BSNL అన్ని రకాల బిల్లులను ఆన్‌లైన్ ద్వారా చెల్లించడం ఎలా??

|

ప్రభుత్వ ఆద్వర్యంలో పనిచేస్తున్న టెలికాం ఆపరేటర్ బిఎస్ఎన్ఎల్ మొదటి నుండి తన అభిమానులకు వివిధ రకాల సేవలను అందిస్తూ ప్రసిద్ది చెందింది. దేశంలోని అన్ని ప్రాంతాలలో ఇతర ప్రైవేట్ టెల్కోల మాదిరిగా 4G కనెక్టివిటీ లేకపోయినప్పటికీ బిఎస్ఎన్ఎల్ ఇప్పటికీ తన వినియోగదారులకు ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పెయిడ్ ప్లాన్ లను అందిస్తున్నది. అలాగే వీటితో పాటుగా వినియోగదారులు ఉపయోగించే ల్యాండ్‌లైన్ కనెక్షన్లను కూడా అద్భుతంగా అందిస్తున్నది.

బిఎస్ఎన్ఎల్ ఆన్‌లైన్ పేమెంట్స్

బిఎస్ఎన్ఎల్ ఆన్‌లైన్ పేమెంట్స్

ప్రపంచం మొత్తం ప్రస్తుతం సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందింది కాబట్టి మీరు మీ యొక్క బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పెయిడ్, ల్యాండ్‌లైన్ బిల్లులను ఆన్‌లైన్ పద్దతిలో కేవలం ఒక్క నిమిషంలో చేయవచ్చు. ఈ బిల్లు పేమెంట్ లను చేయాలనుకుంటే మీరు కొన్ని క్లిక్‌లలో మీ ఇంటి వద్ద నుండి సులభంగా చేయవచ్చు. ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ యొక్క అధికారిక వెబ్‌సైట్, బిఎస్ఎన్ఎల్ మొబైల్ యాప్ మరియు మూడవ పార్టీ ప్లాట్‌ఫారమ్‌లలో ఆన్‌లైన్ పేమెంట్స్ సులభంగా చేయవచ్చు. ఆన్‌లైన్ ద్వారా బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క బిల్లులను ఎలా చెల్లించాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

బిఎస్‌ఎన్‌ఎల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా బిల్లులను చెల్లించడం

బిఎస్‌ఎన్‌ఎల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా బిల్లులను చెల్లించడం

మీరు బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా బిల్లులను చెల్లించాలనుకుంటే క్రింద పేర్కొన్న దశలను అనుసరించండి.

** మొదట బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క అధికారిక వెబ్‌సైట్ https://www.portal2.bsnl.in/myportal/cfa.do ని ఓపెన్ చేయండి.

** ల్యాండ్‌లైన్ , ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పెయిడ్ నంబర్ వంటి అవసరమైన వివరాలను ఫిల్ చేసి "సబ్మిట్" ఎంపిక మీద నొక్కండి.

** కనిపించే వివరాలను మళ్ళి ఒకసారి తనిఖీ చేసిన తరువాత "పే" ఎంపిక మీద నొక్కండి.

** పేమెంట్ మోడ్ మరియు మీ పేమెంట్ గేట్‌వే ఎంపికను ఎంచుకోండి.

** మీరు ఎంచుకున్న పేమెంట్ గేట్‌వేలో బిల్లు మొత్తాన్ని ధృవీకరించండి తరువాత పేమెంట్ చేయండి.

** పేమెంట్ పూర్తి చేయడానికి మీ యొక్క మొబైల్ నంబర్‌కు OTP ను పొందుతారని గమనించండి.

 

MyBSNL యాప్ ద్వారా BSNL బిల్లులను చెల్లించడం

MyBSNL యాప్ ద్వారా BSNL బిల్లులను చెల్లించడం

MyBSNL యాప్ ద్వారా కూడా BSNL యొక్క అన్ని రకాల బిల్లులను చెల్లించవచ్చు. పెమెంట్స్ పూర్తి చేయడానికి క్రింది ఉన్న ఈ దశలను అనుసరించండి.


** మొదటగా మీ యొక్క మొబైల్‌లో MyBSNL యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి.

** MyBSNL యాప్ ను ఇంస్టాల్ చేసిన తరువాత మెనూకి వెళ్లి మీ యొక్క అకౌంట్ మీద క్లిక్ చేయండి.

** ఇక్కడ మీ యొక్క ల్యాండ్‌లైన్,ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పెయిడ్ నంబర్‌ను ఎంటర్ చేసిన తరువాత "సేవ్" ఎంపిక మీద నొక్కండి.

** తరువాత హోమ్‌పేజీకి వెళ్లి "బిల్ పే" ఎంపికను ఎంచుకోండి.

** బిల్లు వివరాలను ధృవీకరించి పేమెంట్ చేయడం కోసం మీకు నచ్చిన గేట్‌వే పద్ధతిని ఎంచుకోండి.

** వివరాలలో బిల్ మొత్తం మరియు మీ యొక్క నెంబర్ సరిచూసుకుని కన్ఫర్మ్ నొక్కండి.

** తరువాత మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు లభించే OTP ని ధృవీకరించి పేమెంట్ చేయండి.

మూడవ పార్టీ రీఛార్జ్ పోర్టల్స్ మరియు డిజిటల్ వాలెట్ల విషయానికి వస్తే బిఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ బిల్ పేమెంట్ ఎంపికకు నావిగేట్ చేయడానికి ఎంపికలు ఉంటాయి. తద్వారా మీరు బిల్లు మొత్తాన్ని ధృవీకరించవచ్చు మరియు చెల్లింపు చేయవచ్చు.

 

Best Mobiles in India

English summary
How to Pay BSNL Landline, Prepaid and Postpaid Bill Online in Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X