Home
How to

Airportలో Omicron వేరియంట్ RT-PCR పరీక్షను ముందస్తుగా బుక్ చేసుకోవడం ఎలా?

కరోనావైరస్ యొక్క కొత్త Omicron వేరియంట్ కేసులు పెరుగుతున్న ఆందోళనతో దేశంలోని అధికారులు మరియు అన్ని సంస్థలు సంభావ్య మూడవ వేవ్‌ను నిరోధించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. డిసెంబర్ 15 నుండి అంతర్జాతీయ విమానాలను తిరిగి ప్రారంభించే ప్రణాళికలను ప్రభుత్వం విరమించుకుంది. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) తమ యొక్క తప్పనిసరి COVID-19 పరీక్షను ముందస్తుగా బుక్ చేసుకున్న 'రిస్క్' దేశాల నుండి ప్రయాణీకుల కోసం 20 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. కానీ కొన్ని అవాంతరాలు మరియు పొడవైన క్యూలతో విమానాశ్రయంలో చాలా మంది ప్రయాణికులు గందరగోళంలో చిక్కుకుంటున్నారు. కొందరు తమ యొక్క ఆందోళనలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా హైలైట్ చేస్తున్నారు.

How to Pre-Book Omicron Variant RT PCR Test to Avoid Chaos at The Airport?

అయితే అటువంటి గందరగోళం నుండి ప్రయాణీకులను రక్షించడానికి అధికారులు ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసి విమానాశ్రయంలో కొత్తగా ప్రారంభమైన COVID-19 పరీక్షను ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశాన్ని అందించారు. ఢిల్లీ విమానాశ్రయం నుండి ప్రయాణించే వారు RT PCR పరీక్షలను ముందస్తుగా బుక్ చేసుకోవడానికి Air Suvidha పోర్టల్‌ని ఉపయోగించవచ్చు. ఒకవేళ మీరు దీన్ని ముందస్తుగా బుక్ చేసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నట్లు అయితే ఈ సాధారణ గైడ్‌ని అనుసరించండి.

విమానాశ్రయంలో COVID-19 యొక్క RT PCR పరీక్షను ముందస్తుగా బుక్ చేసుకునే విధానం

How to Pre-Book Omicron Variant RT PCR Test to Avoid Chaos at The Airport?

స్టెప్ 1- ముందుగా మీ వెబ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేసి ఎయిర్ సువిధ పోర్టల్ కోసం సెర్చ్ చేయండి.

స్టెప్ 2- సైట్ లో మీకు పైన కనబడే బుక్ కోవిడ్-19 పరీక్ష విభాగం మీద నొక్కండి.

స్టెప్ 3- తర్వాత మీరు స్క్రీన్ కుడి వైపున 'మీ స్లాట్‌ను ఇప్పుడే బుక్ చేసుకోండి!' ఎంపికను కనుగొంటారు.

స్టెప్ 4- తరువాత మీ యొక్క ప్రయాణ రకాన్ని ఎంచుకోండి. అంతర్జాతీయ రాక/నిష్క్రమణ కోసం మీరు SDF అభ్యర్థన సంఖ్యను నమోదు చేసి, విధానాన్ని అనుసరించాలి.

స్టెప్ 5- దేశీయ ప్రయాణం కోసం మీరు మీ పేరు, ఇమెయిల్ ID, ఫోన్ నంబర్, ఆధార్ లేదా పాన్ వివరాలు, పిన్ కోడ్, దేశం మొదలైన వివరాలను నమోదు చేయాలి. మీరు అపాయింట్‌మెంట్ తేదీని మరియు స్లాట్‌ను కూడా ఎంచుకోవాలి.

స్టెప్ 6 - వివరాలను పూరించిన తర్వాత ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి. 'ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో టెస్ట్ కోసం నేను బుకింగ్ చేస్తున్నానని నేను నిర్ధారిస్తున్నాను' అని మరియు T&C కోసం బాక్స్‌ని మీరు చూసే చెక్ బాక్స్‌పై నొక్కండి. ఆపై బుక్ నౌ ఎంపికపై నొక్కండి.

స్టెప్ 7- పేమెంట్ తర్వాత మీ COVID పరీక్ష స్లాట్ బుక్ చేయబడుతుంది మరియు మీరు పోర్టల్‌లో షేర్ చేసిన కాంటాక్ట్ నంబర్ మరియు మెయిల్ IDకి వివరాలు పంపబడతాయి.

RT-PCR పరీక్షకు రూ. 500 ఖర్చవుతుందని మరియు ఫలితాలు 6 నుండి 8 గంటల లోపు అందించబడతాయని ప్రయాణికులు గమనించాలి. ర్యాపిడ్ పిసిఆర్ పరీక్షలకు రూ. 3,500 ఖర్చవుతుంది మరియు ఫలితాలు 60 నుండి 90 నిమిషాల్లో అందుబాటులో ఉంటాయి.

Best Mobiles in India

English summary
How to Pre-Book Omicron Variant RT PCR Test to Avoid Chaos at The Airport?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X