గూగుల్ పేలో జరిగే మోసాన్ని ఎలా నివారించవచ్చు?

|

నగదు రహిత లావాదేవీలను ప్రారంభించడం ద్వారా డిజిటల్ పెమెంట్స్ మన జీవితాన్ని సులభతరం చేస్తాయి. కానీ ఈ పెమెంట్స్ కొన్ని నష్టాలను కూడా కలిగిస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్రలోని థానేలో నివసిస్తున్న ఒక వ్యక్తి డిజిటల్ వాలెట్ల ద్వారా డబ్బు కోసం రిక్వెస్ట్ పంపిన స్కామర్ నుండి రూ.1 లక్షకు పైగా నష్టపోయాడు.

స్కామర్

బాధితుడు తన ఫర్నిచర్ అమ్మడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఒక ప్రకటనను పోస్ట్ చేశాడు. స్కామర్ కొనుగోలుదారునిగా నటిస్తూ మొబైల్ వాలెట్లు అయిన - పేటీఎం మరియు గూగుల్ పే ద్వారా చెల్లించవచ్చా అని అడిగాడు. అతను డబ్బును పంపించడానికి బదులుగా అతనికి ఒక రిక్వెస్ట్ పంపాడు.

OTP

దాని తరువాత అతనికి వచ్చిన OTP ను తెలపమని అమ్మకందారుడిని కోరాడు. బాధితుడు తనకు డబ్బులు వస్తున్నాయనుకొని భావించి OTPని ఇచ్చాడు. అతను OTPను తెలిపిన కొన్ని నిమిషాలలో రెండుసార్లు తన అకౌంట్ నుండి డబ్బును విత్డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. అతను మొత్తంగా సుమారు రూ.1 లక్షలకు పైగా డబ్బును మోసపోయాడు.

 

 

ఫ్లిప్‌కార్ట్‌లో గొప్ప ఆఫర్లతో నోకియా 55-inch స్మార్ట్ టీవీ సేల్స్ఫ్లిప్‌కార్ట్‌లో గొప్ప ఆఫర్లతో నోకియా 55-inch స్మార్ట్ టీవీ సేల్స్

బ్లాక్

అటువంటి మోసపూరిత పెమెంట్స్ అభ్యర్థనల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి తెలియని వారి నుండి కొన్ని అభ్యర్థనలు మీకు రాకుండా నిరోధించడానికి Google Pay మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు Google Pay లో మిమ్మల్ని సంప్రదించకూడదనుకునే ఏ వ్యక్తిని అయినా బ్లాక్ చేయవచ్చు.

 

 

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ బూమరాంగ్‌ల కోసం టిక్‌టాక్‌ను పోలిన కొత్త ఫీచర్‌లుఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ బూమరాంగ్‌ల కోసం టిక్‌టాక్‌ను పోలిన కొత్త ఫీచర్‌లు

ఆండ్రాయిడ్

ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ మరియు iOS మొబైల్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం అందుబాటులో ఉంది. గూగుల్ పేలో మోసపూరిత వ్యక్తులను నిరోధించడానికి కింద తెలిపిన సాధారణ దశలను పాటించండి. ఆండ్రాయిడ్ మరియు iOS వినియోగదారులకు ఈ దశలు ఒకే విధంగా ఉంటాయి.


1. మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ పేని ఓపెన్ చేయండి.

 

 

1 మిలియన్ వినియోగదారులను దాటిన ఎయిర్టెల్ వై-ఫై కాలింగ్ సర్వీస్1 మిలియన్ వినియోగదారులను దాటిన ఎయిర్టెల్ వై-ఫై కాలింగ్ సర్వీస్

step2

2. ఇప్పుడు మీరు డబ్బును పంపిన లేదా స్వీకరించిన కాంటాక్ట్ వివరాలను చూపడానికి పైకి జరపండి. ఇది మీ నుండి డబ్బు కోరిన పరిచయాలను కూడా చూపుతుంది.

step3

3. ఇక్కడ మీరు నిరోధించదలిచిన వ్యక్తిని ఎన్నుకోండి మరియు దానిపై నొక్కండి.

step 4

4. మీ ఫోన్‌బుక్‌లో నెంబర్ సేవ్ చేయబడితే "మోర్" బటన్ మీద నొక్కండి. (మోర్ ఆప్షన్ స్క్రీన్ కుడి ఎగువ భాగంలోని మూడు చుక్కలలో ఉంటుంది)

step5

5. ఇక్కడ మీరు బ్లాక్ ఎంపికను కనుగొంటారు. దానిపై క్లిక్ చేయండి.

Google Pay

6. ఒకవేళ మీ స్మార్ట్‌ఫోన్‌లో నెంబర్ సేవ్ చేయబడి ఉండకపోతే మీరు దాని యొక్క గుర్తు మీద నొక్కినప్పుడు మీరు బ్లాక్ ఎంపికను ఆటొమ్యాటిక్ గా చూస్తారు. వినియోగదారులు నెంబర్ ను స్పామ్‌గా కూడా నివేదించవచ్చు

గమనిక: మీరు Google Pay లో ఒకరిని బ్లాక్ చేస్తే వారు ఫోటోలు మరియు Hangouts వంటి కొన్ని ఇతర గూగుల్ ఉత్పత్తులపై కూడా బ్లాక్ చేయబడతారు.

 

Best Mobiles in India

English summary
How to Prevent Fraud in Google Pay

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X