WhatsApp గ్రూప్ చాట్‌లను సిగ్నల్‌కు మార్చడం ఎలా??

|

ప్రపంచంలో అధిక మంది యూజర్లను కలిగిన వాట్సాప్ ఇటీవల కొత్తగా అప్ డేట్ చేయబడిన ప్రైవసీ విధానంపై వాట్సాప్ వినియోగదారులు కొద్దిగా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫాంలోని వినియోగదారుల నుండి సేకరించే డేటాను వివరంగా వెల్లడించింది. అలాగే దాని మాతృ సంస్థ ఫేస్‌బుక్‌తో కూడా షేర్ చేస్తున్నది. ఇలా చేయడంతో అసంతృప్తి చెందిన వినియోగదారులు ఇప్పుడు సిగ్నల్ మరియు టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లకు తరలిపోతున్నారు.

 

టెస్లా CEO ఎలోన్ మస్క్ సిగ్నల్ యాప్ ట్విట్టర్‌

టెస్లా CEO ఎలోన్ మస్క్ సిగ్నల్ యాప్ ట్విట్టర్‌

వాట్సాప్ యొక్క కొత్త గోప్యతా విధానం ప్రకటించినప్పటి నుండి వినియోగదారులు సిగ్నల్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌కు అధికంగా తరలిపోతున్నారు. వాస్తవానికి టెస్లా సంస్థ యొక్క CEO ఎలోన్ మస్క్ ట్విట్టర్‌లో తన అనుచరులను "సిగ్నల్ వాడండి" అని ప్రోత్సహించారు. సిగ్నల్ యాప్ ను ఇప్పటికే ఆపిల్ యాప్ స్టోర్ మరియు గూగుల్ ప్లే స్టోర్ రెండింటిలోనూ అధికంగా డౌన్‌లోడ్ చేయబడిన వాటిలో టాప్ యాప్‌గా మారింది.

వాట్సాప్ నుండి సిగ్నల్‌కు

వాట్సాప్ నుండి సిగ్నల్‌కు

మీరు కూడా వాట్సాప్ నుండి సిగ్నల్‌కు మారాలి అని అనుకుంటే కనుక మీకు నచ్చిన మెసేజ్ లు వాట్సాప్ గ్రూప్లలో ఉంటే ఆ చాట్‌లను సిగ్నల్‌కు బదిలీ చేయడానికి లేదా తరలించాలి అనుకుంటే కనుక కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. అవి ఎలాగో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వాట్సాప్ గ్రూప్ చాట్‌లను సిగ్నల్‌కు తరలించే విధానం
 

వాట్సాప్ గ్రూప్ చాట్‌లను సిగ్నల్‌కు తరలించే విధానం

స్టెప్ 1: మొదట మీ ఆండ్రాయిడ్, ఐఫోన్ లలో గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్ నుండి సిగ్నల్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి.

స్టెప్ 2: మీ స్మార్ట్‌ఫోన్‌లో సిగ్నల్ యాప్ ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత దానిని సెటప్ చేయండి. ఈ ప్రక్రియ చాలా సులభం మీ యొక్క ఫోన్ నంబర్‌ను జోడించి, OTP, పేరు మరియు ఇతర వివరాలను నమోదు చేయండి.

స్టెప్ 3: తరువాత కుడివైపు ఎగువ మూలలోని మూడు నిలువు చుక్కలపై క్లిక్ చేసి మెనుని ఎంచుకోవాలి. ఇందులో 'క్రొత్త గ్రూప్' ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 4: తరువాత గ్రూపును సెటప్ చేయడానికి మీకు తెలిసిన ఒక కాంటాక్ట్ నెంబర్ ను జోడించాలి.

స్టెప్ 5: మీరు కాంటాక్ట్ నెంబర్ ను ఎన్నుకోని ముందుకు కొనసాగించడానికి బాణం గుర్తు మీద నొక్కండి.

స్టెప్ 6: తరువాత ఈ గ్రూపుకు మీకు నచ్చిన పేరు పెట్టండి మరియు 'సృష్టించు' పై క్లిక్ చేయండి.

స్టెప్ 7: గ్రూప్ విండో లోపల కుడివైపు ఎగువ మూలలోని మూడు నిలువు చుక్కలపై క్లిక్ చేయండి.

స్టెప్ 8: తరువాత 'గ్రూప్ సెట్టింగులు' ఎంపికపై క్లిక్ చేసి 'గ్రూప్ లింక్' పై నొక్కండి మరియు ఆన్ చేయండి.

స్టెప్ 9: - ఆపై గ్రూపు కోసం భాగస్వామ్యం చేయదగిన లింక్‌ను పొందడానికి 'షేర్' నొక్కండి.

స్టెప్ 10: అప్పుడు మీరు లింక్‌ను కాపీ చేసి గ్రూపులోని వాట్సాప్ పరిచయాలతో పంచుకోవచ్చు.

వాట్సాప్ గ్రూపులోని మీ పాత చాట్‌లు సిగ్నల్‌కు బదిలీ చేయబడవు అని గుర్తుంచుకోండి.

Best Mobiles in India

English summary
How to Move WhatsApp Group Chats to Signal App

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X