Instagram యాప్ లేకుండా 'ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను' పోస్ట్ చేయడం ఎలా?

|

ఇండియాలో ఇప్పుడు సోషల్ మీడియా యాప్ ల వినియోగం ఎక్కువ అయింది. అత్యంత ప్రాచుర్యం పొందిన యాప్ లలో ఒకటైన ఇన్‌స్టాగ్రామ్ ఇప్పటికే తన యొక్క యూజర్లకు రకరకాల ఫీచర్లను విడుదల చేసింది. యూసర్ యొక్క వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడానికి మరియు ఇతరుల గురించి తెలుసుకోవడానికి 'ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్' ఒక మార్గంగా ఉంది. సాధారణ కంటెంట్‌ను పోస్ట్ చేయడంతో పాటుగా ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లో 'స్టోరీస్' ఫీచర్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫాంలో అత్యంత ప్రజాదరణ పొందిన అంశాలలో 'ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్' ఒకటి. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్లను పోస్ట్ చేయడం చాలా మందికి రోజువారీ వ్యవహారంగా మారింది. ఇది సాధ్యమైనంత తేలికగా చేయాలని మీరు కోరుకుంటున్నట్లు స్పష్టంగా ఉంది. అయితే ఇన్‌స్టాగ్రామ్ యాప్ ను ఓపెన్ చేయకుండానే స్టోరీస్ ను ఎలా పోస్ట్ చేయాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

How to Post Instagram Stories Without Instagram App?

Instagram యాప్ లేకుండా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను పోస్ట్ చేయవచ్చా?

ఇన్‌స్టాగ్రామ్ థ్రెడ్స్ యాప్ ఇది సోషల్ మీడియా ప్లాట్‌ఫాం యొక్క తోడుగా ఉండే యాప్. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా థ్రెడ్‌లు Android మరియు iOS వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ యాప్ స్నేహితులతో సులభంగా సంభాషించడానికి ప్రధానంగా డైరెక్ట్ మెసేజ్ లను (DM లు) కలిగి ఉంటుంది. అది కూడా ఇన్‌స్టాగ్రామ్ యాప్ ను ఉపయోగించాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. కానీ ఇది ఒకదానికొకటి స్టోరీలను పంపడానికి మరియు ఇతరుల స్టోరీలను చూడటానికి లేదా మీ ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లో కొన్నింటిని నేరుగా పోస్ట్ చేయడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తుంది. దీనితో మీరు సౌకర్యవంతంగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను అప్‌లోడ్ చేయవచ్చు మరియు దాని కోసం మీరు ఇన్‌స్టాగ్రామ్ యాప్ ను కూడా తెరవవలసిన అవసరం లేదు. ఇందుకోసం కింద ఉన్న పద్దతులను పాటించండి.

Instagram యాప్ లేకుండా స్టోరీలను పోస్ట్ చేసే విధానం

How to Post Instagram Stories Without Instagram App?

స్టెప్ 1: మీ యొక్క ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ పరికరంలో గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ కి వెళ్లి ఇన్‌స్టాగ్రామ్ యాప్ థ్రెడ్‌లను డౌన్‌లోడ్ చేయండి.

స్టెప్ 2: డౌన్‌లోడ్ అయిన తర్వాత యాప్ ను ఓపెన్ చేసి DM లను యాక్సిస్ చేయడానికి స్వయంచాలకంగా యాప్ ద్వారా మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంటులోకి లాగిన్ అవ్వగలరు. మీరు ఇన్‌స్టాగ్రామ్ లేని ఫోన్‌ను ఉపయోగిస్తుంటే కనుక మీరు మ్యానువల్ గా లాగిన్ అవ్వాలి.

స్టెప్ 3: ఇప్పుడు మీరు చాట్ చేయదలిచిన అభిమాన వ్యక్తులను జోడించాలి లేదా స్టోరీలను పంపాలి.

స్టెప్ 4: యాప్ యొక్క పనితీరు గురించి మీకు ఒక ఆలోచన ఇవ్వబడుతుంది. దీని తరువాత మీరు కెమెరా, మైక్రోఫోన్‌కు యాక్సిస్ వంటి కొన్ని అనుమతులను అందించాలి మరియు నోటిఫికేషన్‌లను కూడా అనుమతించాలి.

స్టెప్ 5: అన్ని ఫార్మాలిటీలను క్రమబద్ధీకరించిన తర్వాత మీరు మూడు ప్రధాన విభాగాలతో యాప్ ను కనుగొంటారు. ఇందులో మొదటిది ఇతరుల స్టోరీలు. రెండవ విభాగం అదృశ్యమైన ఫోటోలు/ వీడియోలను క్లిక్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు మూడవది: మీ DM లను యాక్సెస్ చేయండి.

స్టెప్ 6: కెమెరా చిహ్నంతో రెండవ విభాగంలోకి నేరుగా వెళ్ళవచ్చు. ఫోటో లేదా వీడియోను క్లిక్ చేసి ఫిల్టర్లు, స్టిక్కర్లు, క్యాప్షన్ వంటి మరిన్ని అవసరమైన సవరణలను జోడించండి.

స్టెప్ 7: ఫోటో లేదా వీడియోతో సంతృప్తి చెందిన తర్వాత దిగువన ఉన్న పైకి చూపించే బాణం గుర్తు మీద నొక్కండి.

స్టెప్ 8: ఇప్పుడు మీ స్టోరీ ఎంపికను ఎంచుకోండి. మీరు ప్రధాన ఇన్‌స్టాగ్రామ్ యాప్ లోకి వెళ్లకుండా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని పోస్ట్ చేయవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ యాప్ లో చేసినట్లుగానే మీరు స్టోరీలను ప్రజలకు పంపవచ్చు లేదా మీ 'క్లోజ్ ఫ్రెండ్స్' జాబితాతో భాగస్వామ్యం చేయవచ్చు.

Best Mobiles in India

English summary
How to Post 'Instagram Stories' Without Instagram App?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X