మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో డూప్లికేట్ కాంటాక్ట్స్‌ను రిమూవ్ చేయటం ఎలా..?

|

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను ప్రధానంగా వేధిస్తోన్న సమస్యల్లో 'డుప్లికేట్ కాంటాక్ట్స్' (duplicate contacts) ఒకటి. ముఖ్యంగా కాల్స్ చేసుకునే సమయంలో ఈ డూప్లికేట్ కాంటాక్ట్స్ అనేవి తీవ్రమైన ఆసౌకర్యానికి గురి చేస్తుంటాయి. ఈ సమస్యను ఫేస్ చేస్తున్న చాలా మంది యూజర్లు కాల్స్ చేసేందుకు గూగుల్ వాయిస్ అసిస్టెంట్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. వాస్తవానికి 'డుప్లికేట్ కాంటాక్ట్స్' అనేది పెద్ద సమస్యేమి కాదు. ఈ ఎర్రర్‌ను చాలా సులువుగా పరిష్కరించుకోవచ్చు. ఆ ప్రొసీజర్ ను ఇప్పుడు తెలుసుకుందాం..

 

శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఎస్9+లలో డిస్నీ తరహా ఏఆర్ ఎమోజీలు సిద్ధం..శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఎస్9+లలో డిస్నీ తరహా ఏఆర్ ఎమోజీలు సిద్ధం..

 మొదటి పద్థతి..

మొదటి పద్థతి..

మొదటి పద్థతిలో భాగంగా మీ ఫోన్ నుంచే డూప్లికేట్ కాంటాక్ట్స్‌ను డిలీట్ లేదా మెర్జ్ చేయవచ్చు. ఇలా చేయాలంటే ముందుగా మీ ఫోన్ కాంటాక్ట్స్ యాప్‌లోకి వెళ్లి మెనూ బటన్ పై క్లిక్ చేయండి. కాంటాక్ట్స్ యాప్ కు సంబంధించిన మెనూ ఓపెన్ అయిన తరువాత అందులోని Manage Contacts ను సెలక్ట్ చేసుకుని Merge ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ కాంటాక్ట్స్ యాప్‌లో ఉన్న అన్ని రిపీటెడ్ కాంటాక్ట్స్ స్ర్కీన్ పై కనిపిస్తాయి. వీటిలో మెర్జ్ చేయవల్సిన కాంటాక్ట్స్‌ను ఒక్కొకటిగా మెర్జ్ చేయవచ్చు.

రెండవ పద్థతి..

రెండవ పద్థతి..

రెండవ పద్థతిలో భాగంగా మీ ఫోన్‌లోని రిపీటెడ్ కాంటాక్ట్స్‌ను గూగుల్ అకౌంట్ ద్వారా మెర్జ్ లేదా డిలీట్ చేసుకోవచ్చు. ఇలా చేయాలంటే ముందుగా మీ జీయెయిల్ అకౌంట్‌లోకి లాగినై కాంటాక్ట్స్ విభాగంలో వెళ్లాలి. కాంటాక్ట్స్ విభాగంలోకి వెళ్లిన తరువాత కుడి వైపు కనిపించే సైడ్ బార్‌లో "Duplicates" ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మెర్జ్ అయిన అన్ని కాంటాక్ట్స్ లిస్ట్ మీకు కనిపిస్తుంది. ఈ లిస్ట్ ను బట్టి మెర్జ్ చేయవల్సిన కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఒక్కొకటిగా మెర్జ్ చేయవచ్చు.

మూడవ పద్థతి..
 

మూడవ పద్థతి..

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో డూప్లికేట్ కాంటాక్ట్స్‌ను రిమూవ్ లేదా మెర్జ్ చేసేందుకు అనేక థర్డ్ పార్టీ యాప్స్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతున్నాయి. అయితే, వీటిని ఎంపిక చేసుకునే ముందు సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. సాధ్యమైనంత వరకు వీటి జోలికి వెళ్లకపోవటం మంచిది.

స్మార్ట్‌ఫోన్‌లోని కాంటాక్ట్‌లను ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకోవటం ఏలా..?

స్మార్ట్‌ఫోన్‌లోని కాంటాక్ట్‌లను ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకోవటం ఏలా..?

స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న చాలా మంది మిత్రులు ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనే సమస్య ‘తమ ఫోన్‌లోని కాంటాక్ట్స్ పూర్తిగా తొలగిపోవటం'. స్ర్కీన్ పై పొరపాటున రాంగ్ బటన్ నొకట్టం కారణంగానో, యాదాలాపంగా ఫోన్‌ను ఫార్మాట్ చేసే సందర్భంలోనో, దురదృష్టవశాత్తూ ఫోన్ ఏదైనా ప్రమాదానికి గురికావటం కారణంగానే ఈ రకమైన సమస్యలు తలెత్తుతుంటాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మీరు ఉపయోగిస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లోని కాంటాక్ట్‌లను సురక్షితంగా బ్యాకప్ చేసుకునేందుకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..

యాపిల్ ఐఫోన్ యూజర్లకు..

యాపిల్ ఐఫోన్ యూజర్లకు..

మీరు ఐఫోన్‌ను వాడుతున్నట్లయితే ఫోన్ కాంటాక్ట్‌లను చాలా సులువుగా ఐక్లౌడ్‌లోకి బ్యాకప్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా మీ ఐఫోన్ తప్పనసరిగా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉండాలి. ఐక్లౌడ్ స్టోరేజ్‌లోకి కాంటాక్ట్‌లను బ్యాకప్ చేసుకునేందుకు... ముందుగా మీ ఐఫొన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఐక్లౌడ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ ఐక్లౌడ్ అకౌంట్‌లో కనిపించే ‘Contacs' ఆప్షన్‌ను ‘ON' మోడ్‌లో ఉంచినట్లయితే ఫోన్‌లోని కాంటాక్ట్స్ అన్నీ మీ ఐక్లౌడ్ అకౌంట్‌లోకి బ్యాకప్ కాబడతాయి.

ఆండ్రాయిడ్ యూజర్లకు..

ఆండ్రాయిడ్ యూజర్లకు..

ముందుగా మీ ఫోన్‌లోని Contactsలోకి వెళ్లండి. ఆ తరువాత కాంటాక్ట్స్ మెనూ పై క్లిక్ చేసినట్లయితే వివిధ రకాల ఆప్షన్‌లు మీకు కనిపిస్తాయి. వాటిలో Import/export ఆప్షన్ పై క్లిక్ చేసి, Export to storageను సెలక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ కాంటాక్స్ ఎక్స్‌పోర్ట్ అవుతున్నట్లు ఓ పాపప్ మెనూ స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది. దాన్ని OK చేయండి. ఆ తరువాత మీ ఫోన్‌లోని ఫైల్ మేనేజర్ అప్లికేషన్‌ను ఓపెన్ చేసి మీ కాంటాక్ట్స్ ఫోల్డర్ ఎక్కడ ఉందో చూసుకోండి. ఆ కాంటాక్ట్స్ ఫైల్‌ను కాపీ చేసుకుని సురక్షితమైన ప్రదేశంలో స్టోర్ చేసుకోండి.

Best Mobiles in India

English summary
It's not the worst thing that can happen to your smartphone, but if you have a ton of duplicate contacts it can be really inconvenient when you try to communicate with your friends and family, probably sending a message or trying to reach an old number.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X