MS Word డాక్యుమెంట్‌కు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్‌ను కల్పించటం ఎలా?

మనలో చాలా మంది యూజర్లు మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్స్ పై రెగ్యులర్‌గా వర్క్ చేస్తుంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ డాక్యుమెంట్స్ చాలా ముఖ్యమైన డేటాను క్యారీ చేస్తుంటాయి. పర్సనల్ కంప్యూటర్‌లలో ఉన్న

|

మనలో చాలా మంది యూజర్లు మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్స్ పై రెగ్యులర్‌గా వర్క్ చేస్తుంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ డాక్యుమెంట్స్ చాలా ముఖ్యమైన డేటాను క్యారీ చేస్తుంటాయి. పర్సనల్ కంప్యూటర్‌లలో ఉన్నంత వరకు సేఫ్‌గానే ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో మన MS-Word డాక్యుమెంట్‌లకు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్‌ను కల్పించుకోవటమనేది చాలా ఉత్తమమైన చర్య. ఆఫీస్ 365లో అందుబాటులో ఉన్న కొన్ని టూల్స్‌ను ఉపయోగించుకోవటం ద్వారా మీమీ Word డాక్యుమెంట్‌లను ఎన్‌క్రిప్ట్ చేసుకునే వీలుంటుంది. ఆ ప్రొసీజర్‌ను ఇప్పుడు తెలుసుకుందాం..

లాభాల్లో దుమ్మురేపిన రిలయన్స్, జియో కస్టమర్లకు పండగే !లాభాల్లో దుమ్మురేపిన రిలయన్స్, జియో కస్టమర్లకు పండగే !

‘Encrypt with Password’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసకోవాలి..

‘Encrypt with Password’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసకోవాలి..

ముందుగా పాస్‌వర్డ్ ప్రొటెక్షన్‌ కల్పించాలనుకుంటోన్న MS-Word డాక్యుమెంట్‌ను ఓపెన్ చేయాలి. ఆ తరువాత ‘File' ఆప్షన్ పై క్లిక్ చేసి అందులోని ‘Protect Document' ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ప్రొటెక్ట్ డాక్యుమెంట్ సెక్షన్‌లోకి వెళ్లిన తరువాత ‘Encrypt with Password' అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసకోవాలి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే ‘Encrypt Document' పేరుతో ఓ విండో ఒకటి ఓపెన్ అవుతుంది.

పాస్‌వర్డ్ క్రియేట్ అయిన తరువాత...

పాస్‌వర్డ్ క్రియేట్ అయిన తరువాత...

ఇక్కడ మీ డాక్యుమెంట్‌కు సంబంధించి ఓ పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవల్సి ఉంటుంది. పాస్‌వర్డ్ క్రియేట్ అయిన తరువాత ‘OK' బటన్ పై క్లిక్ చేసినట్లయితే ఆ పాస్‌వర్డ్ కన్ఫర్మ్ కాబడుతుంది. ఇప్పుడు డాక్యుమెంట్‌ను మరోసారి సేవ్ చేసి క్లోజ్ చేయండి. కొద్ది సెకన్ల తరువాత డాక్యుమెంట్‌ను తిరిగి ఓపెన్ చేసినట్లయితే లోపలికి వెళ్లేందుకు ‘Password'ను ఎంటర్ చేయమని అడుగుతుంది. పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి ఓకే బటన్ పై క్లిక్ చేసినట్లయితే డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది.

 

 

పాస్‌వర్డ్‌ను రిమూవ్ చేయాలంటే..?

పాస్‌వర్డ్‌ను రిమూవ్ చేయాలంటే..?

పాస్‌వర్డ్‌ ప్రొటెక్టెడ్ MS-Word డాక్యుమెంట్‌కు సంబంధించి పాస్‌వర్డ్‌ను రిమూవ్ చేయాలనుకుంటున్నట్లయితే ముందుగా సంబంధిత వర్డ్ డాక్యుమెంట్‌ను ఓపెన్ చేయాలి. ఆ తరువాత ‘File' ఆప్షన్ పై క్లిక్ చేసి అందులోని ‘Protect Document' ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ప్రొటెక్ట్ డాక్యుమెంట్ సెక్షన్‌లోని వెళ్లిన తరువాత ‘Encrypt with Password' అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసకోవాలి.

‘Encrypt with Password

‘Encrypt with Password

ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే ‘Encrypt with Password' పేరుతో ఓ విండో ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ విండోలో కనిపించే పాస్‌వర్డ్ డాట్స్‌ను డిలీట్ చేసి ఓకే బటన్ పై క్లిక్ చేసినట్లియతే పాస్‌వర్డ్‌ను రిమూవ్ కాబడతుంది. ఆ తరువాత నుంచి డాక్యుమెంట్‌ను నేరుగా ఓపెన్ చేసేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Microsoft Word utility is a commonly used one and many a time we feel the need for our documents to be secure. Sometimes, we wish only a select group to have access to the data in our Word document.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X