మీ యూట్యూబ్ బ్రౌజింగ్ హిస్టరీ ఎవరికి కనిపించకూడదా..?

|

ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ విభాగంలో అగ్రగామి సర్వీసుగా గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబ్ తన మార్కెట్ పరిధిని అంతకంతకూ విస్తరించుకుంటోంది. ఈ వెబ్‌సైట్‌లో లభ్యమవుతోన్న వీడియో కంటెంట్‌ను అన్ని రకాల ఏజ్‌గ్రూప్స్ వారు ఆస్వాదిస్తున్నారు. యూట్యూబ్‌లో మనం సెర్చ్ చేసే ప్రతి వీడియో తాలూకా రిజల్ట్స్ సెర్చ్ హిస్టరీలో సేవ్ కాబడతాయి. యూట్యూబ్‌లో వీడియో వీక్షించిన ప్రతిసారి ఆ వీడియో తాలూకా రిజల్ట్స్ వాచ్ హిస్టరీలో సేవ్ కాబడతాయి.

 

షియోమి ఫోన్ పేలుడు కలకలం, వరుసగా ఇది మూడోసారి..షియోమి ఫోన్ పేలుడు కలకలం, వరుసగా ఇది మూడోసారి..

ఎప్పటికప్పుడు ఆ హిస్టరీని క్లియర్ చేసుకుంటే సరిపోతుంది..

ఎప్పటికప్పుడు ఆ హిస్టరీని క్లియర్ చేసుకుంటే సరిపోతుంది..

యూట్యూబ్ వీడియోస్ తాలుకా హిస్టరీ సేవ్ అయి ఉండటం వల్ల మీ డివైస్ వేరొకరి చేతికి ఇచ్చినప్పుడు వారు మీ యూట్యూబ్ హిస్టరీని తెలసుకునే వీలుంటుంది. మీ యూట్యూబ్ బ్రౌజింగ్ కు సంబంధించిన హిస్టరీ ఎవ్వరి కంట పడకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఆ హిస్టరీని క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ప్రొసీజర్ ను ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

యూట్యూబ్ హిస్టరీని Pause చేయాలంటే..?

యూట్యూబ్ హిస్టరీని Pause చేయాలంటే..?

ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లోని యూట్యూబ్ అప్లికేషన్‌ను ఓపెన్ చేసి టాప్ రైట్ కార్నర్ లో కనిపించే అవతార్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు కొత్త మెనూ ఒకటి ఓపెన్ అవుతుంది. ఈ మెనూలో సెట్టింగ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే అనేక ఆప్షన్స్ స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతాయి. వాటిలో "History and Privacy" ఆప్షన్ ను సెలక్ట్ చేసుకుని "Pause watch history" ఆప్షన్ ను టర్నాఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆప్షన్ టర్నాఫ్ అయిన వెంటనే మీ యూట్యూబ్ హిస్టరీ పాస్ కాబడుతుంది. యూట్యూబ్ హిస్టరీని పాస్ చేయటం వల్ల మీ సెర్చ్ హిస్టరీ హిస్టరీలో సేవ్ అవ్వదు.

యూట్యూబ్ హిస్టరీని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలంటే..?
 

యూట్యూబ్ హిస్టరీని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలంటే..?

ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లోని యూట్యూబ్ అప్లికేషన్‌ను ఓపెన్ చేసి టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే అవతార్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు కొత్త మెనూ ఒకటి ఓపెన్ అవుతుంది. ఈ మెనూలో సెట్టింగ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే అనేక ఆప్షన్స్ స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతాయి. వాటిలో "History and Privacy" ఆప్షన్ ను సెలక్ట్ చేసుకుని "Clear watch history" టాప్ చేసినట్లయితే కన్ఫర్మేషన్ స్ర్కీన్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఈ స్ర్కీన్ పై కనిపించే "Clear watch history" ఆప్షన్ పై ప్రెస్ చేసినట్లయితే మీ యూట్యూబ్ బ్రౌజింగ్ తాలూకా మొత్తం హిస్టరీ క్లియర్ కాబడుతుంది.

 

 

యూట్యూబ్‌దే హవా..

యూట్యూబ్‌దే హవా..

మార్కెట్లోకి కొత్త‌కొత్త వీడియో స్ట్రీమింగ్ వెబ్‌సైట్‌‍లు పుట్టుకొస్తున్నప్పటికి యూట్యూబ్ హవాను ఏ మాత్రం తగ్గించలేకపోతున్నాయి. ప్రకటనల రూపంలో గూగుల్‌కు కాసలు వర్షం కురిపిస్తున్న యూట్యూబ్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో యూజర్లు ఉన్నారు. వీరిని మెప్పించేందుకు వేల సంఖ్యలో వీడియోలు ఇక్కడ జనరేట్ అవుతూనే ఉంటాయి.

కొత్త వెర్షన్ యాప్..

కొత్త వెర్షన్ యాప్..

పిల్లల కోసం ప్రత్యేకంగా యూట్యూబ్ కిడ్స్ పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. యూట్యూబ్ కిడ్స్‌గా పిలవబడతున్న ఈ యాప్‌ను కేవలం పిల్లలకు ఉపయోగపడే విధంగా డిజైన్ చేసింది. విద్య, విజ్ఞానం ఇంకా వినోదాలను అందించే వీడియోలను మాత్రమే యూట్యూబ్ ఈ వర్షన్‌లో అందుబాటులో ఉంచింది. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఈ యాప్‌లో ద్వారా వీడియోలను పిల్లలు ఎంత సేపు వీక్షంచాలో కూడా తల్లిదండ్రులు నిర్ధేశించవచ్చు.

Best Mobiles in India

English summary
Here is a step-by-step guide to help you pause and clear your YouTube history.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X