ప్రయాణాల్లో మీ స్మార్ట్‌ఫోన్ సురక్షితంగా ఉండాలంటే..?

ప్రయాణ సమయాల్లో మనవెంట ఉండాల్సిన ముఖ్యమైన వస్తువుల జాబితాలో స్మార్ట్‌ఫోన్ ఒకటి.

By GizBot Bureau
|

ప్రయాణ సమయాల్లో మనవెంట ఉండాల్సిన ముఖ్యమైన వస్తువుల జాబితాలో స్మార్ట్‌ఫోన్ ఒకటి. జర్నీలు చేస్తున్నపుడు స్మార్ట్‌ఫోన్‌లను క్యారీ చేయటం వల్ల వేరొకరి పై ఆధారపడకుండా అనేక రకాల కమ్యూనికేషన్ అవసరాలను తీర్చుకునే వీలుంటుంది. పబ్లిక్‌లో ఉన్నపుడు ఫోన్‌ సెక్యూరిటీ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇటీవల కాలంలో మనం చూస్తున్నట్లయితే పబ్లిక్ ఏరియాస్‌లో ఫోన్‌లు చోరీకి గురువుతోన్న సంఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. ప్రయాణంలో ఉన్నపుడు అనుకోకుండానో?, అజాగ్రత్త కారణంగానో? మన చేతిలోని ఫోన్ చోరికి గురవటం లేదా పగిలిపోవటం జరిగినపుడు ఏవిధంగా స్పందించాలి అనే దాని పై Asurion కంపెనీకి చెందిన సెల్‌ఫోన్ ఎక్స్‌పర్ట్ బ్రాండన్ బోగ్లే పలు కీలక టిప్స్ సూచించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఫైండ్ మై ఫోన్ ఆప్షన్‌ను Turn on చేసుకోవాలి..

ఫైండ్ మై ఫోన్ ఆప్షన్‌ను Turn on చేసుకోవాలి..

సెల్‌ఫోన్ ఎక్స్‌పర్ట్ బ్రాండన్ బోగ్లే చెబుతోన్న దాని ప్రకారం ప్రయాణానికి సిద్ధమయ్యే ముందు ఐఫోన్ యూజర్లు మన ఫోన్‌లోని ఫైండ్ మై ఫోన్ ఆప్షన్‌ను తప్పనిసరిగా టర్నాన్ చేసుకోవాలి. ఐఫోన్ యూజర్లు ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి iCloud ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే Find My iPhone అనే ఆప్షన్ కనిపిస్తింది. ఈ ఆప్షన్‌ను మాన్యువల్‌గా Turn on చేసుకోవాలి. దీంతో పాటు Send Last Location ఆప్షన్‌ను కూడా Turn on చేసుకున్నట్లయితే ఫోన్ లొకేషన్ ఎప్పటికప్పుడు మీ iCloudలోకి షేర్ కాబడుతుంది.ఒక వేళ మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను వినియోస్తున్నట్లయితే డివైస్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Security & Location విభాగంలో కనిపించే Find My Device ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది. అత్యవసర పరస్థితుల్లో మీ గూగుల్ అకౌంట్ డిటెయిల్స్‌తో Find Your Phone పేజీలోకి వెళ్లటం ద్వారా ఫోన్ లొకేషన్ వివరాలను తెలుసుకునే వీలుంటుంది.

ఫోన్ పోయిన వెంటనే క్యారియర్‌‍ను సంప్రదించాలి....
 

ఫోన్ పోయిన వెంటనే క్యారియర్‌‍ను సంప్రదించాలి....

సెల్‌ఫోన్ ఎక్స్‌పర్ట్ బ్రాండన్ బోగ్లే చెబుతోన్న దాని ప్రకారం ప్రయాణంలో ఉన్నపుడు మీ ఫోన్ చోరీకి గురైనట్లయితే వెంటనే మీ నెట్‌వర్క్ క్యారియర్‌ను సంప్రదించాలి. నెట్‌వర్క్ క్యారియర్‌ను సంప్రదించటం వల్ల తాత్కాలికంగా మీ సర్వీసును వారు సస్పెండ్ చేయటం జరుగుతుంది. దీంతో అవతలి వ్యక్తి మీ ఫోన్‌ను ఆపరేట్ చేసే వీలుండదు. ఒకవేళ మీ స్మార్ట్‌ఫోన్‌కు ఫోన్ ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు రీప్లేస్‌మెంట్ లభిస్తుంది. నెలకు 7 నుంచి 13 డాలర్లు చెల్లించటం ద్వారా ఫోన్ ఇన్సూరెన్స్ అనేది మీకు లభిస్తుంది.

