ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌లను ల్యాపీలో, పీసీలో ఓపెన్ చేయడం ఎలా ?
ఇన్‌స్టాగ్రామ్.. ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా వాడుతున్న సోషల్ మీడియా యాప్. ఫేస్‌బుక్ మరుగునపడిన తర్వాత ఇన్‌స్టాకు యూజర్లు విపరీతంగా పెరిగిపోయారు. ఇది వాట్సప్ కు ధీటుగా మార్కెట్లోకి దూసుకుపోతోంది. ఇందులో వీడియోలు, ఫోటోలు, మెసేజ్ లు, అలాగే లోకేషన్ షేరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే యూజర్లకు ఇది ఓ నిరాశను కూడా మిగిల్చింది. అది ఏంటంటే ఇది కేవలం మొబైల్ మాప్ మాత్రమే, పీసీలో కాని ల్యాపీలో కాని దీన్ని ఉపయోగించలేరు. అయితే వెబ్ పేజీ ఉన్నా అందులో మీరు పోస్టులను చూడటం వాటికి కామెంట్ లేదా లైక్ ఇవ్వడం మాత్రమే చేయాల్సి ఉంటుంది. మీరు పోస్టులకు రిప్లయి లేదా మెసేజ్ లు ఇవ్వలేరు అయితే ఇలా చేస్తే మీరు పీసీ, ల్యాపీల ద్వారా కూడా అవి ఓపెన్ చేయవచ్చు.

ముందుగా మీరు విండోస్ 10 నుంచి ఇన్‌స్టాగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. విండోస్ స్టోర్ రైట్ కార్నర్ లో ఉన్న సెర్చ్ బటన్ దగ్గర Instagram అని టైప్ చేయండి. అది ఓపెన్ అవుతుంది. దాన్ని వెంటనే ఇన్
స్టాల్ చేయండి. తరువాత మీరు మీ మొబైల్ నంబరుతో కాని ఈమెయిల్ ఐడీతో కాని లాగిన్ అవ్వండి. లేకుంటే మీ ఫేస్ బుక్ ద్వారా కూడా లాగిన్ కావచ్చు.

డెరక్ట్ మెసేజ్ లను చెక్ చేయండి. ఆ మెసేజ్ రైట్ కార్నర్ దగ్గర కనిపించే దాన్ని క్లిక్ చేయండి. అక్కడ మీకు మెసేజ్ లకు సంబంధించిన ఆప్సన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి చదవడం కాని లేకుంటే రిప్లయి ఇవ్వడం కాని చేయవచ్చు. మీరు ఈ ప్రాసెస్ ను కొత్తగా అప్ డేట్ అయిన యాప్లో మాత్రమే చేయాలి. కాబట్టి మీరు గూగుల్ యాప్ స్టోర్ నుండి good Android emulator సహాయంతో దాన్ని ఇన్ స్టాల్ చేసుకోండి.

ఇక ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ తన వినియోగదారులకు షాక్ ఇవ్వనుంది. ఎప్పటినుంచో పోస్టులకు లైక్స్ కనిపించకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంస్థ.. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే ప్రతీ వీడియో, ఫోటోకు వచ్చే లైక్ ఆప్షన్స్‌లో పలు మార్పులు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఆ లైకులు కేవలం పెట్టిన వ్యక్తికి మాత్రమే కనిపిస్తాయని.. ఫాలోవర్స్, బ్రౌజ్ చేసే ఇతర వ్యక్తులకు లైకులు కనిపించకుండా ఉండేలా సరికొత్త ఫీచర్‌ను తీసుకురానున్నారు. ఈ విధానాన్ని అమెరికాలో ప్రారంభించనుండగా.. త్వరలోనే ఇండియాలో కూడా ప్రవేశపెట్టనున్నారు.

అయితే ఈ ఆప్షన్‌ను ఇండియాలో తీసుకొస్తే.. కొంతమేరకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. భారత్‌లో లైకుల ద్వారానే బిజినెస్ జరుగుతుందని.. ఏదైనా కంపెనీ తన బ్రాండ్‌ను ప్రమోట్ చేయాలంటే.. లైకులే కీలకపాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు. అటు టిక్ టాక్ వంటి యాప్‌లు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించడంతో.. ఇన్‌స్టా లైక్స్ ఆప్షన్‌లో మార్పులు తీసుకురావడం ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications








