ఇంకా అదే షాక్‌లో ఉన్నారా.. BSNL నెట్‌వర్క్‌కు మారాలని భావిస్తున్నారా.. ఇలా చేయండి..!
ప్రైవేటు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా గత నెలలో ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రీఛార్జీ ప్లాన్ ధరలను భారీగా పెంచింది. ఈ నెల 3, 4 తేదీల నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఈ మూడు టెలికాం సంస్థ సగటున 15-16 శాతం ధరలను పెంచాయి. అదే సమయంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) పాత ధరలతోనే సేవలు అందిస్తోంది. దీంతోపాటు తక్కువ ధరకే ఎక్కువ ప్రయోజనాలతో కూడిన రీఛార్జీ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది.
ప్రైవేట్ టెలికాం సంస్థ ధరల పెంపుతో BSNL వైపు అనేక మంది యూజర్లు చూస్తున్నట్లు తెలుస్తోంది. తక్కువ ధర సహా త్వరలో 4G సర్వీసులు కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో మరింత మంది యూజర్లు BSNL నెట్‌వర్క్‌కు పోర్టింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే పోర్టింగ్ ప్రక్రియ గురించి పూర్తి కథనం మీకోసం.

మీరు ప్రస్తుతం ఉన్న నెట్‌వర్క్ నుంచి BSNL కు మారేందుకు.. మీ ఫోన్ నుంచి PORT అని టైప్ చేసి స్పెస్ ఇవ్వాలి. స్పెస్ తర్వాత 10 అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి (PORT 94XXXXXXXX). ఆ మెసెజ్‌ను 1900 నంబర్‌కు పంపించాలి. అనంతరం మీకు ఒక UPC (యూనిక్ పోర్టింగ్ కోడ్) వస్తుంది. జమ్ము కశ్మీర్‌లో అయితే మెసెజ్‌కు బదులుగా 1900 నంబర్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది.
ఈ UPC వ్యాలిడిటీ 15 రోజులు లేదా సిమ్ కార్టు పోర్టింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉంటుంది. అదే జమ్ము కశ్మీర్, అస్సోం, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ గడువు 30 రోజులుగా ఉంటుంది. మీరు ప్రస్తుతం వినియోగిస్తున్న టెలికాం నెట్‌వర్క్‌లో ఎటువంటి చెల్లింపులు పెండింగ్‌లో ఉండకూడదు.
యూనిక్ పోర్టింగ్ కోడ్ వచ్చాక మీకు సమీపంలోని BSNL కార్యాలయానికి వెళ్లి, మీ గుర్తింపు కార్డు సహా ఇతర వివరాలు అందించాలి. అయితే BSNL కు పోర్టింగ్ అయ్యేందుకు సంస్థకు ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాలు అందించిన అనంతరం కొత్త సిమ్ కార్డును పొందవచ్చు. నిర్ది్ష్ట గడువులోకి BSNL నెట్‌వర్క్ యాక్టివేట్ కానుంది. ఇందుకు సంబంధించిన వివరాలు కూడా మీరు SMS రూపంలో పొందవచ్చు.
BSNL దేశవ్యాప్తంగా ఆగస్టు నుంచి 4G సర్వీసులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు తక్కువ సమయంలో 5G సేవలను కూడా అప్‌గ్రేడ్ అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన సాఫ్ట్‌వేర్.. ఈ ప్రణాళికకు తగ్గట్టుగానే అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల BSNL 4G రీఛార్జీ ప్లాన్ వివరాలను వెల్లడించింది. PV2399, PV1999, PV997, STV599, STV347, PV199, PV153 వంటి ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. BSNL 4G ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్, 4G డేటా సర్వీసులు సహా ఎంటర్‌టైన్‌మెంట్, గేమింగ్, మ్యూజిక్ వంటి వాల్యూ యాడెడ్ సర్వీసులను పొందవచ్చు. 4G సర్వీసుల కోసం 10000 టవర్లను అప్‌గ్రేడ్ చేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








