NPS అకౌంట్ అంటే ఏంటీ,ఆన్‌లైన్‌లో ఎలా ఓపెన్ చేయాలి

జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) ఇటీవలి కాలంలో బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇందులో ఇన్వెస్ట్‌ చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.

|

జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) ఇటీవలి కాలంలో బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇందులో ఇన్వెస్ట్‌ చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. పెన్షన్‌ ఫండ్‌ అండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) దీని నిర్వహణ చూస్తోంది. ఎన్‌పీఎస్ చందాదారులు ఆన్‌లైన్ మోడ్ కోసం ఈఎన్‌పీఎస్ పోర్ట‌ల్ ద్వారానే చేసే వీలుంది. 2004లో ప్రభుత్వ ఉద్యోగుల కోసమే ప్రారంభమైన ఎన్‌పీఎస్‌, ఆ తర్వాతి 2009లో సాధారణ ప్రజలకూ అర్హత కల్పించడం జరిగింది. ప్రభుత్వరంగంలోని వారు ఈ పథకంలో చేరడం తప్పనిసరి. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నవారు, స్వయం ఉపాధిలో ఉన్నవారు ఎన్‌పీఎస్‌లో చేరడం ద్వారా రిటైర్మెంట్‌ ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే ఈ ఖాతాను సులభంగా ప్రారంభించుకునే అవకాశం ఉంది. మరి ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం.

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నిజాలుఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నిజాలు

ఖాతా ప్రారంభించాలంటే ..

ఖాతా ప్రారంభించాలంటే ..

ఆధార్‌ లేదా పాన్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌, నెట్‌ బ్యాంకింగ్‌ లేదా డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు, 4-12కేబీ సైజుతో ఉన్న పాస్‌పోర్ట్‌ సైజు ఫొటో, వైట్‌ పేపర్‌పై సంతకం చేసి దాన్ని స్కాన్‌ చేసిన ఇమేజ్‌ ఫైల్‌ ముందుగా సిద్ధం చేసుకోవాలి.

ఎన్‌పీఎస్‌ ట్రస్ట్‌ వెబ్‌సైట్‌లోకి ..

ఎన్‌పీఎస్‌ ట్రస్ట్‌ వెబ్‌సైట్‌లోకి ..

ఇవన్నీ సిద్ధం చేసుకున్న తరువాత ఎన్‌పీఎస్‌ ట్రస్ట్‌ వెబ్‌సైట్‌లోకి https://enps.nsdl.com/eNPS/NationalPensionSystem.html లాగిన్‌ అవ్వాలి. ఇక్కడ కుడిచేతి వైపు కనిపించే ఆప్షన్లలో రిజిస్ట్రేషన్‌ను క్లిక్‌ చేసి, ఆ తర్వాత వచ్చే ఆప్షన్లలో ఇండివిడ్యువల్‌ ఎంచుకోవాలి.

రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు..

రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు..

ఆధార్‌ లేదా పాన్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి. దాంతో మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ జారీ అవుతుంది.

టైర్‌ 1, టైర్‌ 2
 

టైర్‌ 1, టైర్‌ 2

ఏ తరఖా అకౌంట్‌ అన్నది ఎంచుకోవాలి. టైర్‌ 1, టైర్‌ 2 అని ఉంటాయి. టైర్‌ 1 అకౌంట్‌ అయితే ఉపసంహరణకు అవకాశం లేనిది. టైర్‌ 2 అయితే ఉపసంహరణకు వీలుండే ఖాతా.

పాన్‌ ఎంచుకుంటే..

పాన్‌ ఎంచుకుంటే..

ఆధార్‌ ఎంపిక చేసుకుని నంబర్‌ ఇస్తే మొబైల్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేస్తే సరిపోతుంది. అదే పాన్‌ ఎంచుకుంటే మాత్రం మీ వివరాలను మీ బ్యాంకు ధ్రువీకరిస్తుంది. ఇందుకు బ్యాంకు రూ.125 చార్జీని వసూలు చేస్తుంది.

దరఖాస్తు ఫారంలోకి..

దరఖాస్తు ఫారంలోకి..

ఆధార్‌ను ఎంచుకుంటే చాలా వరకు మీ వ్యక్తిగత వివరాలు దరఖాస్తు ఫారంలోకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. వాటిని ఒకసారి సరిచూసుకుని సబ్‌మిట్‌ చేసినట్టయితే అకనాలెడ్జ్‌ నంబర్‌ వస్తుంది.

 

ఇన్వెస్ట్‌ చేసే ఆప్షన్‌ ఎంచుకుంటే..

ఇన్వెస్ట్‌ చేసే ఆప్షన్‌ ఎంచుకుంటే..

తర్వాత పెన్షన్‌ ఫండ్‌ మేనేజర్‌ను ఎంచుకోవాలి. ఎనిమిది ఫండ్‌ సంస్థల్లో ఏదో ఒకదానిని ఎంచుకోవచ్చు. వాటి పనితీరు ఆధారంగా ఎంచుకోవడం మంచిది. అలాగే, పెట్టుబడులను మీ వయసు ఆధారంగా ఈక్విటీలు, ఇతర విభాగాల్లో ఇన్వెస్ట్‌ చేసే ఆప్షన్‌ ఎంచుకుంటే ఎన్‌పీఎస్‌ దాన్ని సెట్‌ చేసేస్తుంది. ఒకవేళ యాక్టివ్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే మాత్రం ఏ విభాగానికి ఎంత కేటాయించాలన్నది మీరే చెప్పాల్సి ఉంటుంది.

 ఫొటోను అప్‌లోడ్‌ చేసి..

ఫొటోను అప్‌లోడ్‌ చేసి..

నామినీ వివరాలు నమోదు చేయాలి. మీ ఫొటోను అప్‌లోడ్‌ చేసి, సిగ్నేచర్‌ స్కాన్‌ ఇమేజ్‌ను కూడా అప్‌లోడ్‌ చేయాలి. ఒకవేళ ఆధార్‌ ఎంచుకుంటే మీ ఫొటో అప్‌లోడ్‌ చేయక్కర్లేదు. ఆధార్‌తోపాటు వచ్చేస్తుంది. కేవలం సిగ్నేచర్‌ ఇమేజ్‌ అప్‌లోడ్‌ చేస్తే చాలు.

కనీసం రూ.500 చందా..

కనీసం రూ.500 చందా..

తర్వాత దశలో టైర్‌ 1 ఖాతా అయితే కనీసం రూ.500 చందాను, టైర్‌ 2 అయితే కనీసం రూ.1,000ను చెల్లించాలి. నెట్‌ బ్యాంకింగ్‌, క్రెడిట్‌ కార్డు, డెబిట్‌కార్డు వీటిలో ఏదో ఒకదానిని వినియోగించి చెల్లింపులు చేయాలి. అనంతరం పర్మినెంట్‌ రిటైర్మెంట్‌ అకౌంట్‌ నంబర్‌ (ప్రాన్‌) జారీ అవుతుంది.

 90 రోజుల్లోపు ..

90 రోజుల్లోపు ..

ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రింట్‌ తీసుకోవాలి. దానిపై ఫొటో అంటించి, సంతకం చేసి 90 రోజుల్లోపు సీఆర్‌ఏ కార్యాలయానికి పంపించాలి. దీంతో మీపని పూర్తయిపోతుంది.

Best Mobiles in India

English summary
How to open an NPS account online more news at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X