ఆండ్రాయిడ్ డివైజ్‌లకు ప్రింట్‌షేర్ అప్లికేషన్!

Posted By: Staff

ఆండ్రాయిడ్ డివైజ్‌లకు ప్రింట్‌షేర్ అప్లికేషన్!

 

సాంకేతిక అవసరాలను తీర్చటంలో ఆండ్రాయిడ్ డివైజ్‌లు మరింత దోహదపడుతున్నాయి. లక్షల సంఖ్యలో అప్లికేషన్‌లను సపోర్ట్ చేయగల సామర్ధ్యాన్ని సొంతం చేుసుకున్న ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ అనేక అవసరాలను తీర్చటంలో క్రీయాశీలక పాత్రపోషిస్తుంది. ఆండ్రాయిడ్ కోసం రూపొందించబడిన ‘గూగుల్ ప్లే‌స్టోర్’ లక్షలాది ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లకు నిలయంగా మారింది. ఈ స్టోర్ నుంచి అనేక అప్లికేషన్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాంటి వాటిలో ఒకటి ‘ఫ్రింట్ షేర్’. ఈ అప్లికేషన్‌ను మీ ఆండ్రాయిడ్ డివైజ్‌లో నిక్షిప్తం చేసుకోవటం ద్వారా వై-ఫై, బ్లూటూత్‌ల సౌలభ్యతతో సమీపంలోని ఫ్రింటర్‌లకు అనుసంధానించుకుని ప్రింట్ అవుట్స్ తీసుకోవచ్చు.

ఫ్రింట్ షేర్ అప్లికేషన్‌ను ఏలా ఉపయోగించాలి..?

- ముందుగా మీ టాబ్లెట్ లేదా స్మార్ట్‌ఫోన్‌లోకి గూగుల్ ప్లే‌స్టోర్ నుంచి ‘ఫ్రింట్ షేర్ అప్లికేషన్’ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

- ఇన్స్‌స్టాలింగ్ ప్రక్రియ పూర్తి అయిన అనంతరం అప్లికేషన్‌ను ఓపెన్ చేసి ఆప్షన్‌ల పట్ల స్పష్టమైన అవగాహనకు రావటం మంచిది.

- అనంతరం మీ డివైజ్‌ను ఫ్రింటర్‌కు అనుసంధానించి కావల్సిన డేటాను ఫ్రిట్ అవుట్‌ల రూపంలో తీసుకోండి.

Read In Hindi

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot