Instagram Stories లలో క్విజ్ స్టిక్కర్‌లను పోస్ట్ చేయడం ఎలా?

|

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఇన్‌స్టాగ్రామ్ బాగా పాపులర్ అయింది. పేస్ బుక్ యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ సంస్థ తన వినియోగదారులకు రకరకాల కొత్త ఫీచర్లను అందించింది. అందులో భాగంగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వంటివి కూడా ఉన్నాయి. ఈ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ అనేవి వినియోగదారులు పోస్ట్ చేసిన ఫోటోలు వీడియోలు కేవలం 24 గంటలు మాత్రమే చూడడానికి అవకాశం ఉంటుంది.

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ఫీచర్

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ఫీచర్

ఇన్‌స్టాగ్రామ్ యొక్క స్టోరీస్ ఫీచర్లో ఫోటోలు , వీడియోలు, ఎమోజీలు, టెక్స్ట్, ఫిల్టర్లు వంటివి మరెన్నో జోడించవచ్చు. వీటితో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లోని స్టోరీస్ ఫీచర్ వినియోగదారులకు ఛాలంజెస్, కౌంట్‌డౌన్, ఒత్తిడి స్థాయి వంటి మరిన్ని వివిధ రకాల ప్రయోజనాల కోసం ఉద్దేశించిన క్విజ్ స్టిక్కర్‌లను కూడా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లలో పోస్ట్ చేయడానికి అనుమతిస్తుంది.

 

Also Read: OPPO A52: Elevating The Consumer Experience With Impeccable Design & Powerful Performance

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ క్విజ్ స్టిక్కర్
 

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ క్విజ్ స్టిక్కర్

ఇతర యాప్ లలో క్విజ్ స్టిక్కర్ అనేది చాలా ఆసక్తికరంగా మరియు కొంత క్లిష్టంగా కూడా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ లో వినియోగదారులు వారి యొక్క స్టోరీస్ ఫీచర్ ద్వారా వారి అనుచరులకు బహుళ ఎంపిక సమాధానాలతో కూడిన ప్రశ్నలను అడగడానికి అనుమతిస్తుంది. మీ యొక్క అనుచరులు లేదా కథ వీక్షకులు మీ యొక్క ప్రశ్నలకు ప్రతిస్పందనగా వారి సమాధానాలను కూడా పంపడానికి అనుమతి కూడా ఉంది.

 

Also Read: JioMeet HD వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్!!! 100 మందితో జూమ్‌కు పోటీగా...Also Read: JioMeet HD వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్!!! 100 మందితో జూమ్‌కు పోటీగా...

ఇన్‌స్టాగ్రామ్‌లో క్విజ్ స్టిక్కర్‌లను సెటప్ చేసే పద్ధతులు

ఇన్‌స్టాగ్రామ్‌లో క్విజ్ స్టిక్కర్‌లను సెటప్ చేసే పద్ధతులు

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా క్విజ్ స్టిక్కర్‌లను పోస్ట్ చేయడానికి కింద ఉన్న పద్దతులను పాటించండి. ఇన్‌స్టాగ్రామ్ క్విజ్ స్టిక్కర్ పూర్తిగా బిన్నంగా కాకుండా స్టోరీ ఫార్మాట్ వలె ఉంటుంది.

1. మీ యొక్క ఫోన్ లో ఇన్‌స్టాగ్రామ్ యాప్ ను ఓపెన్ చేయండి

2. ఇందులో ఎడమవైపు ఎగువ మూలలో ఉన్న మీ స్టోరీ లోగోను నొక్కి ఇన్‌స్టాగ్రామ్‌ యొక్క స్టోరీ విభాగాన్ని ఓపెన్ చేయండి.

3. తరువాత స్టోరీ కోసం ఏదైనా ఫోటో లేదా టెక్స్ట్ వంటి ప్రీసెట్ నేపథ్యాన్ని ఉపయోగించండి. తరువాత పైన ఉన్న స్టిక్కర్ చిహ్నాన్ని నొక్కండి.

 

క్విజ్ స్టిక్కర్‌

క్విజ్ స్టిక్కర్‌

4. క్విజ్ స్టిక్కర్‌ను ఎంచుకున్న తరువాత మీ యొక్క ప్రశ్నను మరియు బహుళ ఎంపిక సమాధానాలను నమోదు చేయండి

5. ఇందులో మీరు కేవలం నాలుగు బహుళ ఎంపిక సమాధానాలను మాత్రమే జోడించగలరు.

6. ఇది మొత్తం పూర్తి అయిన తరువాత పైన ఉన్న "ఫినిష్" బటన్‌పై నొక్కండి. తరువాత దిగువన ఉన్న సెండ్ బటన్ మీద నొక్కండి.

 

క్విజ్ స్టిక్కర్‌ పోస్ట్

క్విజ్ స్టిక్కర్‌ పోస్ట్

7. మీరు సృష్టించిన దీన్ని మీ యొక్క పరిచయాల నుండి ప్రత్యేకమైన వారితో పంచుకోవాలనుకుంటున్నారా లేదా స్టోరీగా ఉంచాలనుకుంటున్నారా అని ఎంచుకోండి.

8. మీ యొక్క పోస్ట్ ను అందరికి షేర్ చేయడానికి ప్రతి సంప్రదింపు ఎంపికల ముందు ఉన్న షేర్ బటన్ ఎంపికపై నొక్కండి.

 

Best Mobiles in India

English summary
How to Post Quiz Type Stories in Instagram Stories

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X