PUBG మొబైల్ గేమ్‌ను ఇప్పుడు మీ ల్యాప్‌టాప్‌లలో కూడా ఆడొచ్చు..

మొబైల్ గేమింగ్ విభాగంలోకి పెను సంచలనంలా దూసుకొచ్చిన 'ప్లేయర్ అన్‌నౌన్స్ బ్యాటిల్ గ్రౌండ్స్’ (పీయూబీజీ), ఇప్పుడు ప్రపంచమంతా వైరల్ అవుతోంది.

|

మొబైల్ గేమింగ్ విభాగంలోకి పెను సంచలనంలా దూసుకొచ్చిన 'ప్లేయర్ అన్‌నౌన్స్ బ్యాటిల్ గ్రౌండ్స్’ (పీయూబీజీ), ఇప్పుడు ప్రపంచమంతా వైరల్ అవుతోంది. ఈ రియల్ టైమ్ మల్టీప్లేయర్ షూటర్ గేమ్‌ను స్మార్ట్‌ఫోన్ యూజర్లు అమితంగా ఇష్టపడుతున్నారు. 2017లో లాంచ్ అయిన ఈ గేమ్‌ను పీయూబీజీ కార్పొరేషన్ అలానే చైనా టెన్సెంట్ గేమ్స్ సంయుక్తంగా అభివృద్థి చేసాయి.

200 కాపురాలను కూల్చిన వీడియో గేమ్, ఎంతలా అంటే ?200 కాపురాలను కూల్చిన వీడియో గేమ్, ఎంతలా అంటే ?

కొత్త ఫీచర్లతో పాటు కంట్రోల్స్‌..

కొత్త ఫీచర్లతో పాటు కంట్రోల్స్‌..

ప్లేయర్ అన్‌నౌన్ గోస్ట్ హోటల్ బ్యాటిల్ రాయల్ గేమ్ ఆధారంగా అభివృద్థి చేయబడిన ఈ గేమ్‌లో కొత్త ఫీచర్లతో పాటు కంట్రోల్స్‌ను ఇంక్లూడ్ చేసింది. ఈ రసవత్తర గేమ్‌లో పారాచ్యూట్ ల్యాండింగ్, ఆర్మర్స్ ఇంకా వెపన్స్‌ను కలెక్ట్ చేయటం, ఎనిమీల వ్యూహాల నుంచి తప్పించుకోవటం, ఎదురుదాడి చేయటం వంటి వ్యూహ ప్రతివ్యూహాలు ఈ గేమ్‌లో అందుబాటులో ఉంటాయి. తాజాగా ఈ గేమ్‌కు సంబంధించి కొత్త వెర్షన్‌ను టెన్సెంట్ గేమ్స్ లాంచ్ చేసింది.

అఫీషియల్ పీయూబీ ఎమ్యులేటర్‌...

అఫీషియల్ పీయూబీ ఎమ్యులేటర్‌...

ఈ గేమ్‌లో అనేక అడ్వెంచరస్ టాస్క్స్ అందుబాటులో ఉండటంతో చాలా మంది యూజర్లు బ్లుస్టాక్, నాక్స్ ప్లేయర్ వంటి థర్డ్ పార్టీ ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్స్‌ను ఉపయోగించుకుని ఈ గేమ్‌ను తమతమ పీసీల్లో ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. పీసీలో గేమ్ ఆడుతున్నపుడు కీబోర్డ్ ఇంకా మౌస్ ద్వారా గేమ్‌ప్లేను ఎన్‌హాన్స్ చేసుకునే వీలుంటుంది. థర్డ్ పార్టీ ఎమ్యులేటర్స్ ద్వారా గేమ్ ఆడుతున్నపుడు పలు ఇబ్బందులు తలెత్తుతోన్న నేపథ్యంలో టెన్సెంట్ గేమ్స్ Tencent Gaming buddy పేరుతో అఫీషియల్ పీయూబీ ఎమ్యులేటర్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది.

AOW ఇంజిన్ ఆధారంగా..
 

AOW ఇంజిన్ ఆధారంగా..

AOW ఇంజిన్ ఆధారంగా స్పందించగలగే ఈ పీయూబీ ఎమ్యులేటర్ పీయూబీజీ మొబైల్ వెర్షన్‌ను పీసీలో ఆప్టిమైజ్ చేస్తుంది. ఈ ఎమ్యులేటర్ పీసీకి సంబంధించిన కీబోర్డ్ అలానే మౌస్‌లను ఆటోమెటిక్‌గా డిటెక్ట్ చేయటంతో పాటు పీసీలో రిసోర్సులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ స్మూత్ ఇంకా లాగ్-ఫ్రీ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రొవైడ్ చేయగలుగుతుందట.

 

 

గేమింగ్ బడ్డీ ఎమ్యులేటర్‌ను ఏ విధంగా ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే?

గేమింగ్ బడ్డీ ఎమ్యులేటర్‌ను ఏ విధంగా ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే?

ముందుగా మీ కంప్యూటర్‌‌లో Tencent Gaming buddy ఎమ్యులేటర్‌కు సంబంధించిన అఫీషియల్ పేజీని ఈ (https://syzs.qq.com/en/) లింకు ద్వారా సపరేట్ ట్యాబ్‌లో ఓపెన్ చేయండి. ఇప్పుడు ఓపెన్ అయ్యే పేజీలో 'Download' బటన్ పై క్లిక్ చేసినట్లయితే టెన్సెంట్ గేమింగ్ బడ్డీ ఎమ్యులేటర్‌ మీ పీసీలోకి విజయవంతండా డౌన్‌లోడ్ కాబడుతుంది. డౌన్‌లోడ్ అయిన ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత 'Start' బటన్ పై హిట్ చేసినట్లయితే గేమింగ్ బడ్డీ ఆటోమెటిక్‌గా పీయూబీజీ గేమ్‌ను పీసీలోకి డౌన్‌లోడ్ చేసేస్తుంది. గేమ్ డౌన్‌లోడ్ అయిన తరువాత ప్లే బటన్ పై క్లిక్ చేసి గేమ్‌ను ఆస్వాదించవచ్చు.

 

 

Best Mobiles in India

English summary
How to play PUBG mobile on your PC or Laptop, the official way.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X