మీ ఆండ్రాయిడ్ స్క్రీన్ షేర్ చేసుకోండిలా ...

Posted By: Madhavi Lagishetty

మీ పీసీ వర్క్‌ను మొబైల్‌తో మానిటర్ చేయాలనుకుంటున్నారా?, సాధారణంగా స్క్రీన్ మానిటరింగ్ ద్వారా అనేక డివైస్‌లను కనెక్ట్ చేసి చకచకా పనులన్నీ చక్కపెట్టేయచ్చు. ఇలాంటి సౌకర్యం ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్‌లలోకి కూడా వచ్చేసింది.

మీ ఆండ్రాయిడ్ స్క్రీన్ షేర్ చేసుకోండిలా ...

మీ స్క్రీన్‌ను మీ పక్కనే ఉన్న మరో ఆండ్రాయిడ్ ఫోన్ స్క్రీన్‌తో షేర్ చేసుకునే వీలు కలిగింది. ఫలితంగా మీ కంప్యూటర్‌తో, లేదా టాబ్లెట్‌తో ఆండ్రాయిడ్ ఫోన్‌ను కనెక్ట్ చేసి ఆ స్క్రీన్‌ను షేర్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ మిర్రరింగ్ టూల్ ద్వారా ఇది సాధ్యమయ్యింది.

ఈ మిర్రరింగ్ టూల్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ మీద లభిస్తోంది. ముందుగా ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని బ్లూటూత్, హాట్ స్పాట్, వైఫై ద్వారా ఇతర సాధనాలతో కనెక్ట్ కావచ్చు. కింది స్టెప్స్‌ను అనుసరించి స్క్రీన్ షేర్‌ను మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

స్టెప్ 1

గూగుల్ ప్లే స్టోర్ నుంచి స్క్రీన్ షేర్ యాప్‌ను డౌన్లోడ్ చేయండి. మీరు కనెక్ట్ చేయాలనుకునే రెండు డివైజెస్‌లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

స్టెప్ 2 

యాప్ లాంచ్ అయ్యాక స్క్రీన్ షేర్ సర్వీస్ బటన్‌ను క్లిక్ చేయండి, అందులో మెనూ సెలెక్ట్ చేయండి. బ్లూటూత్ లేదా ఇతర కనెక్టివిటీతో రెండు డివైజ్‌లను కనెక్ట్ చేయండి.

స్టెప్ 3 

రెండు డివైజ్‌లను కనెక్ట్ చేసేందుకు బ్లూటూత్ కనెక్టెడ్ అనే స్టేటస్ చూపించాలి. అప్పుడే కనెక్ట్ అవుతాయి. లేకుంటే మళ్లీ ప్రయత్నించండి.

స్టెప్ 4

ఒక్కసారి కనెక్ట్ అయ్యాక రెండు డివైజెస్ మిర్రర్ అవుతాయి. ఇక మీరు పని మొదలు పెట్టవచ్చు. ఇందులో మరిన్ని ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి మిర్రర్ ఓప్, ఎయిర్ ప్లేఇట్, ఆప్షియా, అలాగే పీర్ డివైజ్ నెట్ ముఖ్యమైనవి.

English summary
Is it possible to mirror a smartphone to another smartphone? With advancement in technology, anything is possible. And for the question above, the answer is yes, indeed! Check it out here.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot