Android ఫోన్‌లో డూప్లికేట్ కాంటాక్ట్‌లు ఎక్కువగా ఉన్నాయా? ఒకదానితో మరొకటి విలీనం చేయడం ఎలా?

|

స్మార్ట్‌ఫోన్‌ల వాడకం అధికంగా ఉన్న ఈ రోజులలో మార్కెట్ లోకి మంచి ఫీచర్లతో ఏదైనా ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వస్తే కనుక ఆ స్మార్ట్‌ఫోన్‌కు మారడానికి పరితపిస్తూ ఉంటారు. అయితే ఎంత కొత్త ఫీచర్లు ఉన్నప్పటికీ కూడా మీ విలువైన డేటాను కోల్పోవడం మరియు కొత్త ఫోన్‌ని సెటప్ చేయడం ఎలా అనే భయాన్ని ఖచ్చితంగా కలిగి ఉంటారు. ఆండ్రాయిడ్ ఫోన్‌లను మార్చేటప్పుడు వినియోగదారులు సాధారణంగా ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఒకటి కాంటాక్ట్‌ డూప్లికేషన్. మీరు Gmailలో అలాగే SIM కార్డ్‌లో కాంటాక్ట్‌ల బ్యాకప్‌ని కలిగి ఉన్నందున ఒకే నెంబర్ బహుళ డూప్లికేషన్ లతో తిరిగి లభిస్తూ ఉంటుంది. డూప్లికేషన్ లేని విధంగా ఈ కాంటాక్ట్‌లను ఎలా మర్జ్ చేయవచ్చునో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

How to Merge or Remove Multiple Duplicate Contacts on Your Android Phone

Androidలో డూప్లికేషన్ కాంటాక్ట్‌లను విలీనం చేసే విధానం

మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లను మార్చినప్పుడు బ్యాక్ అప్ రూపంలో లభించిన ఒకే కాంటాక్ట్ నంబర్ వివిధ రకాలుగా లభిస్తే కనుక డూప్లికేట్ కాంటాక్ట్‌లను విలీనం చేయడానికి కింద ఉన్న కొన్ని దశలను పాటించండి. ముఖ్యంగా ఈ దశలు బ్రాండ్ నుండి బ్రాండ్‌కు కొంత భిన్నంగా ఉండవచ్చు.

ప్రైవేట్ టెల్కోలు రూ.3000 కంటే ఎక్కువ ధరతో అందించే ఖరీదైన ప్రీపెయిడ్ ప్లాన్‌లుప్రైవేట్ టెల్కోలు రూ.3000 కంటే ఎక్కువ ధరతో అందించే ఖరీదైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు

How to Merge or Remove Multiple Duplicate Contacts on Your Android Phone

** మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని కాంటాక్ట్స్ యాప్‌ని ఓపెన్ చేయండి. తరువాత మెనుపై ట్యాప్ చేయండి.
** సెట్టింగ్స్ > కాంటాక్ట్స్ మేనేజర్> మర్జ్ కాంటాక్ట్స్.
** మీరు "మర్జ్" ఎంపికపై నొక్కడం ద్వారా నిర్దిష్ట కాంటాక్ట్‌లను విలీనం చేయడానికి ఎంచుకోవచ్చు.
** మీరు "క్విక్ మర్జ్" ఎంచుకోవడం ద్వారా ఒకేపేరుతో సేవ్ చేయబడిన నకిలీ కాంటాక్ట్‌లను విలీనం చేయడానికి కూడా ఎంచుకోవచ్చు.

Apple, Meta కంపెనీల AR గ్లాసెస్‌ యొక్క ఫీచర్స్, ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసాApple, Meta కంపెనీల AR గ్లాసెస్‌ యొక్క ఫీచర్స్, ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా

ముఖ్యంగా OnePlus బ్రాండ్‌ల ఫోన్‌లను ఉపయోగిస్తున్న వారు కాంటాక్ట్‌ల యాప్‌ని తెరిచినప్పుడల్లా వారి నకిలీ కాంటాక్ట్‌లను విలీనం చేయమని వినియోగదారున్ని అడుగుతూనే ఉంటుంది. వారు దీన్ని మాన్యువల్‌గా చేయడాన్ని ఎంచుకోవచ్చు లేదా అన్నింటినీ ఒకేసారి విలీనం చేయవచ్చు.

Androidలో నకిలీ కాంటాక్ట్‌లను తీసివేయడానికి Gmailని ఉపయోగించే విధానం

మీరు Gmail మరియు ఫోన్‌లోని కాంటాక్ట్‌ల బ్యాకప్‌ని కలిగి ఉన్నప్పుడు కాంటాక్ట్‌లు సమకాలీకరించబడిన వెంటనే నకిలీకి కట్టుబడి ఉంటాయి. డూప్లికేట్ కాంటాక్ట్‌లను పూర్తిగా తీసివేయడానికి కింద ఉన్న పద్దతులను అనుసరించండి.

How to Merge or Remove Multiple Duplicate Contacts on Your Android Phone

** మీ Gmail అకౌంటును ఓపెన్ చేసి ఎడమవైపు ఎగువ మూలలో ఉన్న మెనుకి వెళ్లి, డ్రాప్ డౌన్ జాబితా నుండి "కాంటాక్ట్స్" ఎంపికను ఎంచుకోండి.
** అప్పుడు మీరు మీ యొక్క అన్ని కాంటాక్ట్‌లను చూస్తారు. స్క్రీన్ పైభాగంలో ఉన్న "మోర్" ఎంపికపై నొక్కండి. తరువాత నకిలీ కాంటాక్ట్‌ల ఎంపికను ఎంచుకోండి.

** మీరు నకిలీ కాంటాక్ట్‌ల జాబితాను చూస్తారు. మీరు విలీనం చేయకూడదనుకునే పరిచయాల ఎంపికను తీసివేయవచ్చు.
** తరువాత "విలీనం" మరియు voila ఎంపికను ఎంచుకోండి.

Best Mobiles in India

English summary
How to Merge or Remove Multiple Duplicate Contacts on Your Android Phone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X