ట్రాఫిక్ చలానా ఫైన్ ను ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయడం ఎలా??
కరోనావైరస్ వ్యాప్తి కారణంగా అన్ని రకాల పేమెంట్ సేవలు ఆన్‌లైన్ ద్వారా చేయడానికి మార్పులను తీసుకువచ్చారు. అన్నిటి లాగానే ట్రాఫిక్ చలాన్లు కూడా ఆన్‌లైన్ ద్వారా చెల్లించడానికి మార్పులను తీసుకువచ్చారు. ఆంధ్ర మరియు తెలంగాణా ప్రాంతాలలో ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘనలకు పాల్పడిన వారికి అధికారులు చలానాలు పంపుతున్నారు. ఈ ట్రాఫిక్ చలానాలు అనేవి ఇప్పుడు మీ యొక్క వాహన నెంబర్లను దృష్టిలో ఉంచుకొని పంపుతూ ఉంటారు. ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘనలకు పాల్పడిన వారికి సైబర్ పోలీసులు ట్రాఫిక్ కెమెరాల ఆధారంగా మరియు పోలీసు అధికారులు ఇ-చలానాలను జారీ చేస్తారు. ప్రజలు ఈ చలాన్లను ఆన్‌లైన్‌లో చెల్లించే అవకాశం ఉంది. కింద ఉన్న ఈ దశలను అనుసరించడం ద్వారా ఆన్‌లైన్‌లో చలాన్‌ను చెల్లించవచ్చు.

ఆన్‌లైన్‌లో చలాన్‌ను తనిఖీ చేయడం మరియు పేమెంట్ చేసే పద్ధతులు
*** మీ స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ లేదా PCని ఉపయోగించి https://echallan.parivahan.gov.in/ ని ఓపెన్ చేయండి.
*** 'చెక్ చలాన్ స్టేటస్' పై క్లిక్ చేయండి.

*** మీ యొక్క లైసెన్స్ నంబర్, వాహన నెంబర్ లేదా చలాన్ నంబర్ ఉపయోగించి చలాన్ స్టేటస్ ను తనిఖీ చేయవచ్చు.
(ఒకవేళ మీరు వాహన నంబర్‌ను ఉపయోగించి శోధిస్తుంటే కనుక చివరి ఐదు అంకెల ఇంజిన్ నంబర్ లేదా చాసిస్ నంబర్‌ను సులభంగా ఉండేలా చూసుకోండి.)
*** ఇందులో ఏదైనా ఒక ఎంపికను ఎంచుకోని మీ యొక్క వివరాలను నమోదు చేయండి.
*** చలాన్ వివరాలు కనిపించిన తర్వాత పేమెంట్ బటన్ పై క్లిక్ చేయండి.

*** ఇది మిమ్మల్ని సంబంధిత రాష్ట్ర ఇ-చలాన్ చెల్లింపు వెబ్‌సైట్‌కు మళ్ళిస్తుంది. తరువాత 'నెక్స్ట్' ఎంపిక మీద క్లిక్ చేయండి.
*** పేమెంట్ పేజీలో 'ప్రాసెస్ విత్ నెట్-పేమెంట్' పై క్లిక్ చేయండి.
*** చలాన్ చెల్లించడానికి పేమెంట్ ను పూర్తి చేయండి.


Click it and Unblock the Notifications








