Google Tez యాప్ ద్వారా కరెంటు బిల్లులను చెల్లించటం ఎలా..?

వాటర్, ఎలక్ట్రసిటీ, మొబైల్, బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్, డీటీహెచ్ తదితర యుటిలిటీ బిల్స్‌ను తేజ్ (Tez) యాప్ ద్వరా నిశ్చింతగా చెల్లించవచ్చని గూగుల్ వెల్లడించింది.

|

వాటర్, ఎలక్ట్రసిటీ, మొబైల్, బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్, డీటీహెచ్ తదితర యుటిలిటీ బిల్స్‌ను తేజ్ (Tez) యాప్ ద్వరా నిశ్చింతగా చెల్లించవచ్చని గూగుల్ వెల్లడించింది. తమ డిజిటల్ పేమెంట్ అప్లికేషన్ డైరెక్ట్ పేకు అనుమతిస్తుందని, తద్వారా యూజర్లు నేరుగా తమ తమ బ్యాంక్ అకౌంట్ల నుంచే యుటిలిటీ బిల్లులను చెల్లించే వీలుంటుందని సంస్థ తెలిపింది. తేజ్ అప్లికేషన్‌లో యాడ్ చేసిన కొత్త ఫీచర్ల పై గూగుల్ స్పందిస్తూ ప్రస్తుతానికి 80 బిల్లర్స్ యాడ్ చేసామని త్వరలోనే మరింత మంది కొత్త బిల్లర్స్‌ను యాడ్ చేస్తామని గూగుల్ వెల్లడించింది.

హానర్ 9 లైట్‌లో దుమ్మురేపుతున్న రైడ్ ఫీచర్, బడ్జెట్ ధరకే సొంతంహానర్ 9 లైట్‌లో దుమ్మురేపుతున్న రైడ్ ఫీచర్, బడ్జెట్ ధరకే సొంతం

 గూగుల్ తేజ్ యాప్‌లో బిల్లర్‌ను యాడ్ చేయటం ఎలా..?

గూగుల్ తేజ్ యాప్‌లో బిల్లర్‌ను యాడ్ చేయటం ఎలా..?

ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో తేజ్ యాప్‌ను ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ అయిన తరువాత మెయిన్ స్ర్కీన్ పై ‘New' బటన్ కనిపిస్తుంది. ఆ బటన్ పై ట్యాప్ ఇవ్వండి. ఇప్పుడు కాంటాక్ట్స్‌తో కూడిన లిస్ట్, దాని పైన ఓ సెర్చ్ మెనూ కూడా ఓపెన్ అవుతుంది. ఆ సెర్చ్ బార్‌లో బిల్లర్ పేరును టైప్ చేసి మరో సారి టాప్ ఇవ్వండి. తదుపరి స్టెప్‌లో భాగంగా వారి అకౌంట్ నెంబర్‌ను లింక్ చేయవల్సి ఉంటుంది. తేజ్ యాప్‌లో బిల్లర్‌ను యాడ్ చేసే క్రమంలో వారి కస్టమర్ ఐడీ, అకౌంట్ నెంబర్ వంటి వివరాలు తప్పనిసరిగా అవసరమవుతాయి.

తేజ్ యాప్ ద్వారా బిల్స్ పే చేయటం ఎలా..?

తేజ్ యాప్ ద్వారా బిల్స్ పే చేయటం ఎలా..?

తేజ్ యాప్‌ను ఓపెన్ చేసి మెయిన్ స్ర్కీన్ పై కనిపించే 'New' బటన్ పై టాప్ చేసినట్లయితే కాంటాక్ట్స్ స్ట్‌తో కూడిన సెర్చ్ బార్ వస్తుంది. ఆ సెర్చ్ బార్‌లో మీరు యాడ్ చేసిన బిల్లర్‌ను సెలక్ట్ చేసుకుని పేమెంట్ చేస్తే సరిపోతుంది.

చెల్లించిన బిల్లుల వివరాలను తెలుసుకోవటం ఎలా..?

చెల్లించిన బిల్లుల వివరాలను తెలుసుకోవటం ఎలా..?

తేజ్ యాప్‌ను ఓపెన్ చేసి మెయిన్ స్ర్కీన్ పై కనిపించే All TRANSACTIONS ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మీరు నిర్వహించిన అన్ని చెల్లింపులకు సంబంధించిన వివరాలు వరసగా కనిపిస్తాయి.

గూగుల్ తేజ్ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ఎలా..?

గూగుల్ తేజ్ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ఎలా..?

ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి Google Tez యాప్‌ను, మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీరు యాపిల్ ఐఫోన్‌ను వినియోగిస్తున్నట్లయితే ఐఓఎస్ స్టోర్ నుంచి ఈ యాప్‌ను పొందవల్సి ఉంటుంది. Google Tez యాప్‌ మీ ఫోన్‌లో విజయవంతంగా ఇన్‌స్టాల్ అయిన తరవాత యాప్‌ను ఓపెన్ చేసి ముందుగా భాషను సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ ఆప్షన్‌ను కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. భాషను ఎంపిక చేసుకున్న తరువాత టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే Arrow మార్క్ పై టాప్ చేసినట్లయితే తరువాతి మెనూలోకి వెళతారు.

 స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..

స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..

ఈ మెనూలో మీ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయవల్సి ఉంటంది. (ముఖ్య గమనిక : మీరు ఎంటర్ చేసే మొబైల్ నెంబర్ ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయి ఉండాలి). తరువాతి స్టెప్‌లో భాగంగా Tez యాప్‌‌తో లింక్ చేయవల్సిన గూగుల్ అకౌంట్ తాలుకా వివరాలకు యాప్ అడుగుతుంది.మీ గూగుల్ అకౌంట్‌ను లింక్ చేసి యాప్ రిక్వెస్ట్‌లకు యాక్సెస్ ఇచ్చినట్లయితే OTP వెరిఫికేషన్ ప్రాసెస్ మొదలవుతుంది. OTP వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి అయిన తరువాత Google Tez యాప్‌ సెక్యూరిటీకి సంబంధించి డివైస్ లాక్ లేదా సపరేట్ గూగుల్ పిన్‌ను క్రియేట్ చేసుకోవల్సి ఉంటుంది. దీంతో యాప్‌కు సంబంధించిన ఇనీషియల్ సెటప్ ప్రాసెస్ పూర్తవుతుంది.

 

 

Best Mobiles in India

English summary
Google has announced that users can pay utility bills including water, electricity, mobile, broadband, landline, DTH and other utility bills using its payment app, Tez.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X