మీ మ్యూజిక్ ప్లేయర్‌లో పాటతో పాటు లిరిక్స్ కూడా కనిపించాలా..?
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం అనేక మ్యూజిక్ ప్లేయర్ యాప్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే, వీటిని ఎంపిక చేసుకునే విషయంలో చాలా మంది యూజర్లు కన్ఫ్యూజన్‌కు గురువుతున్నట్లు తెలుస్తోంది.
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం అనేక మ్యూజిక్ ప్లేయర్ యాప్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే, వీటిని ఎంపిక చేసుకునే విషయంలో చాలా మంది యూజర్లు కన్ఫ్యూజన్‌కు గురువుతున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ ప్లేయర్‌లో ఏదైనా పాట ప్లే అవుతున్నపుడు ఆ పాటకు సంబంధించిన లిరిక్స్ కూడా స్ర్కీన్ పై డిస్‌ప్లే అయితే చాలా బాగుంటుంది. అయితే, ఇప్పటి వరకు అటువుంటి యాప్స్ ఏమీ నాన్-రూటెడ్ ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం అఫీషియల్‌గా అందుబాటులోకి రాలేదు. అయితే కొన్ని థర్డ్ పార్టీ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా ఈ విధమైన సౌకర్యాన్ని ఆండ్రాయిడ్ యూజర్లు ఆస్వాదించవచ్చు. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మ్యూజిక్స్‌మ్యాచ్ (Musixmatch)
ఈ యాప్‌లో ప్లే అయ్యే ప్రతి పాటకి లిరక్ అనేది అందుబాటులో ఉంటుంది. వేల పాటలకు సంబంధించిన లిరిక్స్ ఈ మ్యూజిక్ ప్లేయర్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ యాప్ మీ ఫోన్‌లో వర్క్ అయ్యేందుకు ఎటువంటి రూట్ యాక్సిస్ అవసరం ఉండదు. సాంగ్స్‌తో పాటు లిరిక్స్‌ను కూడా ఈ మ్యూజిక్ ప్లేయర్ యాప్ ద్వారా ఆస్వాదించవచ్చు.

మ్యూజిక్‌మాక్స్ లిరిక్స్ ప్లేయర్ (MusicMax Lyrics Player)
మ్యూజిక్‌తో పాటు లిరిక్స్‌ను ఆస్వాధించాలనుకునే వారికి మ్యూజిక్‌మాక్స్ లిరిక్స్ ప్లేయర్ ఓ బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఈ యాప్‌లో యాడ్ చేసిన డేటా బేస్‌లో కొన్ని లక్షల పాటలకు సంబంధించి లిరిక్స్ అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో విడుదలయ్యే ప్రతి కొత్త పాట, లిరిక్స్‌తో సహా ఈ ప్లేయర్‌లో అప్‌డేట్ అవుతుంటుంది. ఆండ్రాయిడ్ యూజర్లు ఈ అప్లికేషన్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఎయిర్‌లిరిక్స్ (AirLyrics)
ఎయిర్‌లిరిక్స్ యాప్, మీ ఫోన్‌లో ఇప్పటికే ఉన్న మ్యూజిక్ ప్లేయర్స్‌కు యాడ్-ఆన్‌లా వ్యవహరిస్తుంది. ఈ యాప్ పాటలకు సంబంధించిన లిరిక్స్‌ను స్థానిక భాషల్లోకి సైతం ట్రాన్సలేట్ చేయగలదు. దీంతో వాటిని సలువుగా అర్థం చేసుకునే వీలుంటుంది. మ్యూజిక్‌తో పాటు లిరిక్స్‌ను ఆస్వాధించాలనుకునే ఈ యాప్ ఒక మంచి ఆప్షన్.

లిరిక్స్ మేనియా (Lyrics Mania)
ఈ మ్యూజిక్ ప్లేయర్ యాప్‌లో కావల్సిన మ్యూజిక్‌కు సంబంధించి లిరిక్స్‌ను సెర్చ్ చేసుకోవచ్చు. ఇదే సమయంలో యూట్యూబ్‌తో పాటు స్పాటిఫై వంటి వీడియో అలానే మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసులను ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది.


Click it and Unblock the Notifications








