WhatsApp, Messenger లో మిమ్మల్ని విసిగించే మెసేజ్లు ఎక్కువ అయ్యాయా? వీటిని మ్యూట్ చేయడం ఎలా?

|

సోషల్ మీడియా యాప్ల వినియోగం నేటి రోజులలో అదికంగా ఉంది. ఏదైనా విషయాలు సోషల్ మీడియా ద్వారానే తొందరగా జనాలలోకి వెళ్తున్నాయి. ఫేస్బుక్ మెసెంజర్ మరియు వాట్సాప్ వంటి వాటిని త్వరగా మెసేజ్లను చేయడం కోసం వినియోగిస్తున్నారు. మెసెంజర్‌లో ఎవరైనా మీకు మెసేజ్ పంపవచ్చు. అయితే వాట్సాప్ మీ కాంటాక్ట్ లోని నంబర్‌కు మాత్రమే మెసేజ్ ను పంపడానికి అనుమతిస్తుంది. ఎవరైనా మీకు టెక్స్ట్‌లను పంపుతూ లేదా ఫోన్ కాల్‌లు చేస్తూ తరచూ చికాకు కలిగిస్తుంటే కనుక మీరు వారి చాట్‌లను మ్యూట్ చేసే అవకాశం ఉంది. అయితే ఎలా మ్యూట్ చేయాలో తెలుసుకోవడానికి కింద ఉన్న పద్దతులను అనుసరించండి.

How to Mute Annoying Chats on Social Media Apps WhatsApp and Messenger

మెసెంజర్ చాట్‌లను మ్యూట్ చేసే విధానం

స్టెప్ 1: మెసెంజర్‌ని ఓపెన్ చేసి మీరు మ్యూట్ చేయాలనుకుంటున్న చాట్ కోసం సెర్చ్ చేయండి.

స్టెప్ 2: ఇప్పుడు ఆ నిర్దిష్ట చాట్‌పై ఎక్కువసేపు నొక్కిపెట్టి ఉంచండి. అక్కడ 'మ్యూట్ నోటిఫికేషన్స్' ఎంపిక కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి.

స్టెప్ 3: తర్వాత మీకు మ్యూట్ మెసేజ్ నోటిఫికేషన్స్, మ్యూట్ కాల్ నోటిఫికేషన్స్ మరియు మ్యూట్ మెసేజ్ మరియు కాల్ నోటిఫికేషన్‌లు వంటి ఎంపికలు కనిపిస్తాయి.

How to Mute Annoying Chats on Social Media Apps WhatsApp and Messenger

స్టెప్ 4: మెసెంజర్‌లో బాధించే మెసేజ్ లు మరియు కాల్‌లను నివారించడానికి మీరు వాటిలో దేనినైనా ఎంచుకోవచ్చు.

తెలియని వారి కోసం మెసెంజర్‌లో "మ్యూట్ మెసేజ్" అనే ఎంపిక ఉంది. మీరు ఏదైనా చాట్‌ని ఎక్కువసేపు నొక్కినప్పుడు మీరు ఈ ఎంపికను పొందవచ్చు. మీరు ఈ ఎంపికను ఎంచుకుంటే కనుక మీకు ఎలాంటి నోటిఫికేషన్‌లు రావు మరియు వారు పంపిన మెసేజ్లు మీకు బట్వాడా చేయబడవు. మీరు నిర్దిష్ట చాట్‌ని ఓపెన్ చేసి ఆ వ్యక్తికి ఏదైనా మెసేజ్ ని పంపితే మాత్రమే మీరు గతంలో పంపిన మెసేజ్లను చూడగలరు.

వాట్సాప్ చాట్‌లను ఎలా మ్యూట్ చేయాలి

మ్యూట్ వాట్సాప్ చాట్ ప్రక్రియ మెసెంజర్ మాదిరిగానే ఉంటుంది. WhatsAppలో మ్యూట్ చేయడానికి కింద్ ఉన్న ఈ దశలను అనుసరించండి

How to Mute Annoying Chats on Social Media Apps WhatsApp and Messenger

స్టెప్ 1: మీ వాట్సాప్ ని ఓపెన్ చేసి మీరు మ్యూట్ చేయాలనుకుంటున్న చాట్ కోసం వెతకండి.

స్టెప్ 2: ఇప్పుడు చాట్‌పై ఎక్కువసేపు నొక్కండి. తరువాత మీరు డిలీట్, మ్యూట్ వంటి ఎంపికలను చూడవచ్చు.

స్టెప్ 3: తరువాత మ్యూట్ ఎంపిక మీద నొక్కండి. ఇందులో మీకు 8 గంటలు, 1 వారం మరియు ఎల్లప్పుడూ వంటి మూడు ఎంపికలు కనిపిస్తాయి. మీరు ఎల్లప్పుడూ ఎంపికను ఎంచుకుంటే కనుక చాట్ శాశ్వతంగా మ్యూట్ చేయబడుతుంది. మిగిలిన రెండు ఎంపికలను ఎంచుకుంటే నిర్దిష్ట సమయం తర్వాత చాట్ స్వయంచాలకంగా అన్‌మ్యూట్ చేయబడుతుంది.

మెసెంజర్ మరియు వాట్సాప్ కాకుండా ఇంస్టాగ్రామ్ మరియు టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కూడా మెసేజ్ లతో విసిగించే వారిని నివారించడానికి 'మ్యూట్ మెసేజ్‌లు మరియు కాల్స్' ఎంపికను అందిస్తాయి. ఇన్‌స్టాగ్రామ్ మరియు టెలిగ్రామ్‌లో మ్యూట్ చాట్‌ల ప్రక్రియ మెసెంజర్ మరియు వాట్సాప్‌ల మాదిరిగానే ఉంటుంది.

Best Mobiles in India

English summary
How to Mute Annoying Chats on Social Media Apps WhatsApp and Messenger

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X