాబడుతుంది. దానితో పాటో మీ గూగుల్ అకౌంట్ డేటా కూడా ఆటోమెటిక్‌గా సింక్ అయిపోతుంది.

 

 

మేనేజ్ చేయాలనుకుంటోన్న అకౌంట్‌ను సెలక్ట్ చేసుకుని..

మేనేజ్ చేయాలనుకుంటోన్న అకౌంట్‌ను సెలక్ట్ చేసుకుని..

దీంతో మల్టిపుల్ గూగుల్ అకౌంట్స్ మీ ఫోన్‌లో సెటప్ కాబడతాయి. వీటిని నచ్చిన విధంగా మేనేజ్ చేసుకనే క్రమంలో అకౌంట్స్ విభాగంలోకి వెళ్లి మీరు మేనేజ్ చేయాలనుకుంటోన్న అకౌంట్‌ను సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. వీటిలో ఏదైనా అకౌంట్‌ను మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నట్లయితే అకౌంట్స్‌లోకి వెళ్లిన తరువాత టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే ‘త్రీ' డాట్ ఐకాన్ పై క్లిక్ చేసిన రిమూవ్ చేయాలనుకుంటోన్న అకౌంట్ పై క్లిక్ చేసినట్లయితే రిమూవ్ కాబడుతుంది.

 

 

 

Best Mobiles in India

English summary
How to manage multiple Google accounts on your Android device.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X