మీ మొబైల్ ఫోన్లు పేలకుండా ఉండాలంటే ఏం చేయాలి ( సింపుల్ ట్రిక్స్ )

|

మీరు మొబైల్ వాడుతున్నారా..అయితే దానితో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. లేకుంటే ప్రాణానికి ఎసరు తెచ్చుకున్నట్లేనని వారు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య మొబైల్ ఫోన్స్ పేలిపోతున్నాయి. ఛార్జింగ్ పెట్టిన ఫోన్లు.. జేబులో ఉన్న ఫోన్లు ఇలా వాటికి అవే పేలిపోతున్నాయి. కొంతమంది చేతుల్లో పేలగా కొంతమందికి జేబులో పెట్టుకుంటే పేలిపోతున్నాయి. దీంతో చాలామంది తీవ్రగాయాల పాలవుతున్నారు. కొంతమందైతే చనిపోతున్నారు. ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత మొబైల్ వాడే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేకుండా సమస్యలను కొని తెచ్చుకోవాల్సిందేనని చెబుతున్నారు. కాబట్టి మీరు మొబైల్ వాడుతుంటే కనీస జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం మీరు ఏం చేయాలంటే...

 

ఎయిర్‌టెల్ సంచలనం రూ. 49కే 3జిబి డేటాఎయిర్‌టెల్ సంచలనం రూ. 49కే 3జిబి డేటా

మొబైల్ పేలకుండా ఉండాలంటే..

మొబైల్ పేలకుండా ఉండాలంటే..

మొబైల్ పేలకుండా ఉండాలంటే ఎప్పుడైనా ఛార్జింగ్ 96 శాతం కంటే ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. 20 శాతం కంటే తక్కువ ఉండకుండా ఛార్జ్ చెయ్యాలి. అలాగే మొబైల్‌కి పౌచ్ ఉంటే తీసేసి ఛార్జింగ్ పెట్టాలి. మొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు హీట్‌గా ఉంటే 5 లేదా 10 నిమిషాల పాటు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆ తరువాత ఛార్జింగ్ పెట్టాలి.

మొబైల్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు

మొబైల్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు

మొబైల్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు వైఫై, హాట్ స్పాట్, సాంగ్స్, నెట్, కాల్స్, గేమ్స్ పొరపాటున కూడా వాడకూడదు. మొబైల్‌కి వచ్చిన ఛార్జర్ పాడైతే మీ మొబైల్ కంపెనీ ఛార్జర్‌ని కొనుక్కుని వాడాలి. 100 రూపాయల కన్నా తక్కువ వచ్చే ఛార్జర్లను వాడకూడదు.

అవసరం లేని అప్లికేషన్స్ వెంటనే..
 

అవసరం లేని అప్లికేషన్స్ వెంటనే..

మీకు అవసరం లేని అప్లికేషన్స్ వెంటనే మొబైల్ ఫోన్స్ నుంచి తీసెయ్యాలి. కొన్ని గేమ్స్, అప్లికేషన్స్ వల్ల మొబైల్ విపరీతంగా హీట్‌ అవుతుంది. వాటిని వెంటనే అన్ ఇన్‌స్టాల్ చేసెయ్యాలి. 

మొబైల్ ఛార్జింగ్ అయినా వెంటనే..

మొబైల్ ఛార్జింగ్ అయినా వెంటనే..

మొబైల్ ఛార్జింగ్ అయినా వెంటనే వీడియో కాల్, హెవీ గేమ్స్ ఆడకూడదు. ఛార్జింగ్ అయిన తరువాత మొబైల్ హీట్ అయితే 5 నిమిషాల వరకు మొబైల్‌ని పట్టుకోకూడదు.. ప్యాంట్ జేబులో కూడా పెట్టుకోకూడదు.

మొబైల్ ఛార్జింగ్‌లో లేనప్పుడు..

