విండోస్‌లో మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్‌ను పాస్‌వర్డ్‌ సహాయంతో ప్రొటెక్ట్ చేయడం ఎలా?

|

వినియోగదారులు ఎవరైనా తమ యొక్క వ్యక్తిగత సమాచారం లేదా ఆఫీసుకు సంబందించిన అతి ముఖ్యమైన మరియు సున్నితమైన సమాచారాన్ని వర్క్‌ఫ్లోలో మైక్రోసాఫ్ట్ వర్డ్ లేదా ఇతర ఆఫీస్ యాప్ లలో స్టోర్ చేయాలని చూస్తే కనుక మీరు ఆ డాక్యుమెంట్లకు రక్షణగా పాస్‌వర్డ్‌ను పరిగణిలోకి తీసుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు మీరు సున్నితమైన సమాచారాన్ని కలిగి ఉన్న వర్డ్ డాక్యుమెంట్‌ను పబ్లిక్ ఫోల్డర్‌లో స్టోర్ చేసినప్పుడు ఇతరులు సులభంగా యాక్సెస్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ సందర్భంలో మీరు ఆ ఫైల్‌కు రక్షణగా పాస్‌వర్డ్‌ను కలిగి ఉండడం అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం. అలాగే ఈ పాస్‌వర్డ్‌ను డాక్యూమెంటును యాక్సెస్ చేయాల్సిన వారితో మాత్రమే పంచుకోవాలి. వర్డ్ డాక్యుమెంట్‌కు పాస్‌వర్డ్‌ను ఎలా క్రీయెట్ చేయాలో తెలుసుకోవడానికి కింద ఉన్న ఈ గైడ్‌ను అనుసరించండి.

How To Protect Microsoft Word Document With Password In Windows

విండోస్‌లో మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్‌ను పాస్‌వర్డ్‌ సహాయంతో రక్షించే విధానం

సున్నితమైన సమాచారాన్ని కలిగి ఉన్న మీ డాక్యుమెంట్‌లపై సురక్షితమైన పాస్‌వర్డ్‌ను ఉంచడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం. ఇప్పుడు Windows లో మీ వర్డ్ డాక్యుమెంట్‌ను రక్షించడానికి పాస్‌వర్డ్‌ను క్రీయెట్ చేయడానికి ఈ దశలను అనుసరించండి.

*** మీ విండోస్ మెషీన్‌లో మైక్రోసాఫ్ట్ వర్డ్‌ను ప్రారంభించి సున్నితమైన సమాచారం గల ఏదైనా డాక్యుమెంట్‌ను ఓపెన్ చేయండి.

*** తరువాత అందులో ఫైల్‌కు వెళ్లి> డాక్యుమెంట్‌ను రక్షించు ఎంపిక మీద క్లిక్ చేయండి> ఎన్ క్రిప్ట్ విత్ పాస్‌వర్డ్‌ ఎంపిక మీద క్లిక్ చేయండి.

*** తరువాత మీరు గుర్తుపెట్టుకునే పాస్వర్డ్ను ఎంటర్ చేసి 'OK' బటన్ మీద క్లిక్ చేయండి. పాస్‌వర్డ్‌ను ధృవీకరించడానికి మీరు మళ్ళీ తిరిగి నమోదు చేయవలసి ఉంటుంది. అలా చేసి 'OK' బటన్ మీద నొక్కండి.

*** ఇది పూర్తయిన తర్వాత మీరు మీ వర్డ్ డాక్యుమెంట్‌ను పాస్‌వర్డ్‌తో రక్షించగలుగుతారు. ఇప్పుడు మీరు మీ డాక్యుమెంట్‌ను మూసివేసి తిరిగి ఓపెన్ చేసినప్పుడు పాస్‌వర్డ్‌ను నమోదు చేయకుండా ఇది ఓపెన్ అవ్వదు.

Best Mobiles in India

Read more about:
English summary
How To Protect Microsoft Word Document With Password In Windows

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X