ఈ చిన్న ట్రిక్‌తో మీ Instagram రీల్స్‌కు వేలకొద్దీ వ్యూస్ వ‌చ్చేస్తాయి!

|

టిక్‌టాక్ ద్వారా ప్రాచుర్యంలోకి వ‌చ్చిన షార్ట్ వీడియోస్ ట్రెండ్‌కు భార‌త దేశంలో మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్ర‌తి ఒక్కరూ ఈ షార్ట్ వీడియోల‌కు బాగా ఆక‌ర్షితుల‌య్యారు. అయితే, భార‌త్ స‌హా ఇంకా ప‌లు దేశాల మార్కెట్‌లలో టిక్‌టాక్ నిషేధం కంటెంట్ క్రియేట‌ర్ల‌ను కాస్త ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఈ క్ర‌మంలో మెటా కంపెనీకి చెందిన Instagram ప్లాట్‌ఫాం విడుద‌ల చేసిన రీల్స్ ఫీచ‌ర్ దేశ ప్ర‌జ‌ల‌కు చేరువ అయింది.

Instagram

ప్ర‌స్తుతం దేశంలో చాలా మంది Instagram Reelsకు అలవాటు ప‌డిపోయార‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం అక్క‌ర్లేదు. అయితే, ఇన్‌స్టాలో Reels పోస్ట్ చేయ‌డం వాటికి వ్యూస్ పెంచుకోవ‌డానికి చాలా మంది తాప‌త్ర‌య ప‌డుతుంటారు. అలా వ్యూస్ కోసం చూసే వారి కోసం Insta ఓ మార్గాన్ని ప‌రిచ‌యం చేసింది. ఇన్‌స్టా రీల్స్‌ను ఫేస్‌బుక్‌లో క్రాస్ పోస్టింగ్ చేసే అవ‌కాశాన్ని క‌ల్పించింది. ఈ క్రాస్ పోస్టింగ్ ఫీచ‌ర్ గురించి ఇంకా తెలియ‌ని వారు ఎవ‌రైనా ఉంటే మేం ఇక్క‌డ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలియ‌జేస్తున్నాం. మీరు కూడా ఈ ఇన్‌స్టా రీల్స్ ఫేస్‌బుక్‌లో క్రాస్ పోస్టింగ్ చేయడం తెలుసుకోవాల‌నుకుంటే ఈ ఆర్టిక‌ల్ పూర్తిగా చ‌ద‌వండి.

Instagram Reels ఫేస్‌బుక్‌లో క్రాస్-పోస్టింగ్ చేయ‌డం ఇప్పుడు సాధ్యమే:

Instagram Reels ఫేస్‌బుక్‌లో క్రాస్-పోస్టింగ్ చేయ‌డం ఇప్పుడు సాధ్యమే:

Instagram నుండి Facebookకి ఏదైనా రీల్ వీడియోను క్రాస్-పోస్ట్ చేయడానికి అనుమతించే ఫీచర్ అందుబాటులో తెస్తున్నామ‌ని ఇన్‌స్టా చీఫ్ ఆడ‌మ్ మోసెరీ ఇటీవ‌ల‌ ట్విట‌ర్ వేదిక‌గా పేర్కొన్నారు. ఈ కొత్త ఫీచర్‌ని ఉపయోగించుకోవడానికి వినియోగదారులు రెండు ప్లాట్‌ఫారమ్‌లలో రిజిస్టర్డ్ ఖాతాను కలిగి ఉండాలి. ఇటీవ‌ల మోస్సేరి ఓ ప్ర‌క‌ట‌న‌లో మాట్లాడుతూ, ." ప్ర‌జ‌లకు వినోదాత్మక కంటెంట్‌ను అందించ‌డానికి మేము కొన్ని కొత్త రీల్స్ ఫీచర్‌లను ప్రారంభిస్తున్నాము.." అని తెలిపాడు. ఈ సంద‌ర్భంగా అతను IG-టు-FB క్రాస్‌పోస్టింగ్ వంటి ఫీచర్‌లను వెల్లడి చేశాడు. Instagram మరియు Facebookలో ఏకకాలంలో మీ కంటెంట్‌ను విస్తరించాలనుకుంటే ఈ కొత్త ఫీచర్ మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.