మొబైల్ ఛార్జింగ్‌లో లేనప్పుడు..

మొబైల్ ఛార్జింగ్‌లో లేనప్పుడు కూడా పేలిపోయ్యే ఛాన్స్ ఉంది. టైట్ జీన్స్‌లో మొబైల్‌ని బలవంతంగా ఇరికిస్తే పేలే ప్రమాదం ఉంది. మొబైల్ వాడేటప్పుడు కూడా బాగా హీట్ అయితే వెంటనే స్విచ్ ఆఫ్‌ చేసి చల్లబడ్డాక ఆన్ చేయాలి.

మొబైల్ బ్యాటరీ అయిపోతే ..

మొబైల్ బ్యాటరీ అయిపోతే ..

మీ మొబైల్ బ్యాటరీ అయిపోతే వెంటనే కొత్త ఒరిజినల్ బ్యాటరి తీసుకొని మార్చాలి. కొంతమంది ఛార్జింగ్ పెట్టి ఇయర్ ఫోన్స్‌లో సాంగ్స్ వింటుంటారు. అలా చేయడం వల్ల చాలా రిస్క్. ఇలాంటి విషయాల్లో కూడా ఇప్పటికే ముగ్గురు చనిపోయారు.

వర్షంలో తడిచిన ఫోన్ కోసం జాగ్రత్తలు!

వర్షంలో తడిచిన ఫోన్ కోసం జాగ్రత్తలు!

ప్రమాదవశాత్తూ మీ ఫోన్ నీటిలో తడిచిందా. ఇంతటితో ఫోన్ పని అయిపోయిందని నిరుత్సాహపడొద్దు. చమ్మతాకిడికి లోనైన మొబైల్ ఫోన్‌ను యధావిది స్థాయికి తెచ్చేందుకు ఈ సూచనలను అమలు చేయండి.

1. నీటి తాకిడికి లోనైన మీ డివైజ్ పనితీరు ఎలా ఉందో తొలత చెక్ చేసుకోండి.

బటన్‌లను ఎక్కువగా ప్రెస్ చేయవద్దు..

బటన్‌లను ఎక్కువగా ప్రెస్ చేయవద్దు..

ఈ సందర్భంలో బటన్‌లను ఎక్కువగా ప్రెస్ చేయవద్దు. కీప్యాడ్ పై అధిక ఒత్తిడి తీసుకురావటం వల్ల చమ్మలోనికి ప్రవేశించే ఆస్కారం ఉంది.

బ్యాటరీని వేరు చేయండి

బ్యాటరీని వేరు చేయండి

తరువాతి చర్యగా ఫోన్ నుంచి బ్యాటరీని వేరు చేయండి. ఇలా చేయటం వల్ల షార్ట్ సర్య్యూట్ బెడద తప్పుతుంది.
-

సిమ్ కార్డ్స్..

సిమ్ కార్డ్స్..

తదుపరి చర్యగా కీప్యాడ్ ప్యానెల్‌ను వేరు చేయండి. ఫోన్‌లోని సిమ్ కార్డ్స్ అలాగే మెమరీ కార్డ్‌లను వేరుచేయండి.

24 గంటల పాటు

24 గంటల పాటు

పొడి టవల్ తీసుకుని చమ్మతాకిడికి లోనైన ప్రదేశాన్ని డ్రై చేయండి.
తడిబారిన ప్రదేశం వెచ్చబడిన అనంతరం ఫోన్‌ను 24 గంటల పాటు బిగుతైన ఎయిర్ కంటైనర్‌లో ఉంచండి.
ఫోన్ పూర్తిగా ఆరినట్లు అనిపిస్తే బ్యాటరీని జతచేసి స్విచ్ ఆన్ చేయండి. మీ ఫోన్ ఖచ్చితంగా పనిచేస్తుంది.

Best Mobiles in India

English summary
How to Prevent Your Smartphone from Blasting: 7 Precautions to Take More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X