iPhone స్టోరేజ్ నుండి డేటా & సెట్టింగ్‌లను శాశ్వతంగా తొలగించడం ఎలా?

|

మీరు ఐఫోన్ ని ఉపయోగిస్తుంటే కనుక అందులోని ఏదైనా డేటాను తొలగించడం వలన మీ డేటా శాశ్వతంగా తొలగించబడదు. మీరు ఆపిల్ హ్యాండ్‌సెట్ నుండి డెలిట్ చేసినట్లు విశ్వసిస్తున్నప్పటికి ఐఫోన్ డేటా ఇప్పటికీ ఐఫోన్ స్టోరేజ్ లోనే ఉంటుంది. మీరు మీ డేటాను శాశ్వతంగా తొలగించారని నిర్ధారించుకోవడం ఎల్లప్పుడూ సురక్షితం. వ్యక్తిగత మరియు ఇతరత్రా కారణాలతో లేదా కొత్త వెర్షన్ కోసం మార్పిడి చేయడానికి లేదా ఎవరికైనా ఇవ్వడానికి ముందు మీ ఫోన్ స్టోరేజ్ నుండి మీ మొత్తం కంటెంట్ మరియు సెట్టింగ్‌లను శాశ్వతంగా తీసివేయడం సాధ్యమవుతుంది. మీ ఫోన్ నుండి పూర్తి డేటాను పూర్తిగా తొలగించడం పూర్తిగా ఉచితం అని నిర్ధారించుకోండి.

How to Permanently Delete Data and Settings‌ From iPhone Storage?

మీ మొత్తం డేటాను శాశ్వతంగా డెలిట్ చేయడానికి Appleకి రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది ఐఫోన్ నుండి మీ డేటాను తొలగించవచ్చు. అలాగే రెండవది మీ iPhone నుండి మొత్తం డేటా మరియు సెట్టింగ్‌లను తొలగించడానికి మీరు Mac లేదా Windows PCని ఉపయోగించవచ్చు. డేటాను శాశ్వతంగా ఎలా డెలీట్ చేయవచ్చో తెలుసుకోవడానికి కింద ఉన్న దశల వారీ మార్గదర్శినిని అనుసరించండి.

iPhone స్టోరేజ్ నుండి డేటా మరియు సెట్టింగ్‌లను శాశ్వతంగా తొలగించే విధానం

How to Permanently Delete Data and Settings‌ From iPhone Storage?

మీ iPhone లేదా Mac లేదా Windows PCని ఉపయోగించి మీరు iPhone నుండి మీ డేటాను శాశ్వతంగా ఎలా చెరిపివేయవచ్చో ఇక్కడ దశల వారీ గైడ్ ఉంది.

** సెట్టింగ్‌లు > జనరల్ > ట్రాన్సఫర్ లేదా రీసెట్ ఐఫోన్‌ విభాగంకు వెళ్లండి

** మొత్తం కంటెంట్ మరియు సెట్టింగ్‌లను తొలగించు ఎంపిక మీద నొక్కండి.

Mac లేదా Windows PCని ఉపయోగించి iPhone స్టోరేజ్ డేటాను శాశ్వతంగా తొలగించే విధానం

How to Permanently Delete Data and Settings‌ From iPhone Storage?

మీ ఐఫోన్ నుండి మీ డేటా మరియు సెట్టింగ్‌లను శాశ్వతంగా తొలగించడానికి Mac లేదా Windows PCని కూడా ఉపయోగించవచ్చు. మీరు ఐఫోన్‌లో సెట్టింగ్‌లను ఓపెన్ చేయలేకపోతే ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. Mac లేదా Windows PCని ఉపయోగించి iPhone స్టోరేజ్ నుండి డేటాను శాశ్వతంగా తొలగించడానికి ఈ దశలను అనుసరించండి:

** ఐఫోన్ మరియు మీ కంప్యూటర్‌ను కేబుల్‌తో కనెక్ట్ చేయండి.

** మీ Macలోని ఫైండర్ సైడ్‌బార్‌లో మీ ఐఫోన్‌ను ఎంచుకుని విండో ఎగువన ఉన్న జనరల్‌ని క్లిక్ చేసి ఆపై రిస్టోర్ ఐఫోన్‌ ఎంపిక మీద క్లిక్ చేయండి.

** Windows PCలోని iTunes యాప్‌లో: iTunes విండో ఎడమవైపు ఎగువన ఉన్న iPhone బటన్‌ను క్లిక్ చేసి, సమ్మరీ మీద క్లిక్ చేసి, ఆపై రిస్టోర్ ఐఫోన్‌ ఎంపిక మీద క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
How to Permanently Delete Data and Settings‌ From iPhone Storage?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X