వేసవిలో ల్యాప్‌టాప్, కంప్యూటర్ వినియోగిస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
ల్యాప్‌టాప్‌లు వినియోగిస్తున్న సమయంలో సహజంగానే వేడెక్కుతుంటాయి. అదే వేసవిలో ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మార్చి ప్రారంభంలోనే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత అధికమయ్యే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరికలు వస్తున్నాయి. అయితే ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ తరచూ వేడెక్కుతుంటే మాత్రం పనితీరు కచ్చితంగా దెబ్బతింటుంది. దీంతోపాటు బ్యాటరీ లైఫ్ తగ్గడం సహా అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి.
అయితే ల్యాప్‌టాప్ కేవలం వేసవిలోనే కాకుండా ఇతర కాలాల్లోనూ వేడెక్కుతుంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, ల్యాప్‌టాప్ త్వరగా (Laptop Overheating) వేడెక్కకుండా చూసుకోవచ్చు.

* ల్యాప్‌టాప్ స్టాండ్ :
ల్యాప్‌టాప్ వినియోగిస్తున్న సమయంలో గాలి ప్రవాహం ఎంతో ముఖ్యం. చల్లని గాలి ప్రవాహం సక్రమంగా ఉంటే, డివైజ్ త్వరగా వేడెక్కకుండా ఉంటుంది. దీంతోపాటు స్టాండ్ వినియోగించడం వల్ల, వేడి గాలి బయటకు వెళ్లేందుకు, చల్లని గాలి సక్రమంగా ప్రవహించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే క్లాత్ లేదా బెడ్ పైన నేరుగా ల్యాప్‌టాప్ ఉంచి వినియోగించవద్దు. వేడిగాలి బయటకు వెళ్లేందుకు అవకాశం లేక, ల్యాప్‌టాప్ వేడెక్కుతుంది.
శ ఎక్కువ సమయం పాటు ఛార్జింగ్ :
అనేక మంది యూజర్లు ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టి అలానే గంటల తరబడి వదిలేస్తుంటారు. ల్యాప్‌టాప్ పూర్తి ఛార్జింగ్ అయిన తర్వాత, అలానే ఛార్జర్ కనెక్ట్ చేసి వదిలేస్తే.. సాధారణం కంటే ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రభావం బ్యాటరీ లైఫ్ పైన పడుతుంది. దీంతోపాటు 100 శాతం వరకు ఛార్జింగ్ చేయకుండా 80-90 శాతం ఛార్జింగ్ చేయడం ఉత్పత్తం.

* నేరుగా సూర్యకాంతి పడకుండా :
నేరుగా సూర్యకాంతి పడే ప్రదేశంలో ల్యాప్‌టాప్‌ను భద్రతపరచకూడదు, వినియోగించకూడదు. ల్యాప్‌టాప్ సహజంగానే కాస్త వేడిని ఉత్పత్తి చేస్తుంది, అదే ఎండలో వినియోగిస్తుంటే.. మరింత త్వరగా వేడెక్కుతుంది. దీంతోపాటు డిస్‌ప్లే కూడా డ్యామేజీ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సరైన వెంటివేషన్ ఉన్న ప్రదేశంలో ల్యాప్‌టాప్ వినియోగం ఉత్తమం.
* ఫ్యాన్ వినియోగం :
ల్యాప్‌టాప్‌లో సహజంగానే ఫ్యాన్ ఉంటుంది. ఈ ఫ్యాన్ లోపలి వేడి గాలిని బయటకు పంపుతుంది. అయితే అదనంగా కూలింగ్ ప్యాడ్ లేదా ఫ్యాన్, AC ఉపయోగించడం వల్ల ల్యాప్‌టాప్ త్వరగా వేడెక్కకుండా ఉంటుంది. దీంతోపాటు డివైజ్‌లో ఉండే ఫ్యాన్ పనితీరును గమనిస్తుండాలి. పనితీరు సక్రమంగా లేదని, అనిపిస్తే మాత్రం వెంటనే మరమ్మతులు చేయించాలి.
ల్యాప్‌టాప్ లో ఉండే పవర్ సేవర్ మోడ్ ద్వారా తక్కువ విద్యుత్ వినియోగించుకొనేలా చూడవచ్చు. ఫలితంగా వేడి కూడా తగ్గుతుంది. దీంతోపాటు డిస్‌ప్లే బ్రైట్‌నెస్ కూడా అవసరం అయినంత వరకే ఉండేలా చూడాలి. బయట వెలుతురు ఆధారంగా డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌ను సర్దుబాటు చేసుకోవాలి.
ల్యాప్‌టాప్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. దీంతోపాటు పాత సాఫ్ట్‌వేర్‌లు ల్యాప్‌టాప్ వేడెక్కేందుకు ఎక్కువగా కారణం అవుతాయి. అందువల్ల విండోస్, గ్రాఫిక్స్ కార్డు డ్రైవర్లు సహా ఇతర అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు చేస్తుండాలి.


Click it and Unblock the Notifications








