ఆన్‌లైన్‌లో ఉచిత బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయడం ఎలా, అదీ జీరో బ్యాలెన్స్‌తో, మీకోసం పూర్తి వివరాలు

|

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ బ్యాంకు అకౌంట్ అనేది కామన్ అయిపోయింది. ఒక్కొక్కరికీ రెండు మూడు బ్యాంకుల్లో అకౌంట్లు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు చాలా బ్యాంకులు మినిమం బ్యాలన్స్ ఉండాలని లేకుంటే ఛార్జీలు విధిస్తామని చెబుతున్నాయి. దీంతో కస్టమర్లు బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలంటే భయపడిపోతున్నారు. జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఏదైనా ఉంటే దాన్ని ఓపెన్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు కూడా సరికొత్తగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు జీరో బ్యాలన్స్ అకౌంట్లను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీరో బ్యాంకు అకౌంట్లను అందిస్తున్న బ్యాంకులు, వాటిని ఆన్ లైన్ లోనే ఎలా ఓపెన్ చేయాలి అనేదానిపై మీకు కొన్ని రకాల గైడెన్స్ ఇస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

మే నెలలో అదిరే ఫీచర్లతో రానున్న కూల్ స్మార్ట్‌ఫోన్లు,సెలక్షన్ మీదేమే నెలలో అదిరే ఫీచర్లతో రానున్న కూల్ స్మార్ట్‌ఫోన్లు,సెలక్షన్ మీదే

యాక్సిస్ బ్యాంకు

యాక్సిస్ బ్యాంకు

1. మీరు ముందుగా Axis Bank Asap Account Register pageని ఓపెన్ చేయాలి.
2. అక్కడ మీకు Get An Axis Asap Account అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి.
3. ఆ తర్వాత మీరు మీ మొబైల్ నంబర్, ఆధార్, పాన్ నంబర్ ఎంటర్ చేయాలి.
4. ఎంటర్ చేసిన తర్వాత Agree with Terms క్లిక్ చేసిన Next Button మీద క్లిక్ చేయాలి.
5. తరువాత సిటీని సెలక్ట్ చేసుకోండి, మీ ప్రాంతంలో యాక్సిస్ బ్యాంకు లేకుంటే దగ్గర్లో ఉన్న యాక్సిస్ బ్యాంకు సిటీను సెలక్ట్ చేసుకోండి.
6. ఆ తర్వాత మీ ఆధార్ నంబర్ తో లింకయిన మొబైల్ నంబరుకు ఓటీపి వస్తుంది. అది ఎంటర్ చేసి మీ ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేసుకోవాలి.
7. మీ అకౌంట్ ఓపెన్ అయినట్లే. మీరు మీ అకౌంట్ నంబర్ Ifsc Code , Swift Code , Transactions Details వంటి వివరాలను యాప్ లో చెక్ చేసుకోవచ్చు. Physical Debit Card కూడా ఆర్డర్ చేయవచ్చు.

కొటాక్ మహీంద్రా
 

కొటాక్ మహీంద్రా

1. Kotak 811 Appను ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.
2. Get start Nowని క్లిక్ చేయాలి.
3. ఆ తర్వాత మీరు మీ మొబైల్ నంబర్, ఆధార్, పాన్ నంబర్ ఎంటర్ చేయాలి.
4. ఎంటర్ చేసిన తర్వాత Agree with Terms క్లిక్ చేసిన Next Button మీద క్లిక్ చేయాలి.
5. మీ అకౌంట్ ఓపెన్ అయినట్లే. మీరు మీ అకౌంట్ నంబర్ Ifsc Code , Swift Code , Transactions Details వంటి వివరాలను యాప్ లో చెక్ చేసుకోవచ్చు. Physical Debit Card కూడా ఆర్డర్ చేయవచ్చు. ఇబ్బంది ఎదురైతే బ్యాంకుకు వెళ్లి పరిష్కరించుకోవచ్చు.

Aditya Birla Payments Bank

Aditya Birla Payments Bank

1. మీ మొబైల్ బ్రౌజర్ నుంచి ఆదిత్యా బిర్లా అకౌంట్ పేజీని ఓపెన్ చేయండి.
2. అక్కడ కనిపించే న్యూ అకౌంట్ క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి.
3. ఆ తర్వాత మీరు మీ పుట్టిన తేదీ మరికొన్ని వివరాలను ఎంటర్ చేయాలి.
4. అవి ఎంటర్ చేసిన తర్వాత మీకు అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ మొబైల్ నంబరే అకౌంట్ నంబర్ గా ఉంటుంది. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవాలి.

SBI కూడా..

SBI కూడా..

ఇవే కాక ఇంకా మరికొన్ని బ్యాంకులు ఆన్ లైన్ ద్వారా ఉచిత బ్యాంకు అకౌంట్లను ఓపెన్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఈ మధ్య SBI కూడా ఇన్ స్టంట్ అకౌంట్ పేరుతో జీరో బ్యాలన్స్ సేవలను అందిస్తోంది. దాన్ని ఎలా ఓపెన్ చేయాలి, అసలు ప్రాసెస్ ఏంటీ అనేదానిపై మీకు పూర్తి వివరాలు కింద స్టోరీలో పొందుపరచడం జరిగింది. కింద లింక్ మీద క్లిక్ చేసి పొందగలరు.

SBI కస్టమర్లకు బంపరాఫర్, ఇకపై జీరో అకౌంట్ సేవలు, ప్రాసెస్ ఇదే !SBI కస్టమర్లకు బంపరాఫర్, ఇకపై జీరో అకౌంట్ సేవలు, ప్రాసెస్ ఇదే !

Best Mobiles in India

English summary
Now you can Open Online Savings Account in Just 5 Minutes and Instantly you can Receive or Send Money. More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X