SBI కస్టమర్లకు బంపరాఫర్, ఇకపై జీరో అకౌంట్ సేవలు, ప్రాసెస్ ఇదే !

|

దేశీయ బ్యాంకింగ్ రంగంలో టాప్ లో దూసుకుపోతున్న ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ తన కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. 2018 ఆగస్టు వరకు ఎలాంటి కనీస మొత్తం(మినిమమ్‌ బ్యాలెన్స్‌) అవసరం లేకుండా అకౌంట్‌ ప్రారంభించుకునే సౌకర్యాన్ని అందిస్తున్నట్టు State Bank of India తెలిపింది. సేవింగ్స్‌ అకౌంట్లలో ఎలాంటి మినిమమ్‌ బ్యాలెన్స్‌ అవసరం లేదనుకునే వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపింది. వినియోగదారులకు ఈ తాజా ఆఫర్‌ గొప్ప అవకాశమని పేర్కొంది.

 

SBI YONO యాప్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండిSBI YONO యాప్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి

ఇంట్లోనే కూర్చుని ఎస్‌బీఐ ఇన్‌స్టా సేవింగ్స్‌ అకౌంట్‌ ఓపెన్

ఇంట్లోనే కూర్చుని ఎస్‌బీఐ ఇన్‌స్టా సేవింగ్స్‌ అకౌంట్‌ ఓపెన్

ఇన్‌స్టా సేవింగ్స్‌ అకౌంట్‌ పేరుతో ఈ అకౌంట్‌ను తెరుచుకోవాల్సి ఉంటుంది. కాగా ఈ అకౌంట్‌ను ప్రారంభించడానికి బ్యాంకుకు కూడా వెళ్లాల్సినసరం లేదు. ఇంట్లోనే కూర్చుని ఎస్‌బీఐ ఇన్‌స్టా సేవింగ్స్‌ అకౌంట్‌ను ప్రారంభించుకోవచ్చని బ్యాంకు తెలిపింది.

step 1

step 1

ముందుగా మీరు మీ మొబైల్ నుండి గూగుల్ ప్లే స్టోర్ లోనికి వెళ్లి SBI YONO APPని డౌన్లోడ్ చేసుకోవాలి. అది డౌన్లోడ్ అయిన తరువాత మీరు దాన్ని ఇన్ స్టాల్ చేయాలి. యాప్ డౌన్ లోడ్ కావాలనుకున్న వారు ఈ లింక్ మీద క్లిక్ చేసి పొందవచ్చు.
https://play.google.com/store/apps/details?id=com.sbi.lotusintouch&hl=en

step 2
 

step 2

దాన్ని ఓపెన్ చేయగానే అక్కడ మీకు ఫైనాన్సియల్ ప్రొడక్ట్స్, షాపింగ్ డీల్స్, ఓపెన్ ఏ న్యూ డిజిటల్ అకౌంట్ అని మూడు రకాల ఆప్సన్లు కనిపిస్తాయి. వీటిలో మీరు చివరిదాన్ని సెలక్ట్ చేసుకోవాలి.

step 3

step 3

దాన్ని క్లిక్ చేస్తే మీకు మళ్లీ రెండు రకాల ఆప్సన్లు కనిపిస్తాయి. అవి ఇంటర్నెట్ బ్యాకింగ్, అకౌంట్ డిటెయిల్స్. మీరు దేనితో రిజిస్టర్ కావాలనుకుంటున్నారో దాన్ని సెలక్ట్ చేసుకుని రిజిస్టర్ కావాలి. ఇంటర్నెట్ బ్యాకింగ్ అయితే యూజర్ నేమ్ , పాస్వర్డ్ అలాగే అకౌంట్ వివరాలతో అయితే కార్డు నెంబర్ , పిన్ నంబర్ అడుగుతుంది.

step 4

step 4

మీరు మీకు అనుకూలమైనదానితో లాగిన్ కాగానే తర్వాత డిజిటల్ సేవింగ్ అకౌంట్, ఇన్‌స్టా సేవింగ్స్‌ అకౌంట్‌ పేరుతో అని రెండు ఆప్సన్లు కనిపిస్తాయి. వీటిలో మీరు జీరో అకౌంట్ బ్యాలన్స్ కోసం ఇన్‌స్టా సేవింగ్స్‌ అకౌంట్‌ మీద క్లిక్ చేసి మీ వ్యక్తి గత వివరాలను అందులో పొందుపరిస్తే మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది.

step 5

step 5

అక్కడ మీకు కనిపించే సూచనలను కరెక్ట్ గా ఫాలో కావాల్సి ఉంటుంది. ఆధార్ , పాన్ వివరాలు అలాగే ఇంకొన్ని వ్యక్తిగత వివరాలు కరెక్ట్ గా సమర్పించాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసిన తర్వాత మీ రిజిస్టర్ నంబరుకు ఓ ఓటీపి వస్తుంది. అది ఎంటర్ చేయగానే రెండు ఆప్సన్లు కనిపిస్తాయి. వాటిల్లో మీరు ఏదో ఒకటి సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది.

పేపర్‌లెస్‌ అకౌంట్‌

పేపర్‌లెస్‌ అకౌంట్‌

ఇన్‌స్టా సేవింగ్స్‌ అకౌంట్‌ కోసం కస్టమర్లు ఎలాంటి డాక్యుమెంట్లను సమర్పించాల్సివసరం లేదు. ఈ యాప్ పేపర్‌లెస్‌ అకౌంట్‌ ఓపెనింగ్‌' ను ఆఫర్‌ చేస్తోంది. కేవలం 5 నిమిషాల్లో మీ అకౌంట్‌ను యాక్టివేట్‌ చేసుకోవచ్చు.

రూపే డెబిట్‌ కార్డు..

రూపే డెబిట్‌ కార్డు..

కస్టమర్లు ఎవరైతే ఎస్‌బీఐ ఇన్‌స్టా సేవింగ్స్‌ అకౌంట్‌ను ప్రారంభిస్తారో ఆ వినియోగదారులు రూపే డెబిట్‌ కార్డు పొందుతారు. మొత్తం లక్ష రూపాయల వరకు ఈ అకౌంట్లో మెయిన్‌టైన్స్‌ చేసుకోవచ్చు.

2018 ఆగస్టు వరకు..

2018 ఆగస్టు వరకు..

ఏడాది లోపు ఎస్‌బీఐ ఇన్‌స్టా సేవింగ్స్‌ అకౌంట్‌ను రెగ్యులర్‌ సేవింగ్స్‌ అకౌంట్‌లోకి మార్చుకోవచ్చు. దీంతో పాటు 2018 ఆగస్టు వరకు ఈ అకౌంట్‌లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఉంచుకోవాల్సినవసరం లేదు. 18 ఏళ్ల పైబడిన భారతీయ పౌరులు ఎవరైనా ఈ అకౌంట్‌ను ప్రారంభించుకోవచ్చని State Bank of India తెలిపింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
State Bank of India Yono App: Open SBI Digital Account in Less Than Five Minutes More News at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X