Instagram రీల్‌ను Facebookలో ఎలా క్రాస్-పోస్ట్ ఎలాచేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం:

Instagram రీల్‌ను Facebookలో ఎలా క్రాస్-పోస్ట్ ఎలాచేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం:

* ముందుగా మీ మొబైల్ లేదా ట్యాబ్‌లో ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయాలి.
* రీల్‌ను రికార్డ్ చేయ‌డం ప్రారంభించాలి.
* రీల్ రికార్డింగ్ పూర్త‌యిన త‌ర్వాత నెక్స్ట్ బ‌ట‌న్ నొక్కాలి.
* ఇప్పుడు మీకు "షేర్ ఆన్ ఫేస్‌బుక్‌" అనే ఆప్ష‌న్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
* ఆ త‌ర్వాత మీరు ఏదైతే ఫేస్‌బుక్ అకౌంట్‌లో రీల్ ను షేర్ చేయాల‌నుకుంటున్నారో ఆ ఫేస్‌బుక్ ఐడీని ఎంపిక చేసుకోవాలి.
* ఆ త‌ర్వాత షేర్ ఆప్ష‌న్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీ రీల్ ఫేస్‌బుక్‌లో షేర్ విజ‌య‌వంతం అవుతుంది.

మీరు మీ భవిష్యత్లో కూడా Instagram రీల్స్‌ను Facebookకి ఆటోమెటిక్‌గా క్రాస్-పోస్ట్ చేసే ఎంపికను కూడా సెట్ చేయవచ్చు. అయితే, మీరు ఈ ఫీచర్‌ని మాన్యువల్‌గా సెట్ చేయాలి. అది కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కింద ఇస్తున్నాం. ఫాలో అయిపోండి.

మీరు మీ భవిష్యత్లో కూడా Instagram రీల్స్‌ను Facebookకి ఆటోమెటిక్‌గా క్రాస్-పోస్ట్ చేసే ఎంపికను కూడా సెట్ చేయవచ్చు. అయితే, మీరు ఈ ఫీచర్‌ని మాన్యువల్‌గా సెట్ చేయాలి. అది కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కింద ఇస్తున్నాం. ఫాలో అయిపోండి.

* ముందుగా మీ ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను ఓపెన్ చేయాలి.
* త‌ర్వాత మీ ప్రొఫైల్‌పై క్లిక్ చేయాలి.
* ఆ త‌ర్వాత (3 లైన్ ఐకాన్‌)పై క్లిక్ చేసి మోర్ ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలి.
* అనంత‌రం సెట్టింగ్స్ ఆప్ష‌న్ క్లిక్ చేసి ఆ త‌ర్వాత అకౌంట్ సెంట‌ర్ ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలి.
* మీరు క్రాస్-పోస్ట్ చేయాలనుకుంటున్న ఖాతాను మరియు అది పోస్ట్ చేయబడే ఖాతాను జోడించడానికి ఆన్-స్క్రీన్ చూపించే స్టెప్స్‌ను అనుసరించండి.
* ఆ త‌ర్వాత పోస్ట్‌ను ఆటోమేటిక్‌గా షేర్ చేసుకునే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దానిపై నొక్కండి.
* ఈ ప్ర‌క్రియ విజ‌యవంతంగా పూర్తి చేస్తే మీ ఇన్‌స్టా రీల్స్ ఫేస్‌బుక్‌లో ఆటోమెటిక్ క్రాస్‌పోస్టింగ్ ఫీచ‌ర్ యాక్టివేట్ అయిన‌ట్లే అని నిర్దారించుకోవాలి.

Best Mobiles in India

English summary
How To Post Your Instagram Reels On Facebook To Gain More Views

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X