 

 

డివైస్‌తో పాటు డేటాను కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి...

డివైస్‌తో పాటు డేటాను కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి...

సెల్‌ఫోన్ ఎక్స్‌పర్ట్ బ్రాండన్ బోగ్లే చెబుతోన్న దాని ప్రకారం స్మార్ట్‌ఫోన్‌లకు హై-క్వాలిటీ స్ర్కీన్ ప్రొటెక్టర్‌ ఇంకా కేసెస్‌ను సెట్ చేసుకోవటం ద్వారా పగుళ్లు ఇంకా ఎక్స్‌టర్నల్ డ్యామెజీల నుంచి బయటపడవచ్చు. ఇదే సమయంలో ఫోన్‌లోని కంటెంట్‌ను రెగ్యులర్‌గా బ్యాకప్ చేస్తుండం వల్ల డేటా మీ వద్దే భద్రంగా ఉంటుంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో మన ఫోన్ డేటాను వేరొకర యాక్సిస్ చేసుకోకుండా రిమోట్ కంట్రలో విధానంలోఎరేజ్ చేయడానికి వీలుంటుంది.

 

 

ఎమర్జెన్సీ కాంటాక్ట్ సమాచారం లాక్ స్క్రీన్  పై డిస్‌ప్లే అయ్యేలా చూడాలి..

ఎమర్జెన్సీ కాంటాక్ట్ సమాచారం లాక్ స్క్రీన్ పై డిస్‌ప్లే అయ్యేలా చూడాలి..

సెల్‌ఫోన్ ఎక్స్‌పర్ట్ బ్రాండన్ బోగ్లే చెబుతోన్న దాని ప్రకారం ప్రయాణానికి సిద్ధమయ్యే ముందు మనకు సంబంధించిన ఎమర్జెన్సీ కాంటాక్ట్ సమాచారం ఫోన్ లాక్ స్ర్కీన్ పై డిస్‌ప్లే అయ్యేలా చూడాలి. ఇలా చేయటం వల్ల, మన ఫోన్ వేరొకరికి దొరికనట్లయితే లాక్ స్ర్కీన్ పై కనిపించే సమాచారం ఆధారంగా వారు మనల్ని సంప్రదించే వీలుంటుంది. ఈ అంశం పై Asurion కంపెనీ ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం ఫోన్ లాక్ స్క్రీన్ పై ఎమర్జెన్సీ డేటాను ఉంచటం ద్వారా మూడు అంత కంటే ఎక్కువ సార్లు ఆ ఫోన్ తిరిగి లభించే అవకాశం ఉందట. ఫోన్ లాక్ స్క్రీన్ పై ఎమర్జెన్సీ కాంటాక్ట్ సమాచారాన్ని పోస్ట్ చేసే క్రమంలో మీ వ్యక్తిగత సమాచారాన్ని పేపర్ పై రాసి, ఆ సమాచారాన్ని ఫోటో తీసుకుని లాక్ స్ర్కీన్ వాల్ పేపర్ క్రింద సెట్ చేసుకుంటే సరిపోతుంది. పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మీ స్మార్ట్‌ఫోన్‌ను ఇతరులు యాక్సిస్ చేసుకోకుండా ఉండాలంటే Find My Phone లేదా Find My Device ఫీచర్ ద్వారా మీ డివైస్‌ను లాక్ చేసుకోవచ్చు. డివైస్‌ను లాక్ చేయటం ద్వారా లాక్ స్ర్కీన్ పై మీ మెసేజ్ ఇంకా ఫోన్ నెంబర్‌ను ప్రొవైడ్ చేయవచ్చు.

 

 

Best Mobiles in India

English summary
How to protect your cellphone, data when you travel.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X