Home
How to

స్మార్ట్‌ఫోన్‌ పోగొట్టుకున్నారా.. ఎవరూ కూడా స్వీచ్‌ ఆఫ్‌ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

స్మార్ట్‌ఫోన్‌లు ఎక్కువగా వినియోగిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉంది. సాధారణంగా అనేక మంది స్మార్ట్‌ఫోన్‌లలో వ్యక్తిగత, బ్యాంకింగ్‌ సహా అనేక వివరాలు ఉంటాయి. ఏదైనా సందర్భంలో ఫోన్‌ను (Smartphone Privacy Tips) పోగొట్టుకుంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. దీంతోపాటు వ్యక్తిగత సమాచార భద్రతపైన ఆందోళన చెందుతుంటారు. అయితే ప్రస్తుతం అనేక ఫీచర్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా ఫోన్‌ లొకేషన్‌ను ట్రాక్ చేయవచ్చు.

ఫోన్‌లను దొంగతనం చేశాక... ఎక్కువ మంది వాటిని స్వీచ్‌ ఆఫ్‌ చేస్తారు. దీంతో ఫోన్‌ లొకేషన్‌ను ట్రాకింగ్‌ చేసేందుకు అవకాశం లేకపోవచ్చు. అయితే ఫోన్‌ను దొంగతనం చేసిన వెంటనే స్వీచ్‌ ఆఫ్‌ చేయకుండా ఉండేలా.. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లలో కొన్ని సెట్టింగ్స్‌ ఉన్నాయి. వీటి ద్వారా ఫోన్‌ ఆన్‌లోనే ఉండేలా చేయవచ్చు. ఫోన్‌ను స్వీచ్‌ ఆఫ్‌ చేసేందుకు పిన్‌ లేదా పాస్‌వర్డ్‌ నమోదు చేయాల్సి ఉంటుంది.

how to protect your android Smartphone when anyone trying to switch off your device

ప్రస్తుతం అనేక ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లలో మెరుగైన గోప్యతా మరియు భద్రతా ఫీచర్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే చాలా మంది మొబైల్‌ వినియోగదారులకు వీటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. స్మార్ట్‌ఫోన్‌లలో ఉన్న ముఖ్య ఫీచర్‌లలో 'Unlock to Power Off' ఫీచర్‌ ఒకటి. ఈ ఫీచర్‌ ద్వారా ఫోన్‌ అన్‌లాక్‌ చేయకుండా స్వీచ్‌ ఆఫ్‌ చేసేందుకు వీలులేకుండా చేయవచ్చు.

ఈ ఫీచర్‌ను ఎలా యాక్టివేట్‌ చేయాలి:
స్టెప్‌ 1 : ఆండ్రాయిడ్ ఫోన్‌ సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేయాలి.
స్టెప్‌ 2 : అనంతరం ప్రైవరీ ఆప్షన్‌ పైన క్లిక్‌ చేయాలి.
స్టెప్‌ 3 : ప్రైవరీ సెట్టింగ్స్‌లోని Unlock to Power Off ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
స్టెప్‌ 4 : మీరు నేరుగా ప్రైవరీ ఆప్షన్‌ను గుర్తించలేని సందర్భంలో సెట్టింగ్స్‌లోని సెర్చ్‌ బార్‌ ద్వారా గుర్తించవచ్చు.

ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఫైండ్‌ మై డివైస్‌ ఆప్షన్‌ ద్వారా పోగొట్టుకున్న స్మార్ట్‌ఫోన్‌ లొకేషన్‌ను ట్రాక్‌ చేయవచ్చు. అయితే ఈ ఫీచర్‌ పనిచేయాలంటే.. స్మార్ట్‌ఫోన్‌ పవర్‌ ఆన్‌లోనే ఉండాలి. మరియు ఇంటర్నెట్‌ కనెక్టివిటీ ఉండాలి. అన్నింటి కంటే ముఖ్యంగా Find My Phone ఫీచర్‌ను మీ ఫోన్‌లో యాక్టివేట్‌ చేసుకొని ఉండాలి.

* తెలంగాణ పరిధిలోని స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు www.tspolice.gov.in లేదా www.ceir.gov.in ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. కేంద్ర టెలికమ్యూనికేషన్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్ట్రార్‌ (CEIR) పోర్టల్‌ ద్వారా పోలీసులు ఈ తరహా ఫోన్‌లను ట్రాక్‌ చేస్తున్నారు.

తెలంగాణలో ఈ విభాగానికి సీఐడీ అదనపు డీజీ శిఖాగోయల్ నోడల్‌ అధికారిగా ఉన్నారు. పోగొట్టుకున్న ఫోన్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్ట్రార్‌ (CEIR) లో నమోదు చేస్తారు. ఈ ఫోన్‌ను ఎవరైనా వినియోగించేందుకు ప్రయత్నం చేస్తే వారిని ట్రాక్‌ చేసి, ఆ ఫోన్‌ను స్వాధీనం చేసుకుంటారు. అనంతరం బాధితులకు అందిస్తారు.

ఈ విధానంలో ద్వారా 2024 జనవరి 1 నుంచి జులై 25 వరకు 21,193 ఫోన్‌లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. తెలంగాణలోని 780 పోలీస్‌ స్టేషన్‌లలో ఈ CEIR పోర్టల్‌ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు సీఐడీ అదనపు డీజీ శిఖా గోయల్‌ వెల్లడించారు. ఈ వివరాలను సీఐడీ రాష్ట్ర కార్యాలయం నుంచి పర్యవేక్షణ చేస్తామని చెప్పారు.

More from GizBot

Best Mobiles in India

English summary
how to prevent others from turning off your lost smartphone by enable unlock to power off features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X